యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

23, జులై 2013, మంగళవారం

తెలంగాణ రాజకీయ పార్టి పై విమర్శలు - వివరణ

ప్రొ.జయశంకర్" వొడవనిముచ్చట" నుండి

ఇట్స్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్


          ఒకటేంటంటే ఏ ఉద్యమంలో గూడా ఏ నాయకుడు వచ్చినా, రాజకీయ వుద్దేశాలు లేకుండా వస్తరనుకోడం భ్రమ. ఏ పార్టీ అయిన గని, రాజకీయనాయకునికి రాజకీయ ఉద్దేశం లేకుండా ఉద్యమంలో ప్రవేశించే అవకాశమే వుండదు. ఇట్స్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్. ప్రజల ఆకాంక్షలతో అవి కొఇన్సైడ్ అయినపుడు క్లిక్ అయితయ్. ప్రజల ఆకాంక్షలతో రాజకీయ నాయకుడు లేకుంటె క్లిక్ కావు. ఎందుకు కాదంటె మలాంటివాల్లము పోలిటికల్ గ జేయలేయకపోయినం. జీవితమంత గడిపినం గద, గుమ్మందాక బోయినం, గుమ్మం దాటలె. ఎందుకంటే దాటలేం మేం. మేం అంటే మనం దాటలేం.

        ప్రజల చైతన్యాన్ని పెంపొందింపజేస్తం, ఇడిజేస్తాం. ఇష్యూ హైలెట్ జేస్తాం. ఇష్యూ సజీవంగ ఉంచుతం గని పొలిటికల్ యాక్టివిటీ లేకుండనె రాష్ట్రం వస్తుందంటె అది వేరు విషయం గని, పొలిటికల్ యాక్టివిటీ లేంది రాదు అనేది ఒక వాస్తవం. పొలిటికల్ యాక్టివిటీకి పొలిటికల్ నాయకులే రావలె, ఆకాశం మీంచి ఎవరు రారు. జయశంకర్లు, కోదండరామ్ లు సరిపోరు. ఎంత మంచి వాల్లయిన సారిపోరు. మలాంటి వాళ్లం ఎన్నికల్లో పోటీజేస్తే గెలుస్తం గావచ్చు. రెండవ సారి గెలవం మల్ల. ఈ సంస్కృతి లో ఇమడం మేం.  గనుకనే దూరం వున్నం, కనుకనే ఈ మాత్రం గుర్తింపు వుంది అనుకుంటున్నం. లేకపోతే చెన్నారెడ్డి రావడానికి కారణం ఏమిటి? చెన్నారెడ్డి ప్రజాసమితి పెట్టలేదు!

      చారిత్రక వాస్తవం ఏందంటె చెన్నారెడ్డి రాకముందె ప్రజాసమితి వచ్చింది. ఆయన రాకముందె ఉద్యమం వచ్చింది. కని దారి దొరుకుతలేకుండె. ఈ వయొలెన్స్, కాల్పులు, చావడమె గాని దారి దొరుకుతలేకుండె. చాలా మందికి చెన్నారెడ్డి మీద అనుమానం, మాకు గూడ వుండె. కని చెన్నారెడ్డి రావడంతోని ఒక్కసారి ఊపందుకున్నది. చెన్నారెడ్డి రావడం వల్ల జరిగిన లాభం ఏమిటి? నష్టం ఏమిటి? అంటే చెన్నారెడ్డి రావడం వల్ల తెలంగాణ ఉద్యమానికి ఒక పునాది ఏర్పడ్డది. ఆ స్థాయికి పోకపోతే.. ఈ రోజు ఎంత చెడ్డా 1968-69 ప్రాతిపదిక కాదని ఎవడు అనలేడు. చెన్నారెడ్డి స్వార్ధం కొరకే జేసిండా ఆంటె, అనుకొందాం. కని మొదలు పెట్టింది చెన్నారెడ్డి గాదు. ఆ ఊపు వచ్చేది గాదు. రెండవది అది విఫలం గావడానికి కేవలం చెన్నారెడ్డిని మాత్రమే బ్లేమ్ జేయను నేను. చెన్నారెడ్డి గూడ ఒక కారణం. చెన్నారెడ్డి ఎలోన్ వాస్ నాట్ రెస్పాన్సిబుల్. ఆ రోజు తెలంగాణ ప్రజాసమితి పేరుతో ఎన్నికైన మొత్తం ఎంపీలు రెస్పాన్సిబుల్. ఇంక ఇద్దరు బతికే వున్నరు. వెంకటస్వామి, ఎం.సత్యనారాయణరావు. ఈల్లు మూకుమ్మడిగ సరెండర్ అయిపోయిండ్రు... చెప్పక, జేయక. మేం ప్రత్యక్షంగా విట్నెస్ గద! రెండవది ఆరోజు ఇందిరాగాంధి ప్రభావం మొత్తం దేశం మీద ఎట్ల వుండెనంటె... ఆ ఎలక్షన్ లో, మొత్తం దేశంలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలోనే(తప్ప), మొత్తం దేశంలో!  ఈ కాంగ్రెస్ వాల్లకి ఏమిటి, అమ్మో! అమ్మగారి పెత్తనం ఎట్ల అని ఓ.. మూకుమ్మడిగా! చెన్నారెడ్డిగ్గూడ తెల్వదు. ఆ రోజుల్లో చాల క్లోజ్ గ పనిజేసినం ఆయనతోని. చంద్రశేఖరరావుతో ఎట్ల జేస్తున్ననో, అప్పుడు నేను, తోట ఆనందరావు కలిసి అట్లనె జేసీనం.

    అయితె నన్ను, ఆనందరావుని కాంటెస్ట్ జేయమని అడిగిండు చెన్నారెడ్డి. మేం కాదని జెప్పినం. చెన్నారెడ్డి ఐసోలెట్ అయ్యిండు. చెన్నారెడ్డికి ఏముండె అంటె చెన్నారెడ్డిని ఐసోలెట్ జేయాలని వాల్ల ప్లాన్. చెన్నారెడ్డిని ఐసోలెట్ జెయ్యాలని వాల్లేగాదు, యిక్కడ వున్న పి.వి.నరసింహారావు, చొక్కరావు వాల్ల ప్లాన్ గూడ అది. వాల్ల ప్రాముఖ్యత పోతదని. ఐసోలెట్ గావడమా, పవర్ లో ఉన్న పార్టీ ఒడిలో వుండడమా...? ప్రాక్టికల్ పొలిటీషియన్. వాల్లు సరెండర్ గావడమెందుకు, నేనే దీసుకపోయి కలుపుతా అనేటువంటి ప్లానుతోటి పోయిండు ఆయన. కనుక తప్పే. చెన్నారెడ్డి జేసింది రైట్ అనడం లేదు నేను. చెన్నారెడ్డికి విధిలేకుండ అయిపోయింది. చెన్నారెడ్డి స్వార్ధపరుడె, అన్నీ.... ఒప్పుకుంటం. కానీ ఆ రోజున్న సిచుయేషన్ లోపల చెన్నారెడ్డి ఆలోన్ వాస్ నాట్ రెస్పాన్సిబుల్. చెన్నారెడ్డి వాస్ కంపెల్డ్ టు డు దట్ అండ్ హి హ్యాపీలీ డిడిట్.

          ఎవడన్న ఆడిగిండా? ఎవడడగలే. మాలాంటి వాల్లు చూస్తు చూస్తు పక్షుల తీరుగా అయినం. ఏం జేస్తం. ఎందుకంటె రాజకీయంగ మనం ఏం చేయలేం గనుక. వాల్లందరి గెలుపు కొరకు మేం మా ఉద్యోగాలు పోతయని తెలిసినా లెక్కజేయకుండ తిరిగినం. ఎలక్షన్ అయ్యే వరకు, అదీ చెన్నారెడ్డి విషయంలో.  ఇంద్రారెడ్డి వచ్చే వరకు ఏందంటె... ఇంద్రారెడ్డి రాకముందు చాల సెన్సిటైజేషన్ నడిచింది. చాల అంటె చాల నడిచింది. ఇంద్రారెడ్డి నాకు స్టూడెంట్... స్వయాన సిటీ కాలేజీల. నాకు రోజు ఫోను. అప్పటికె ఈ డిబేట్ మొదలయ్యింది. 1994 నుంచి చర్చ మొదలైంది తెలంగాణ మీద. తెలంగాణ ఏదైతె ఐక్య వేదిక పేరుతో కేశవరావ్ జాదవ్, నేను, మాధవరెడ్డి, భూపతి కృష్ణమూర్తి... చర్చ మొదలైంది. పోతె మొదట్నించి మేం పాతకాలపోల్లం. నేను, కాళోజీ, జస్టిస్ మాధవరెడ్డి కలిసి పనిచేసేవాల్లం. ఎక్కడ పోయిన ఇంపార్టెంట్ మీటింగ్స్ కి మేం అడ్డ్రస్ జేసేవాల్లం. మా ముగ్గిరిది ఒక కాంబినేషన్ వుండె ఆ రోజుల్లో, ఐతె ఓ రోజు ఇంద్రారెడ్డి  జస్టిస్ మాధవరెడ్డి, నన్ను, కాళోజిని కలిసి రావాలని కాళోజి దగ్గరకి పోతె... తెలంగాణ గురించి ఎవడు జేసిన వద్దంటామయ్య, ఎవరైన జెయాలి, మంచిగ జెయాలె అంటె, నా దగ్గరకొచ్చిండ్రు. సంతోషమేనయ్య జేస్తే మంచిదేనయ్య. నీ లాంటి యువ కులొస్తే మంచిదె, నిలబడాలయ్య అంటె,  ఆ తప్పక నిలబడత, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదని లాంచ్ జేసిండు. లాంచ్ జేసిండంటె ఒక పార్టీ బెట్టి, ఆ పార్టీకి అండ్ల నాకేదో పొజిషన్, మాధవరెడ్డికి.. ఆయనే ఎనౌన్స్ జేసేసిండు. నేనప్పుడు విశాఖపట్నంలో ఏదో పర్యటనలో  వుండె. పేపర్లో చూసిన, పరేషాన్! ఈ పార్టీ యెక్కడిది? యీ పొజిషన్ యేంది? అని జస్టిస్ మాధవరెడ్డికి ఫోన్ జేసిన. ఈ పోరడు తొందరపడ్డడయ్య అంటె ఐ డిజోన్ ఇట్. నేను డిజోన్ జేయాల్సి వస్తది, డిజోన్ జేస్తే ఆ పోరనికి ఎమౌతుంది? మల్ల అతనితో వాల్ల బ్లెస్సింగ్స్ తోని నేను పార్టీ పెడుతున్న అని. పెట్టిన తర్వాత పార్టీ ఎక్కడ ఏ మీటింగ్ బెట్టిన పికప్పయ్యే దాక. ముగ్గురం నేను, కాళోజి, మాధవరెడ్డి పోయేది, పికప్పయింది.

          ఇంద్రారెడ్డి దొరికిండు మాకొక ఇన్స్ట్రుమెంట్. కని చూస్తే ఏంటి పాతకాలం ముగ్గరం నా కంటె పెద్దోల్లు. కాళోజికున్న ఇమేజ్... జస్టిస్ మాధవరెడ్డికి గూడ. తెలంగాణ విషయంలో చాల పెద్ద ఇమేజే. వ్యక్తిగతంగ వేరే వుండొచ్చు, కని తెలంగాణ విషయంలో చాల కమిట్ మెంట్ తో పనిజేసినం. మేం ముగ్గరం బోతె అది ఫర్మిడబుల్ కాంబినేషన్ అయ్యేది ఆ రోజుల్లో. ఆ పిల్లగానికి ఏందంటె... వాపును జూసీ బలుపు అనుకున్నడు. పాపులారిటీ.. దారి తప్పిండు, ఇగ ఫాస్ట్ గ పోవడం మొదలు బెట్టిండు. అదే రోజుల్లో ఏమైందంటె వార్తా పత్రికలో రామచంద్రమూర్తిగారు ఎడిటర్ వుండె. మేం రాసినయన్ని పబ్లిష్ జేసిండు అప్పుడు వరుసగ..  ఆర్టికల్స్ నావి వరుసగ వచ్చేది. చాలా రోజుల వరకు సీరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చేది. దాంతో చాలా మంది అన్నరు గద ఒక యంగ్ బాయ్ వచ్చిండు, నేను చెప్పడం నా స్టూడెంట్ అని చెప్పుకొనేది, సార్ స్టూడెంట్ గద. పోతె ఈ బ్యాక్ గ్రౌండ్.. లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ తోని వచ్చిండు గద పిల్లవాడు అని అనుకొన్నం. అయ్యే వరకు ఏమైంది.

          అతనేమనుకొన్నడంటె ఇగ తనంతట తను ఎదిగిపోయిండు అనుకొని, ఇండిపెండెంట్ గ యాక్టివిటీస్ జేయడం మొదలుబెట్టి కొలాప్స్ అయ్యిండు. అయి చివరకు కాంగ్రెస్ లో జేరిండు... జూస్తివి గద. కనుక ఇంద్రారెడ్డిది ఏమైందంటె, చెన్నారెడ్డి ఆల్రెడి ఎస్టాబ్లిషిడ్ లీడర్, ఓ సెట్ బ్యాక్ లో వుండె. బాగ రైపెన్ ఆట్మాస్ఫియర్ దొరికింది. ఈ ఇంద్రారెడ్డికి అంత రైపెన్ ఆట్మా స్ఫియర్ దొరకలె. రైపెన్ ముగ్గురు పెద్దమనుషులు దొరికిండ్రు గని రైపెన్ ఆట్మాస్ఫియర్ రాలె. వచ్చేవరకు, కొంత పికప్ అయ్యే వరకు, వార్తా పత్రికలో మొట్టమొదటిసారి వచ్చేవరకు కాస్త ఆయన అతిగా అంచనా వేసుకున్నడు, తగ్గిపోయిండు. ఇగ దాని తర్వాత ఒక దశలో జానారెడ్డి గూడ వుండె. తక్కువ పిరియడె. కనుక రాజకీయ నాయకుడు చెన్నారెడ్డిగాని, ఇంద్రారెడ్డిగాని, జానారెడ్డిగాని తర్వాత చంద్రశేఖర్ రావు గాని ఇండివిడ్యువల్ పొలిటికల్ ఎజెండా లేకుండా వస్తారనుకోవడం భ్రమ. వాల్ల ఎజెండా ఇష్యూతో కోఇన్సైడ్ గావలె.
         
     మాలాంటి వాల్లకు తోచింది ఏందంటె, ఈ ఎజెండా తో కొఇన్ సైడ్   అయి ఒక నాయకుడు వస్తున్నడు. ఇంత మందితో చూసిన మహానుభావులు, నాలాంటి లేక నాతరం వాల్లు, నాతీరుగ ఏందంటె... చెన్నారెడ్డికి, ఇంద్రారెడ్డికి... ఇంద్రారెడ్డితో కంపేర్ జేయలేం. చెన్నారెడ్డి మీద చంద్రశేఖరరావును పోల్చినప్పుడు... జానారెడ్డి, ఇంద్రారెడ్డి ఇట్ల వచ్చి ఇట్ల పోయిండ్రు గాని, ఐడెంటిఫై అయింది మాత్రం వాల్లే. ఇంద్రారెడ్డి పేరు చాలమందికి తెలవను గూడ దెలవదు. మనకు దెలుసు గాని చాలా మందికి దెలవదు.  
   


కామెంట్‌లు లేవు: