సోమవారం 22 మార్చి 2010
WORLD WATER DAY - భూగోళం మీద మనిషికి అందుబాటులొ ఎంత నీరున్నది?
అందులొ 97 లీటర్లు సముద్రాలలొ ఉన్నవి - ఉప్పు నీరు, 3 లీటర్లు మాత్రమె మంచినీరు భూమిపై, భూగర్భంలొ ఉన్నవి.
ఆ 3 లీటర్ల మంచినీరులొ 2.25 లీటర్లు మంచుగడ్డల రూపంలొ ఉన్నవి. 0.70లీటర్లు(ఇందులొ సగం కంటె తక్కువ మనిషికి అందుబాటులొ ఉన్నవి) భూగర్బంలొ ఉన్నవి. 0.05 లీటర్లు సరస్సులలో, నదులలో ఉన్నవి.
అంటె 100 లీటర్లలొ మనిషికి అందుబాటులో ఉన్నది 0.70/2 + 0.05 =0.40 లీటర్ల లోపు (400 మిలీ లోపు)
400 మిలీ కూడా మనిషి చేతికి అందె దూరం లొ లేవు.
క్రింది లింకులొ చూడండి నీటి లభ్యత
నీరు
పద్ధతులు ఇలాగె కొనసాగితె పరిస్థితి 2070 లో ఏవిధంగా ఉండవచ్చొ డా.అబ్దుల్ కలాం గారి ఈ క్రింది link లో చూడండి.
year2070
22, March - WORLD WATER DAY - డా.అబ్దుల్ కలాం గారి హెచ్చరికను మననం చేసుకుందాం
పద్ధతులు ఇలాగె కొనసాగితె పరిస్థితి 2070 లో ఏవిధంగా ఉండవచ్చొ డా.అబ్దుల్ కలాం గారి ఈ క్రింది ప్రెసంటేషన్ లో చూడండి.
year2070
శనివారం 13 మార్చి 2010
తెలంగాణా - అభివృద్ధి గణాంకాలు - శ్రీకృష్ణ కమిటి పరిమితులు
ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి శ్రీక్రిష్ణ కమిటీ పని ప్రారంభించింది.
ఇప్పటివరకు ఒక కమిటిని కాని, ఒక కమీషన్ని కాని ఏదైన ఒక సంఘటన పైన కాని, ఏదైన ఒక నిర్ధిష్ట విషయయం పై కాని వేస్తూ వస్తున్నారు. పరిమితమైన విషయాలపై తేల్చటానికె ఏండ్లకుఏండ్లు పడుతున్నది. కాని ఇప్పుడు ఈ కమిటికి అప్పగించిన పని ఒక హిమాలయమంత పర్వతాన్ని తవ్వమన్నట్లు ఉన్నది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉండవచ్చు కమిటి పని మరియు నివేదిక.
ఈ కమిటిని 2.75 లక్షల చ.కి.మీ. వైశాల్యం కలిగిన, దాదాపు 8 కోట్ల జనాభా కలిగి, భయంకరమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక అంతరాలున్న, కనీస నైతిక విలువలులేని రాజకీయ పక్షాలు కలిగిన ఒక దేశమంతటి స్థాయి గల రాష్ట్రాన్ని 2000 సంవత్సరాల చరిత్ర చూసి, 57 ఏండ్ల లొ పెట్టిన ఖర్చు, అభివృద్ధి లెక్కలు చూసి, అన్ని వర్గాలను సంప్రదించి ఏమి చేయాలో తేల్చమంటున్నారు.
ప్రభుత్వం వద్ద కదలని, పెరగని, తగ్గని భూమి యొక్క యాజమాన్య డాక్యుమెంట్లే లేవు. నెలనెల జీతాలు తీసుకొనె ఉద్యోగుల వివరాలు, లెక్కలు సరిగా లేవు. ఇక గణాంకాలు. Lies, damned lies, gov’t statistics. 57 ఏండ్ల నిధుల ఖర్చు, అభివృద్ధి గణాంకాలు ఉండే అవకాశం లేదు. లెక్కలు ఇవ్వవలసి వస్తే సీమాంధ్ర ప్రభుత్వం (తెలంగాణను సీమాంధ్రులు ఆక్రమించారు) వారికి అనుకూలముగా తయారు చేసి ఇస్తారు. ఎందుకంటె ఇచ్చిన తప్పుడు లెక్కలకును సరిచూసే అవకాశం లేదు.
ఒకవేళ నిజమైన లెక్కలు దొరికిన కేవలం ప్రాంతాలవారిగా చేసిన ఖర్చు ప్రాతిపదికన తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించడ వీలు కాదు. ప్రాంతాల వారి పెట్టిన ఖర్చు, జరిగిన అభివృద్ధి చూడాలంటున్నారు. ఇది సరియైన విధానం కాదు. ఎందుకంటె అభివృద్ధి అనేది మనుషులకు సంబంధించినది. సీమాంధ్ర ప్రాతం మరియు సీమాంధ్రులు అభివృద్ధి చెందినారనేది తెలంగాణవాదుల వాదన. ప్రాంతాలవారిగా, ప్రాంతములవారివారిగా జరిగిన ఖర్చు, అభివృద్ధి చూడవలసి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలొ దాదాపు 40 - 50 లక్షల (హైద్రాబాదులొనె 30-40 లక్షలు) సీమాంధ్రులు స్థిరపడినారు. అంటె దాదాపు 10 % పైగా జనాభా సీమాంధ్రులు. దాదాపు వీరంతా ఉన్నత మరియు ఎగువ మద్యతరగతి వారె. ఈ వలసవచ్చిన వారిలొ అత్యధికలను సాంకేతికంగా స్థానికులుగా గుర్తించుతారు.ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలొ అభివృద్ధి చెందిన వారిలో వీరుంటారు. వీరి అభివృద్ధి మిరుమిట్లుగొలిపె అభివృద్ధి. ఇది తెలంగాణ అభివృద్ధిగా చూపెడుతారు. వీరంతా ఇక్కడ స్థిరపడటానికి కారణాలను చూడలేరు. సాంకేతికంగా చూస్తె చంద్రబాబు, రోశయ్య, చిరంజీవి, జె.సి.దివాకర్ రెడ్డి, సత్యం రామలింగరాజు _ _ _ _ _ _ _ వీళ్లంతా తెలంగాణావాళ్లె. వీరి అభివృద్ధి అంతా తెలంగాణ అభివృద్ధియే. తెలంగాణలోని వ్యాపారాలు, పరిశ్రమలు 90% పైగా సీమాంధ్రులవేనన్న సంగతి అందరికి తెలుసు. కాని ప్రభుత్వ దృష్టిలొ, ఈ కమీటి దృష్టిలొ ఈ అభివృద్ధి అంతా తెలంగాణా అభివృద్ధియే. చివరకు సినిమా పరిశ్రమ అభివృద్ధి కూడా తెలంగాణ అభివృద్ధి క్రిందె లెక్క. ఈ విధంగా అభివృద్ధిని అంచనా వేయడం చేస్తే తెలంగాణా ప్రజలకు న్యాయమెలా జరుగుతుంది. నిజానికి అభివృద్ధి అయినది సీమాంధ్రులు, సీమాంధ్రలోని ప్రాంతాలు, సీమాంధ్రుల వలస ప్రాంతాలు(హైద్రాబాదు, ఆయకట్టు ప్రాంతాలు) మాత్రమె.
తెలంగాణవాదుల దృష్టిలో 1953 నుండి తెలంగాణకు వలసవచ్చిన వారంతా స్థానికేతరులే. ఈ స్థిరపడిన సీమాంధ్రులు కూడా ఇప్పటికి తెలంగాణవాసులిగా వారే పరిగణించుకోవడం లేదు. దీనిని కమీటి పరిగణలోకి తీసుకుంటుందా? దీనిని పరిగణలోకి తీసుకోకుండ తెలంగాణకు అన్యాయం జరిగినట్లు తేల్చగలరా?
చరిత్రలో చారిత్రకావసరంగా నిరంతరంగా సరిహద్దులు మారుతూనేవుంటాయి. ఇది రాజకీయ ప్రక్రియ . We, people of AP, have not started at starting. Also, we are not going to end at the ending. ఇప్పుడు తెలంగాణా ఏర్పాటు చారిత్రకావసరం. భవిష్యత్తులొ సమైక్యాంధ్రా అవసరం కావచ్చు. దీనిని కమిటి తేల్చగలదా?
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను రాజకీయ పార్టీలు రాజకీయ ప్రక్రియ ద్వారా నెరవేర్చాలి. లేనట్లైతె అశాంతి, హింస అనివార్యం . దానికి ఎవరు భాద్యులు?
శనివారం 27 ఫిబ్రవరి 2010
తెలంగాణా - అందుకోలేని అభివృద్ధి
ఎంత తక్కువ శాతం జనాభా వ్యవసాయం చేస్తె దేశం అంత అభివృద్ధి చెందినదిగా అర్దికవేత్తలు, దేశాధినేతలు గుర్తిస్తున్నారు. అంటె జనాభాను వ్యవసేతర రంగాలకు మరలించాలి. (వ్యవసాయం అంటె కుల వృత్తులను కలుపుకొని)
భారత దేశం జనాభా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ జనాభా కూడా వ్యవసాయం మీదే ఆధారపడుతుంది. అందులో తెలంగాణ ప్రాంత జనాభా ఇంకా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది.
స్వతంత్రం వచ్చిన తరువాత ఈ అభివృద్ధి క్రమం ఎలా జరిగింది?
స్వతంత్రం వచ్చేనాటికి జనాభా చాలా ఎక్కువగా వ్యవసాయం మీద అధారపడుతుండేది. అభివృద్ధి జరగాలి అంటె వ్యవసాయం చేసే జనాభా తగ్గాలి. జనాభా ఇతర (పారిశ్రామిక, సేవ) రంగాలకు మరలాలి. ఇదే సమయం లో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గవద్దు. అంటె వ్యసాయ ఉత్పాదకత పెరగాలి. దీనికి నీటిపారుదల ప్రాజెక్టులు కట్టాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అమలు చెయ్యాలి. పారిశ్రామిక, సేవా రంగాల అభివృఇద్ధి జరగాలి అంటె అవసరమైన మానవవనరులు కావాలి. అంటె విద్యా, వైద్యావకాశాలు కల్పించాలి. ఇవన్ని చేయాలంటె పెట్టుబడులు కావాలి. కాని ప్రజల వద్ద పెట్టుబడులు లేవు. కావున వ్యవసాయ, విద్య, వైద్య, పారిశ్రామిక, సేవా రంగాలలో ప్రభుత్వం మాత్రమే అధికంగా పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తూ వచ్చింది. అదే సమయం లొ అట్టడుగు వర్గాల కొరకు సంక్షేమ పథకాలు అమలు చేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెరగడం వలన, మానవ వనరుల అభివృద్ధి (ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలు) వలన జనాభా క్రమంగా ఇతర రంగాలకు తరలుతూ వచ్చినది. ఈ క్రమంలోనె ప్రజల వద్ద కొంత పెట్టుబడులు పోగై, పెట్టుబడులు పెట్టే స్థాయికి వచ్చినారు. ఇది 1947 నుండి 1990 వరకు జరిగినది. అప్పుడే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు మొదలు పెట్టినారు. క్రమంగా ప్రభుత్వం అన్ని రంగాలలొ పెట్టుబడులు తగ్గిస్తు, ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తు వస్తున్నది.
అంటె ప్రభుత్వం వ్యవసాయానికి, విద్యకు, వైద్యానికి, ఉపాధికి ఇచ్చిన తోడ్పాటు వలన ప్రజలు అన్ని
రంగాలలో అభివృద్ధి చెందినారు.
అంటె మౌలికమైన విద్య, వైద్య చివరకు వ్యవసాయం తొ సహ అన్ని రంగాలకు అవసరమగు పెట్టుబడులు, మానవవనరులు సమాజానికి వనగూరినాయి. అంటె సర్వస్వతంత్రం అవుతున్నది. అంటె ప్రజలకు దాదాపు సమాన అవకాశాలు వచ్చినాయి.
ప్రభుత్వం – పెట్టుబడులు
వ్యవసాయం
విద్య
వైద్యం
పారిశ్రామీకరణ
సమాజం - పెట్టుబడులు
వ్యవసాయం
సమాజం - పెట్టుబడులు
విద్య
సమాజం - పెట్టుబడులు
వైద్యం
సమాజం - పెట్టుబడులు
పారిశ్రామీకరణ
సమాజం - పెట్టుబడులు
వ్యవసాయం
---------------
---------------
ఒక వలయం ఏర్పడినది ప్రభుత్వం లేకుండ
ఇప్పుడు డబ్బు ఉంటె ఏ చదువైన చదువవచ్చు. పెట్టుబడి ఉంటె ఏ వ్యాపారమైన, పరిశ్రమైన, సెజ్ అయిన పెట్టుకోవచ్చు. ఇక్కడ కుల, ప్రాంత బేధాలు లేవు. ప్రభుత్వ పాత్ర ఒక సంధానకర్త గానె ఉంటుంది. ప్రకృతి వనరులను కేటాయిస్తుంది.
ఇప్పుడు డబ్బు ఉంటె ఏ చదువైన చదువవచ్చు. పెట్టుబడి ఉంటె ఏ వ్యాపారమైన, పరిశ్రమైన, సెజ్ అయిన పెట్టుకోవచ్చు. ఇక్కడ కుల, ప్రాంత బేధాలు లేవు. ప్రభుత్వ పాత్ర ఒక సంధానకర్త గానె ఉంటుంది.
అంటె ఇప్పుడు ప్రాంతీయ వివక్ష, ఏర్పాటు వాదాలు కాలం చెల్లిన విషయాలు.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అర్థం లేనిది.
అందరం పోటిబడవలసినదె.
తెలంగాణ, సీమాంధ్ర తేడా లేదు. పోటి బడాలి.
అవకాశాలు ఉన్నాయి. కాని అందనివి. అందుకోలేనివి.
కాని 1947-2010 మద్య తెలంగాణ ప్రాంతానికి అందవలసిన ప్రభుత్వ తోడ్పాటును సీమాంధ్రులు అందుకున్నారు. తెలంగాణా వనరులను ఆక్రమించినారు. విద్యావకాశాలు లేవు. వ్యవసాయానికి నీళ్ళు లేవు. ఉద్యోగాలు లేవు.
1947-2010 మద్య తెలంగాణా కు ప్రభుత్వం లేదు. ప్రభుత్వ సహాయం లేదు.
పెట్టుబడులు లేవు.
అవసరమైన మానవవనరులు లేవు.
దాదాపు మనం ఇంకా 1950 లోనే ఆగిపోయాము.
సీమాంధ్రులతో పోటిపడ లేము.
అందుకే మనకు 1947-90 విధానాలు కావాలి.
అందుకె తెలంగాణ కావాలి.
శనివారం 20 ఫిబ్రవరి 2010
తెలంగాణ ఆకాంక్ష - సీమాంధ్ర ప్రభుత్వ అణచివేత - అపహాస్యం - ఆత్మబలిదానాలు
ఇక్కడ కూడా అన్ని ప్రజస్వామిక ఆకాంక్షలకు ఉండేవిధంగా అణిచివేత ఉన్నది. ఈ సీమాంధ్ర ప్రభుత్వ అణచివేతదారులకు ప్రపంచంలో ఎక్కడాలేని అనుకూలతలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు తమ ఆకాంక్షను వెలిబుచ్చటానికి చాలా ప్రతికూలతలు, పరిమితులు ఉన్నాయి. పలితంగా అణచివేత చాలా బహుముఖంగా, కౄరంగా ఉన్నది. తెలంగాణ ప్రజల పరిస్థితి చాలా దమనీయంగా ఉన్నది.
సీమాంధ్రులకు ప్రభుత్వానికి దానిని సమర్ధించుకోవటానికి ఉన్న అనుకూలతలు - ఆ సమర్ధనల అసంబద్ధతలు:
1.ఈ ప్రభుత్వం తెలంగాణతో కూడుకొని ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంగా చెప్పబడుతున్నది. ఈ ప్రభుత్వం లో తెలంగాణ ప్రాంత ప్రతినిధులు ఉన్నారని, హోం మంత్రి గా కూడా తెలంగాణ ప్రాంత ప్రతినిధి ఉన్నారని చెప్పుతున్నారు.
ఈ ప్రభుత్వం పై స్థాయిలో కీలకమైన స్థానాలలో ఎవరున్నారో చూడండి.
ముఖ్యమంత్రి: రోషయ్య - సీమాంధ్రుడు
శాసన సభ స్పీకర్ - కిరణ్ కుమార్ రెడ్డి - సీమాంధ్రుడు
శాసన సభ డిప్యూటి స్పీకర్ - నాదెండ్ల మనోహర్ - సీమాంధ్రుడు
శాసన మండలి చైర్మన్ - చక్రపాణి - సీమాంధ్రుడు
శాసన మండలి వైస్-చైర్మన్ - మహ్మద్ జాని - సీమాంధ్రుడు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - ఎస్వి ప్రసాద్ - సీమాంధ్రుడు
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ (డిజిపి) - గిరీష్ కుమార్ - సీమాంధ్రుడు
హైద్రాబాద్ నగర పోలిస్ కమీషనర్ - ఎ.కె.ఖాన్ - సీమాంధ్రుడు
ఇవన్ని యాదృచ్చికమా? 40% జనాభా ఉన్న తెలంగాణా వారి స్థానమెక్కడో దీనిని చూస్తె తెలుస్తుంది. ఇక ఉన్న హోం మంత్రి గారి అధికారమెంతో ఎంత తక్కువ చెప్పితె అంత మంచిది. ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్న ఆమెగారు పదవిలో ఇంకా కొనసాగకపోయేవారు.
2.రాష్ట్ర రాజధాని కూడా తెలంగాణ ప్రాంతం లోనె ఉన్నది. పెట్టుబడులు మొత్తం ఈ రాజధానిలోనె పెడుతున్నారు. రాజధానిలో చాలా అభివృద్ధి జరుగుతున్నది. కావున తెలంగాణ అభివృద్ధి జరగటం లేదనటం నిరాధారం అంటున్నారు.
అసలు వారు తెలంగాణాను కలుపుకొనుటకు రాజధాని హైద్రాబాద్ ఒక ముఖ్య కారణం. ఇప్పుడు హైద్రాబాద్ లో 30 నుండి 40 లక్షల సీమంధ్రులు స్థిరపడ్డారు. దురాక్రమణ జరిగినది. గత 53 ఏండ్లనుండి దోచుకున్న ప్రభుత్వ ఉద్యోగాలు, సాగునీటి వనరులు, ఇతర అనేక రకాల వనరులతో పెట్టుబడులు కూడబెట్టుకున్నారు. ఆ పెట్టుబడులతో హైద్రాబాద్ లో స్వంత ఆస్థులను అభివృద్ధి చేసుకున్నారు. కొంతమంది బడా పెట్టుబడుదారులు గేటెడ్ కమ్యూనిటిలు(బంజార, జూబ్లి హిల్స్ లాంటి), వాటిలో రాజభవనాలు కట్టుకొని ప్రపంచంలోనె అత్యంత ఆడంబరంగా బ్రతులను అనుభవిస్తున్నారు. వారికి అండగా సీమాంధ్ర మద్యతరగతి కూడా హైద్రాబాద్ లో బలంగా ఉన్నది. తెలంగాణ ప్రజలకు హైద్రాబాద్ లో ఉన్న ఆస్తులు నామమాత్రం. ఆస్తులు, అభివృద్ధి మొత్తం సీమాంధ్రులది.
3.రాష్ట్ర ప్రజలు అంతా ఒకే భాష మాట్లాడుతున్నారని, చారిత్రకంగా చూసిన ఒక బ్రిటిష్ వారి కాలంలొ 150 లేదా 200 ఏండ్లు తప్ప ఎప్పుడు కలిసే ఉన్నామని అంటున్నారు.
చరిత్ర నడుస్తూ వుంటుంది. ఇప్పుడున్న భౌగోలిక ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ఎప్పుడు లేదు. మేజారిటి తెలుగు ప్రజలతో, ఇతర భాషల ప్రజలతో కలిసి అప్పుడప్పుడు సర్వ స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. కాని, ఇప్పుడున్న తెలుగు ప్రజల రాజ్యం స్వతంత్ర రాజ్యం కాదు. భారత దేశానికి, దాని రాజ్యాంగానికి లోబడి ఉన్న ఒక సామాంత రాజ్యాం మాత్రమే. అంటె ఫెడరల్ స్వభావమున్న దేశంలో అంతర్భాగం. కాబట్టి, తెలంగాణ ఏర్పాటుకు చారిత్రిక కారణాలు అడ్డు చూపడం అసంబద్ధం. తెలంగాణ ఏర్పాటు అనేది చరిత్ర గమనంలో కొంత కాలపరిమితిగల ఇప్పటి తరాల ఏర్పాటుగానె చూడాలి. రాబోయే తరాలు కలిసి ఉండాలి అనుకుంటె మల్లీ సమైక్యాంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసుకోవచ్చు.
4.రాష్ట్రం లో మెజారిటి ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నారని చెప్పుతున్నారు.
దాదాపు 40% జనాభాతో తెలంగాణవారు ఆంధ్రప్రదేశ్ అనబడె ఒక అసంబద్ధ రాష్ట్రం లో అన్యాయమైన ఒడబండికతో ఒక మైనారిటి హోదాను పొందినారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలంగాణ ప్రజల నుండి తెలుసుకోవాలి. సీమాంధ్రుల ఆకాంక్షలతో సంబంధం లేదు.
5.తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష లేదనటానికి ఒక పార్టి ఎన్నిక్లలో ఓడిపోవడాన్ని చూపెడుతున్నారు.
ఓట్లకు, సీట్లకు ప్రజల ఆకాంక్షలకు సంబంధం లేదు. ఎందుకొంటె తెలంగాణా ఆకాంక్షకు అన్ని పార్టీలు వ్యతిరేకం కాదని ప్రచారం చేసుకున్నాయి. ఇప్పుడు ఏ పార్టి అయిన సమైక్యాంధ్ర నినాధంతో పోటి చేసి తెలంగాణాలో గెలవమని చెప్పమనండి.
6.ఏదైన వెనకబాటు తెలంగాణలొ ఉంటె దానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు భాద్యులంటున్నారు. అంటె వారిని ఎన్నుకున్న ప్రజలే కారణమని చెప్పక చెప్పుతున్నారు.
ఇది వారి ధాష్ఠికానికి పరాకాష్ట. వారు మేజారిటి. వారు తెలంగాణ కంటె ఒక తరం ముందున్నారు. తెలంగాణ రాజకీయ వైపల్యం వలననె తెలంగాణ వివక్షకు గురైనది. తెలంగాణ నాయకులు, సీమాంధ్ర నాయకుల ఆధిపత్యాన్ని అడ్డుకోలేరు. నాయకులను పక్కకు పెట్టి ఇప్పుడు ప్రజలు ముందుకు వచ్చినారు.
ఇలా చెప్పుకుంటూ పోతే సీమంద్రులకు చాలాఅసంబద్ధ అనుకూలతలు ఉన్నాయి.
తెలంగాణ ప్రజలకున్న పరిమితులు:
1 తెలంగాణ ప్రాంతంలో సామాజిక, ఆర్ధిక కారణాలవల్ల నక్షలైట్ ఉద్యమం గత 7,8 ఏండ్ల క్రితం వరకు బలంగా ఉన్నది. చంద్రబాబు, రాజశెఖర రెడ్డిల హయాం లొ ఉక్కు పాదం తొ ఉద్యమాన్ని అణచినారు. దీనిని ఆ ప్రభుత్వాలు గర్వంగా ప్రకటించుకున్నాయి. నిజం కూడా. కాని ఇప్పుడు ఈ తెలంగాణ ఆకాంక్ష వెనక నక్షలైట్స్ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు తమ ఆకాంక్షను తెలిపే క్రమం లో, ప్రభుత్వానికి నిరసనను తెలిపే సమయం లోఉనికిలో లేని నక్సలైట్ల ముద్ర పడకుండా ఉండటానికి చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఉద్యమాలలో జరిగే సాధారణమైన నామమాత్ర హింస, విధ్వంసం కూడా జరగకుండా చూసుకొనవలిసి వస్తుంది. ప్రభుత్వం, సీమాంధ్రులు దీనిని ఉద్యమం బలహీంగా ఉందని చూపెట్టె ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు. హింసకు దిగితే నక్షలైట్ల ముద్రవేసి ఉక్కు పాదం తో అణిచే ప్రయత్నం జరుగుతుంది.
2.పైన చెప్పిన ప్రతిబంధకం కారణంగా, ప్రజాస్వామికంగా ప్రజలను సమీకరించటానికి ప్రయత్నిస్తె, అసాంఘిక శక్తులు విధ్వంసానికి పాల్పడుతాయని సీమాంధ్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తున్నది. దీనిని ప్రతిఘతించి కూడా శాంతియుతంగా చేసే నిరసనలను కూడా ప్రభుత్వం బలాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారు. దీనికి ఉదాహరణ 20.02.2010 నాటి విద్యార్ధుల అసెంబ్లి ముట్టడిని అడ్డుకున్న పద్ధతి. అసాధారణ రీతిలో ఇరువై వేల మంది పోలిసులను ఉపయోగించి విద్యార్ధులను అడ్డుకున్నరు. ఇరువై వేల మంది పోలీసులు కాక జిల్లాలలో పోలిసులు జిల్లా స్థాయిలలోనె విద్యార్దులను అడ్డుకున్నారు. రైల్వే ట్రాకుల పై బాంబుల బూచి చూపెట్టి విద్యార్ధులు రాకుండ రైళ్లను ఆపినారు. ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి కానరాకుండా ఇంత దుర్నీతితొ, పాశవికంగా అడ్డుకోవడం కనీవిని ఎరుగనిది.
3.తెలంగాణ రాజకీయ నాయకత్వం మొత్తం సీమాంధ్ర నాయకత్వం చెప్పినట్లు బూటక ఉద్యమాలు చేసి, ప్రజలను గంధరగోళ పరచడం.
ఇంతటి ప్రతికూల పరిస్థితులలో, తమ ఆకాంక్షను వెలిబుచ్చటానికి మిగిలిన ఏకైక అవాంచనీయ మార్గం ఆత్మ బలిదానాలు.
అత్మబలిదానాలు పర్యవసానంగా హింస ప్రజ్వరిళ్లుతె, పరిస్థితి విషమిస్తే సీమాంధ్ర పెట్టుబడుదారులను, నాయకులను అడ్డుకోలేని సీమాంధ్ర సామాన్య ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉన్నది.
కాబట్టి, సీమాంధ్ర ప్రజాసంఘాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి సీమాంధ్ర పెట్టుబడుదారులను, నాయకులను ఎదిరించాలి.
మంగళవారం 16 ఫిబ్రవరి 2010
సమైక్యాంధ్రుల అపోహలు - ఎన్.టి.ఆర్. - అంధ్రుల ఆత్మాభిమానం - సమైక్యత
శనివారం 9 జనవరి 2010
రాజకీయేతర సమైక్యాంధ్రవాదుల అపోహలు - వివరణ
వీరు లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు:
ప్ర:తెలంగాణ ప్రజలలో తెలంగాణ వాదం ఉంటె టీఆరెస్ పార్టి ఎన్నికలలో ఎందుకు ఓడి పోయింది?
జ:టీఆరెస్ అధినేత కెసీఆర్ యొక్క వ్యక్తిగత బలహీనతలు అతని వాదానికి గుదిబండలుగా మారినాయి. అదే సమయంలో కొందరు సీమాంధ్రులు ఉద్యోగాలు, భూములు, అన్ని రకాల ప్రకృతి వనరులు దోచుకున్నట్లే ఈ తెలంగాణావాదాన్ని కూడా వారివారి పార్టీల ద్వారా కబ్జా చేయించినారు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ తెలంగాణాకు అనుకూలమని టీఆరెస్ తో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. 2009 సంవత్సరంలో టిడిపి పార్టి తెలంగాణాకు అనుకూలమని టీఆరెస్ తో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కూడా తెలంగాణాకు అనుకూలమంటూనే రోశయ్య కమిటి అంటూ ఏదో ఒకటి వేసి తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. పీఆరిపి కూడా చేతనైన వరకు తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. ఈ రెండు ఎన్నికలో "సమైక్యాంధ్ర" వాదన ఉనిక్కే లేదు. ఇంతకు ముందు కూడా లేదు.
తెలంగాణా వాదాన్ని కూడా సీమాంధ్రా నాయకులు కబ్జా చేసి, మోసపూరితంగా టీఆరెస్ ను ఓడించి దానినె ఎప్పుడు ఉనికిలో లేని "సమైకాంధ్రావాదం" గెలుపు అంటున్నారు.
ఇప్పుడు ఈ సీమాంద్రా నాయకులు వారి తొత్తులైన తెలంగాణా కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామా చేయించి మళ్లి పోటిచేసి గెలవమని చెప్పండి.
2004 సంవత్సరంలో గాని, 2009 సంవత్సరంలో గాని కాంగ్రెస్, టిడిపి పార్టీలు తెలంగాణాకు అనుకూలమన్న సీమాంధ్రాలో వారికి వ్యతిరేకత రాలేదు. దీనిని బట్టి సీమాంధ్ర సామన్య ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని తెలుస్తుంది. ఈ ఓట్లే ఈ విషయం చెప్పడం లేదు. ఈ పార్టీలు సీమాంధ్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమై వుంటె ఎన్నికలముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ముందుకు వచ్చేవాళ్లా?
సీమాంధ్ర రాజకీయనాయకులు, బడాపారిశ్రామికవెత్తలు మాత్రమే తెలంగాణాకు వ్యతిరేకమని ఇప్పుడైన అర్ధం కావడం లేదా?
ప్ర:హైద్రాబద్ లో తెలంగాణావాదం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హైద్రాబాదుకు సంబంధం ఏమిటి?
జ:తెలంగాణా వాదం బలంగా వున్నదని, తెలంగాణాకు అన్యాయం జరిగిందని అంగీకరించె కొంతమంది, హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో టీఆరెస్ ఓడిపోతామని బయపడి పోటిచేయలేదని, హైద్రాబద్ లో తెలంగాణావాదం లేదని, కాబట్టి హైద్రాబాదును తెలంగాణానుంచి వేరు చేయాలని అంటున్నారు.
టీఆరెస్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో పోటి చేయకపోవడానికి ఇంతకుముందు చెప్పిన సమాధానమె చెప్పాలి.
సరె హైద్రాబాదులో పూర్తిగా సమైక్యాంధ్రావాదులే అధికంగా ఉన్నారనుకుంటె, ఈ అధికం అనేదానికి కారణమేంటి? మా ఉద్యోగాల కబ్జా, మా భూముల కబ్జా, మా వనరుల దురాక్రమణ పలితమే కాదా హైద్రాబాదు లో ప్రక్కనే ఉన్న మా వారికంటె సీమాంధ్రులు ఎక్కువగా స్థిరపడటానికి.
స్థిరబడటాన్ని మేము అంగీకరిస్తున్నాం. కాని హైద్రాబాద్ తెలంగాణాలో భాగం కాదనకూడదు. ఉద్యోగాలను,భూములను, అన్ని వనరులను దురాక్రమణ చేసి స్థిరపడిన సీమాంధ్రులు హైద్రాబాద్ లో భాగం కాదు. హైద్రాబాద్ నుంచి వారిని వేరు చేయాలి.
ప్ర: గ్లొబలైజెషన్ యుగం లో ఈ వేర్పాటు వాదమేమిటి?
జ: అసలు ఇది కనీస అవగాహన ఉన్నవారు కూడ అడగరు. కాని దురదృష్టం. కొంతమని సీమాంధ్ర యువకులకు అవగాహన లేదనుకుంట. లేకపోతె కొంతమంది సీమాంధ్ర పెద్దలకున్న ఆదిపత్య ధోరణైన అయిండవచ్చు. "స్థానికత" కు ప్రపంచం అంతట ఉనికి ఉన్నది. ఈ రోజు ఆస్ట్రేలియాలో ఏమి జరుగుతుంది? ఇంత అభివృద్ధి చెందినా చాలా యూరోపియన్ దేశాలలో విదేశి ఉద్యోగులకు భత్రత ఉన్నదా? ఆర్ధిక మాంధ్యం సందర్భం లో అమెరికాలో కూడ విదేశియలకు ఉద్యోగాలు తగ్గలేదా? అమెరికా ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ లో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా ఆలోచించలేదా?
మంగళవారం 5 జనవరి 2010
జై తెలంగాణ సినిమా
దర్శకత్వం: తెలంగాణ విద్యార్ధులు
స్క్రీన్ ప్లే, కథ, మాటలు, పాటలు, సంగీతం: తెలంగాణ జనం
నిర్మాతలు: తెలంగాణ జనం
ముఖ్య ప్రతినాయకుడు: చంద్రబాబు నాయుడు
హాస్య ప్రతినాయకులు: చిరంజీవి, లగడపాటి, నన్నపనేని, నాగం
జిత్తులమారి ముసలి ప్రతినాయకుడు: రోశయ్య
సహాయ ప్రతినాయకులు: సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు
అసహాయ ప్రతినాయకులు:తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు
ప్రేక్షకులు: సీమాంధ్ర ప్రజలు
(పొగరుబోతు, మోసకారి సీమాంధ్ర దోపిడి దారులు మా "జై తెలంగాణ" సినిమాను దొంగిలించి దొంగ సినిమా తీస్తున్నారు.)