యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

27, ఫిబ్రవరి 2010, శనివారం

తెలంగాణా - అందుకోలేని అభివృద్ధి

ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి, టిడిపి లకు ఆర్ధిక విధానాలలో మౌలికమైన తేడాలేమిలేవు. 1947 నుండి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి క్రమానికి అవి ఇచ్చె వివరణ దాదాపు ఒక్కటె. మంచి, చెడుల జోలికి వెళ్లకుండ, అంకెల జోలికి వెళ్లకుండ క్లుప్తంగా చెప్పితె ఆ పరిణామ క్రింద చెప్పిన విధంగా వుంటుంది.

ఎంత తక్కువ శాతం జనాభా వ్యవసాయం చేస్తె దేశం అంత అభివృద్ధి చెందినదిగా అర్దికవేత్తలు, దేశాధినేతలు గుర్తిస్తున్నారు. అంటె జనాభాను వ్యవసేతర రంగాలకు మరలించాలి. (వ్యవసాయం అంటె కుల వృత్తులను కలుపుకొని)

భారత దేశం జనాభా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ జనాభా కూడా వ్యవసాయం మీదే ఆధారపడుతుంది. అందులో తెలంగాణ ప్రాంత జనాభా ఇంకా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది.

స్వతంత్రం వచ్చిన తరువాత ఈ అభివృద్ధి క్రమం ఎలా జరిగింది?

స్వతంత్రం వచ్చేనాటికి జనాభా చాలా ఎక్కువగా వ్యవసాయం మీద అధారపడుతుండేది. అభివృద్ధి జరగాలి అంటె వ్యవసాయం చేసే జనాభా తగ్గాలి. జనాభా ఇతర (పారిశ్రామిక, సేవ) రంగాలకు మరలాలి. ఇదే సమయం లో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గవద్దు. అంటె వ్యసాయ ఉత్పాదకత పెరగాలి. దీనికి నీటిపారుదల ప్రాజెక్టులు కట్టాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అమలు చెయ్యాలి. పారిశ్రామిక, సేవా రంగాల అభివృఇద్ధి జరగాలి అంటె అవసరమైన మానవవనరులు కావాలి. అంటె విద్యా, వైద్యావకాశాలు కల్పించాలి. ఇవన్ని చేయాలంటె పెట్టుబడులు కావాలి. కాని ప్రజల వద్ద పెట్టుబడులు లేవు. కావున వ్యవసాయ, విద్య, వైద్య, పారిశ్రామిక, సేవా రంగాలలో ప్రభుత్వం మాత్రమే అధికంగా పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తూ వచ్చింది. అదే సమయం లొ అట్టడుగు వర్గాల కొరకు సంక్షేమ పథకాలు అమలు చేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెరగడం వలన, మానవ వనరుల అభివృద్ధి (ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలు) వలన జనాభా క్రమంగా ఇతర రంగాలకు తరలుతూ వచ్చినది. ఈ క్రమంలోనె ప్రజల వద్ద కొంత పెట్టుబడులు పోగై, పెట్టుబడులు పెట్టే స్థాయికి వచ్చినారు. ఇది 1947 నుండి 1990 వరకు జరిగినది. అప్పుడే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు మొదలు పెట్టినారు. క్రమంగా ప్రభుత్వం అన్ని రంగాలలొ పెట్టుబడులు తగ్గిస్తు, ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తు వస్తున్నది.

అంటె ప్రభుత్వం వ్యవసాయానికి, విద్యకు, వైద్యానికి, ఉపాధికి ఇచ్చిన తోడ్పాటు వలన ప్రజలు అన్ని

రంగాలలో అభివృద్ధి చెందినారు.

అంటె మౌలికమైన విద్య, వైద్య చివరకు వ్యవసాయం తొ సహ అన్ని రంగాలకు అవసరమగు పెట్టుబడులు, మానవవనరులు సమాజానికి వనగూరినాయి. అంటె సర్వస్వతంత్రం అవుతున్నది. అంటె ప్రజలకు దాదాపు సమాన అవకాశాలు వచ్చినాయి.

ప్రభుత్వం – పెట్టుబడులు

వ్యవసాయం

విద్య

వైద్యం

పారిశ్రామీకరణ
సమాజం - పెట్టుబడులు

వ్యవసాయం
సమాజం - పెట్టుబడులు
విద్య
సమాజం - పెట్టుబడులు
వైద్యం
సమాజం - పెట్టుబడులు
పారిశ్రామీకరణ
సమాజం - పెట్టుబడులు
వ్యవసాయం
---------------
---------------


ఒక వలయం ఏర్పడినది ప్రభుత్వం లేకుండ

ఇప్పుడు డబ్బు ఉంటె ఏ చదువైన చదువవచ్చు. పెట్టుబడి ఉంటె ఏ వ్యాపారమైన, పరిశ్రమైన, సెజ్ అయిన పెట్టుకోవచ్చు. ఇక్కడ కుల, ప్రాంత బేధాలు లేవు. ప్రభుత్వ పాత్ర ఒక సంధానకర్త గానె ఉంటుంది. ప్రకృతి వనరులను కేటాయిస్తుంది.

ఇప్పుడు డబ్బు ఉంటె ఏ చదువైన చదువవచ్చు. పెట్టుబడి ఉంటె ఏ వ్యాపారమైన, పరిశ్రమైన, సెజ్ అయిన పెట్టుకోవచ్చు. ఇక్కడ కుల, ప్రాంత బేధాలు లేవు. ప్రభుత్వ పాత్ర ఒక సంధానకర్త గానె ఉంటుంది.

అంటె ఇప్పుడు ప్రాంతీయ వివక్ష, ఏర్పాటు వాదాలు కాలం చెల్లిన విషయాలు.

తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అర్థం లేనిది.

అందరం పోటిబడవలసినదె.

తెలంగాణ, సీమాంధ్ర తేడా లేదు. పోటి బడాలి.

అవకాశాలు ఉన్నాయి. కాని అందనివి. అందుకోలేనివి.

కాని 1947-2010 మద్య తెలంగాణ ప్రాంతానికి అందవలసిన ప్రభుత్వ తోడ్పాటును సీమాంధ్రులు అందుకున్నారు. తెలంగాణా వనరులను ఆక్రమించినారు. విద్యావకాశాలు లేవు. వ్యవసాయానికి నీళ్ళు లేవు. ఉద్యోగాలు లేవు.
1947-2010 మద్య తెలంగాణా కు ప్రభుత్వం లేదు. ప్రభుత్వ సహాయం లేదు.
పెట్టుబడులు లేవు.
అవసరమైన మానవవనరులు లేవు.
దాదాపు మనం ఇంకా 1950 లోనే ఆగిపోయాము.

సీమాంధ్రులతో పోటిపడ లేము.

అందుకే మనకు 1947-90 విధానాలు కావాలి.

అందుకె తెలంగాణ కావాలి.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

enta cheppina ee andhra murkhulu vinipinchukoru...
ee sangatulanni veellaku teliyaka kaadu..
donga taanu dongatanm chesadani cheptada?
vaallu balavantulu kaabatti vaalla rajyam nadustondi..
vaallu suitcase lu ivvagalaru.. dabaayincha galaru...
akhari nimisam varaku talangana nu addukone prayatnam chestaaru.. mana netalu vaalla mocheti neellu taage kukkalu..
prajale ippudu thama rashtranni sadhinchukovali

చదువరి చెప్పారు...

తమకు నిజమైన శత్రువు తమ నాయకులేనని తెలుసుకోలేనంత అమాయకులు తెలంగాణ ప్రజలు. మన శత్రువు ’అద్గదుగో.. వాడే, వాడే’ నని తేలిగ్గా చెప్పి, ఒప్పించగల చాకచక్యం తెలంగాణ నాయకులదైతే, ఔనౌను, నిజంనిజమని తలలూపే అమాయకజీవులు తెలంగాణ ప్రజలు.

సొంత ప్రజలనే మోసపుచ్చడం తెలంగాణ నాయకుడి రక్తంలో ఉంటే, ఎన్నేళ్ళైనా గ్రహించని అమాయకత్వం ప్రజలదైతే, గ్రహించనివ్వని బాధ్యతను ప్రొఫెసర్లు, ఉద్యోగులు, కవులు, కళాకారులు వగైరా మేధావులు స్వీకరించారు. తిట్టుకవిత్వంతో కవి రెచ్చగొడతాడు, గజ్జెకట్టి, వేదికలెక్కి ఆయా గేయాలను పాడి గాయకుడు రెచ్చగొడతాడు.

వీళ్ళంతా కలిసి, ఆంద్రోళ్ళను నానాతిట్లూ తిట్టి, సాటి ప్రజలపై ద్వేషం కలిగించడంలో కృతకృత్యులయ్యారు.

సమతలం చెప్పారు...

చదువరిగారు,
సీమాంధ్ర నాయకులు తెలివైనవాళ్లు, సమర్ధులు (మంచివారని కాదు). మా తెలంగాణ నాయకులు తెలివిలేని అసమ్మర్ధులు. డిశంబర్ 9 ప్రకటన మరునాడు చంద్రబాబు, జగన్ నాయకత్వం లో ఒకే రోజు 150 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినారు.అసెంబ్లిలో గౌరవ స్పీకర్ రాజీనామాల వేలం పాట అతి సంతోషంగా పాడారు.
అదే డిశంబర్ 23 తదనంతరం తెలంగాణ జనమంతా కోరుతున్న తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండ ఇదే చంద్రబాబు, జగన్ చూస్తున్నారు.
సీమాంధ్ర నాయకత్వం ఉన్నంతవరకు మా నాయకులేమి చేయలేరు వారి ఊడిగం తప్ప. చివరకు భార్యలవద్దకు పోవద్దన్న మారుమాట్లాడకుంట వింటారు.
సమతలం

చదువరి చెప్పారు...

సమతలం: అసమర్ధులా.. భలే! యాపారాలు చేసి కోట్లకుకోట్లు సంపాదిస్తున్నవాళ్ళు అసమర్ధులా? ఎన్నికల్లో వోట్ల కోసం కోట్లు పారెయ్యగలిగినవాళ్ళు అసమర్ధులా? ఇంట్లోనే బాంబులు చేయించగలిగినవాళ్ళు అసమర్ధులా? ఇక్కడే కాదు ఇతర దేశాల్లో కూడా యాపారాలు చెయ్యగలిగేవాళ్ళు అసమర్ధులా? (ఒక పెద్దాయన ఈ మధ్య గుజరాతులో ఓడలో ఓడరేవులో కొనిపారేసాడంట.. కర్ణాకర్ణిగా విన్నాం) వీళ్ళా అసమర్ధులు? తన పనులు చేసుకోవడానికి కడు సమర్ధుడైనవాడు మన పనులకాడి కొచ్చేసరికి అసమర్ధుడెలా అయ్యాడు? ఎందుకు మీరీ నాయకులను ఇలా ఎనకేసుకొస్తున్నారు? అయితే గియితే వాళ్ళు పాక్షిక అసమర్ధులు కావాలి, సెలెక్టివ్ మయోపియాలాగా!

తెదేపాకు బాబు నాయకుడు. బానే ఉంది. కానీ, బాబు ఒక్కడు, ఏకాకి!! 39 మంది సభ్యులు, వందలమంది సభ్యులు కానివారు, వేలమంది 'అసభ్యులు' -వీళ్ళంతా ఒక వైపు - తెలంగాణ వైపు - ఉండి కూడా, ఒక్ఖ బాబును చూసి భయపడిపోతున్నారా? అందరూ కట్టుగా ఒకమాట మీద ఉన్నాగానీ బాబు వీళ్ళ నోళ్ళు మూయిస్తున్నాడా? హవ్వ! ఎవణ్ణి నమ్మించడానికి ఈ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నార్సార్? ఎందుకు మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసేసుకుంటారు? మీ నాయకులు ఎంత చవట సన్నాసులో, ఎంతటి మోసకారులో చూస్తూ కూడా అవతలి నాయకులను అంటే మీకేమొస్తది? అవతలోడు గొప్ప మొనగాడని నా ఉద్దేశమేమీ కాదు. అందరూ ఒక తానులోని ముక్కలే. కానీ మనోడు పని చెయ్యనపుడు ఆణ్ణే అడగాలి అవతలోణ్ణి అంటే ఒరిగేదేముంది?

సరే తెదేపా సంగతి పక్కనుంచండి. కాంగ్రెసనగానే జగను గుర్తుకొచ్చాడు మీకు. కాంగీయులకు నాయకుడు జగనా? మీకు సోనియా, డీయెస్, మొయిలీ వగైరాలు కనబళ్ళేదా? జైపాల్ రెడ్డికి, మధు యాస్కీకి కూడా జగనే నాయకుడా? కేకేకి, వీహెచ్చికి కూడా జగనేనా? జానా, దామోదరరెడ్డి, చెరుకు ముత్యంరెడ్డిలకు కూడా జగనే నాయకుడా? వంకలు చెప్పడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి మాస్టారూ! అవతలోణ్ణి తిట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటే సరే, తిట్టండి. కానీ, ఈ నాయకులు ఏ రకం మనుషులో మర్చిపోయి, కేవలం అసమర్ధులు మాత్రమేనంటూ వాళ్ళను ఎనకేసుకు రావడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. కావాలని వ్యూహాత్మకంగా అలా మాట్టాడుతున్నారా? లేక నిజంగానే మీ నాయకులు పాక్షిక అసమర్ధులనే భావన మీకుందా?

Praveen Mandangi చెప్పారు...

బ్రిటిష్‌వాళ్ళ కాలంలో కూడా దేశంలో వ్యవసాయంపై ఆధారపడేవాళ్ళ సంఖ్య 70% ఉండేది (అందులో కుమ్మరి, కంచరిలాంటి కులవృత్తులు కలపలేదు), ఇప్పుడు కూడా 70% ఉంది. వృత్తులలో తేడా రాలేదు కానీ కేవలం పట్టణీకరణలో తేడా వచ్చింది. 1951లో మన ఇండియాలో పట్టణీకరణ కేవలం 17% ఉండేది, ఇప్పుడు 27% ఉంది. పట్టణీకరణ పెరిగినా వ్యవసాయంపై ఆధారపడేవాళ్ళ శాతం తగ్గలేదు.