యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

13, మార్చి 2010, శనివారం

తెలంగాణా - అభివృద్ధి గణాంకాలు - శ్రీకృష్ణ కమిటి పరిమితులు

ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి శ్రీక్రిష్ణ కమిటీ పని ప్రారంభించింది.

ఇప్పటివరకు ఒక కమిటిని కాని, ఒక కమీషన్ని కాని ఏదైన ఒక సంఘటన పైన కాని, ఏదైన ఒక నిర్ధిష్ట విషయయం పై కాని వేస్తూ వస్తున్నారు. పరిమితమైన విషయాలపై తేల్చటానికె ఏండ్లకుఏండ్లు పడుతున్నది. కాని ఇప్పుడు ఈ కమిటికి అప్పగించిన పని ఒక హిమాలయమంత పర్వతాన్ని తవ్వమన్నట్లు ఉన్నది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉండవచ్చు కమిటి పని మరియు నివేదిక.

ఈ కమిటిని 2.75 లక్షల చ.కి.మీ. వైశాల్యం కలిగిన, దాదాపు 8 కోట్ల జనాభా కలిగి, భయంకరమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక అంతరాలున్న, కనీస నైతిక విలువలులేని రాజకీయ పక్షాలు కలిగిన ఒక దేశమంతటి స్థాయి గల రాష్ట్రాన్ని 2000 సంవత్సరాల చరిత్ర చూసి, 57 ఏండ్ల లొ పెట్టిన ఖర్చు, అభివృద్ధి లెక్కలు చూసి, అన్ని వర్గాలను సంప్రదించి ఏమి చేయాలో తేల్చమంటున్నారు.


ప్రభుత్వం వద్ద కదలని, పెరగని, తగ్గని భూమి యొక్క యాజమాన్య డాక్యుమెంట్లే లేవు. నెలనెల జీతాలు తీసుకొనె ఉద్యోగుల వివరాలు, లెక్కలు సరిగా లేవు. ఇక గణాంకాలు. Lies, damned lies, gov’t statistics. 57 ఏండ్ల నిధుల ఖర్చు, అభివృద్ధి గణాంకాలు ఉండే అవకాశం లేదు. లెక్కలు ఇవ్వవలసి వస్తే సీమాంధ్ర ప్రభుత్వం (తెలంగాణను సీమాంధ్రులు ఆక్రమించారు) వారికి అనుకూలముగా తయారు చేసి ఇస్తారు. ఎందుకంటె ఇచ్చిన తప్పుడు లెక్కలకును సరిచూసే అవకాశం లేదు.

ఒకవేళ నిజమైన లెక్కలు దొరికిన కేవలం ప్రాంతాలవారిగా చేసిన ఖర్చు ప్రాతిపదికన తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించడ వీలు కాదు. ప్రాంతాల వారి పెట్టిన ఖర్చు, జరిగిన అభివృద్ధి చూడాలంటున్నారు. ఇది సరియైన విధానం కాదు. ఎందుకంటె అభివృద్ధి అనేది మనుషులకు సంబంధించినది. సీమాంధ్ర ప్రాతం మరియు సీమాంధ్రులు అభివృద్ధి చెందినారనేది తెలంగాణవాదుల వాదన. ప్రాంతాలవారిగా, ప్రాంతములవారివారిగా జరిగిన ఖర్చు, అభివృద్ధి చూడవలసి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలొ దాదాపు 40 - 50 లక్షల (హైద్రాబాదులొనె 30-40 లక్షలు) సీమాంధ్రులు స్థిరపడినారు. అంటె దాదాపు 10 % పైగా జనాభా సీమాంధ్రులు. దాదాపు వీరంతా ఉన్నత మరియు ఎగువ మద్యతరగతి వారె. ఈ వలసవచ్చిన వారిలొ అత్యధికలను సాంకేతికంగా స్థానికులుగా గుర్తించుతారు.ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలొ అభివృద్ధి చెందిన వారిలో వీరుంటారు. వీరి అభివృద్ధి మిరుమిట్లుగొలిపె అభివృద్ధి. ఇది తెలంగాణ అభివృద్ధిగా చూపెడుతారు. వీరంతా ఇక్కడ స్థిరపడటానికి కారణాలను చూడలేరు. సాంకేతికంగా చూస్తె చంద్రబాబు, రోశయ్య, చిరంజీవి, జె.సి.దివాకర్ రెడ్డి, సత్యం రామలింగరాజు _ _ _ _ _ _ _ వీళ్లంతా తెలంగాణావాళ్లె. వీరి అభివృద్ధి అంతా తెలంగాణ అభివృద్ధియే. తెలంగాణలోని వ్యాపారాలు, పరిశ్రమలు 90% పైగా సీమాంధ్రులవేనన్న సంగతి అందరికి తెలుసు. కాని ప్రభుత్వ దృష్టిలొ, ఈ కమీటి దృష్టిలొ ఈ అభివృద్ధి అంతా తెలంగాణా అభివృద్ధియే. చివరకు సినిమా పరిశ్రమ అభివృద్ధి కూడా తెలంగాణ అభివృద్ధి క్రిందె లెక్క. ఈ విధంగా అభివృద్ధిని అంచనా వేయడం చేస్తే తెలంగాణా ప్రజలకు న్యాయమెలా జరుగుతుంది. నిజానికి అభివృద్ధి అయినది సీమాంధ్రులు, సీమాంధ్రలోని ప్రాంతాలు, సీమాంధ్రుల వలస ప్రాంతాలు(హైద్రాబాదు, ఆయకట్టు ప్రాంతాలు) మాత్రమె.

తెలంగాణవాదుల దృష్టిలో 1953 నుండి తెలంగాణకు వలసవచ్చిన వారంతా స్థానికేతరులే. ఈ స్థిరపడిన సీమాంధ్రులు కూడా ఇప్పటికి తెలంగాణవాసులిగా వారే పరిగణించుకోవడం లేదు. దీనిని కమీటి పరిగణలోకి తీసుకుంటుందా? దీనిని పరిగణలోకి తీసుకోకుండ తెలంగాణకు అన్యాయం జరిగినట్లు తేల్చగలరా?

చరిత్రలో చారిత్రకావసరంగా నిరంతరంగా సరిహద్దులు మారుతూనేవుంటాయి. ఇది రాజకీయ ప్రక్రియ . We, people of AP, have not started at starting. Also, we are not going to end at the ending. ఇప్పుడు తెలంగాణా ఏర్పాటు చారిత్రకావసరం. భవిష్యత్తులొ సమైక్యాంధ్రా అవసరం కావచ్చు. దీనిని కమిటి తేల్చగలదా?

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను రాజకీయ పార్టీలు రాజకీయ ప్రక్రియ ద్వారా నెరవేర్చాలి. లేనట్లైతె అశాంతి, హింస అనివార్యం . దానికి ఎవరు భాద్యులు?

4 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చినా, దానికి చట్ట బద్ధత లేదు. నివేదిక తెలంగాణాకి అనుకూలంగా ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తుందన్న గ్యారంటీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్నే ఆంధ్రా వ్యాపార లాబీలు వారం రోజుల్లో ప్రభావితం చేయ గలిగాయి.

కాబట్టి తెలంగాణా ప్రజలు తెలంగాణా వచ్చే వరకూ పోరాటం చేయ వలసిన అవసరం ఉంది. తెలంగాణా ప్రజలలో ఇప్పుడు ఎప్పుడూ లేనంత రాజకీయ చైతన్యం వచ్చింది (thanks to media). ఈ పరిస్తితుల్లో ఏ పార్టీ తెలంగాణా విషయం లో వెనుకకి పోయినా, 2014 ఎన్నికలలో భూస్తాపితం కావడం ఖాయం.

Rao S Lakkaraju చెప్పారు...

మొదట తెలంగాణా వాళ్ళు ఎవరు అని తేల్చుకోవాలి. అయిదు ఏళ్లు తెలంగాణా లో ఉన్నవాళ్ళా? లేక పది లేక ఇరవై ఉన్నవాళ్ళా? తెలంగాణా---గణాంకాలు ఎల్లా చేస్తే బాగుంటుందో శ్రీకృష్ణ కమిటీ కి చెప్పండి. వారు విజ్ఞులు.అంతే గాని వారు చెప్పబోయేవి అన్నీ తప్పు లంటే ఎట్లా?

సమతలం చెప్పారు...

అదేగా సమస్య. 10 ఏండ్లా, 20 ఏండ్లా కాదు. అన్ని ఒప్పందాలు ఉల్లంగించి, ఉద్యోగాలు, వనరులు, నిధులు దోచుకొనడం వల్లె ఈ దుర్మార్గమైన వలసలు, ఆదిపత్యం. వీరిని గుర్తించడం కష్టమె. ఇలా అక్రమంగా వచ్చిన వారంతా స్థానికేతరులే. ఇకపై ఇలాంటి అక్రమ వలసలు, ఆదిపత్యం ఆగటానికి పరిష్కారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటె.

Praveen Mandangi చెప్పారు...

1950 తరువాత తెలంగాణాలో స్థిరపడినవాళ్ళు తాము సెటిలర్లమనే చెప్పుకుంటున్నారు. 1950కి ముందు తెలంగాణాలో స్థిరపడినవాళ్ళే తాము తెలంగాణావాళ్ళమని చెప్పుకుంటున్నారు. ముల్కీ నిబంధనలు మాత్రం పదిహేనేళ్ళుగా తెలంగాణాలో ఉంటున్నవాళ్ళనే తెలంగాణావాసులుగా గుర్తించేవి.