యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

20, ఫిబ్రవరి 2010, శనివారం

తెలంగాణ ఆకాంక్ష - సీమాంధ్ర ప్రభుత్వ అణచివేత - అపహాస్యం - ఆత్మబలిదానాలు

ప్రపంచ చరిత్రలో ఒక ప్రాంత లేదా ఒక జాతి ప్రజలు తెలంగాణ ప్రజలలాగ బలమైన ఆత్మగౌరవ, స్వపరిపాలన ఆకాంక్షను శాంతియుతంగా ప్రజాస్వామికంగా వెలిబుచ్చిన సంధర్భం లేకపోవచ్చు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా అన్ని విభేధాలను ప్రక్కకు పెట్టి ఒకే వేదిక మీదికి వచ్చిన ఒక మహత్తరమైన సంధర్భం. వీటికి కొలమానాలు, రికార్డుల లాంటివి ఉంటె ఖచ్చితంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కవలసిన సంఘటన.

ఇక్కడ కూడా అన్ని ప్రజస్వామిక ఆకాంక్షలకు ఉండేవిధంగా అణిచివేత ఉన్నది. ఈ సీమాంధ్ర ప్రభుత్వ అణచివేతదారులకు ప్రపంచంలో ఎక్కడాలేని అనుకూలతలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు తమ ఆకాంక్షను వెలిబుచ్చటానికి చాలా ప్రతికూలతలు, పరిమితులు ఉన్నాయి. పలితంగా అణచివేత చాలా బహుముఖంగా, కౄరంగా ఉన్నది. తెలంగాణ ప్రజల పరిస్థితి చాలా దమనీయంగా ఉన్నది.
సీమాంధ్రులకు ప్రభుత్వానికి దానిని సమర్ధించుకోవటానికి ఉన్న అనుకూలతలు - ఆ సమర్ధనల అసంబద్ధతలు:
1.ఈ ప్రభుత్వం తెలంగాణతో కూడుకొని ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంగా చెప్పబడుతున్నది. ఈ ప్రభుత్వం లో తెలంగాణ ప్రాంత ప్రతినిధులు ఉన్నారని, హోం మంత్రి గా కూడా తెలంగాణ ప్రాంత ప్రతినిధి ఉన్నారని చెప్పుతున్నారు.
ఈ ప్రభుత్వం పై స్థాయిలో కీలకమైన స్థానాలలో ఎవరున్నారో చూడండి.
ముఖ్యమంత్రి: రోషయ్య - సీమాంధ్రుడు
శాసన సభ స్పీకర్ - కిరణ్ కుమార్ రెడ్డి - సీమాంధ్రుడు
శాసన సభ డిప్యూటి స్పీకర్ - నాదెండ్ల మనోహర్ - సీమాంధ్రుడు
శాసన మండలి చైర్మన్ - చక్రపాణి - సీమాంధ్రుడు
శాసన మండలి వైస్-చైర్మన్ - మహ్మద్ జాని - సీమాంధ్రుడు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - ఎస్వి ప్రసాద్ - సీమాంధ్రుడు
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ (డిజిపి) - గిరీష్ కుమార్ - సీమాంధ్రుడు
హైద్రాబాద్ నగర పోలిస్ కమీషనర్ - ఎ.కె.ఖాన్ - సీమాంధ్రుడు
ఇవన్ని యాదృచ్చికమా? 40% జనాభా ఉన్న తెలంగాణా వారి స్థానమెక్కడో దీనిని చూస్తె తెలుస్తుంది. ఇక ఉన్న హోం మంత్రి గారి అధికారమెంతో ఎంత తక్కువ చెప్పితె అంత మంచిది. ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్న ఆమెగారు పదవిలో ఇంకా కొనసాగకపోయేవారు.
2.రాష్ట్ర రాజధాని కూడా తెలంగాణ ప్రాంతం లోనె ఉన్నది. పెట్టుబడులు మొత్తం ఈ రాజధానిలోనె పెడుతున్నారు. రాజధానిలో చాలా అభివృద్ధి జరుగుతున్నది. కావున తెలంగాణ అభివృద్ధి జరగటం లేదనటం నిరాధారం అంటున్నారు.
అసలు వారు తెలంగాణాను కలుపుకొనుటకు రాజధాని హైద్రాబాద్ ఒక ముఖ్య కారణం. ఇప్పుడు హైద్రాబాద్ లో 30 నుండి 40 లక్షల సీమంధ్రులు స్థిరపడ్డారు. దురాక్రమణ జరిగినది. గత 53 ఏండ్లనుండి దోచుకున్న ప్రభుత్వ ఉద్యోగాలు, సాగునీటి వనరులు, ఇతర అనేక రకాల వనరులతో పెట్టుబడులు కూడబెట్టుకున్నారు. ఆ పెట్టుబడులతో హైద్రాబాద్ లో స్వంత ఆస్థులను అభివృద్ధి చేసుకున్నారు. కొంతమంది బడా పెట్టుబడుదారులు గేటెడ్ కమ్యూనిటిలు(బంజార, జూబ్లి హిల్స్ లాంటి), వాటిలో రాజభవనాలు కట్టుకొని ప్రపంచంలోనె అత్యంత ఆడంబరంగా బ్రతులను అనుభవిస్తున్నారు. వారికి అండగా సీమాంధ్ర మద్యతరగతి కూడా హైద్రాబాద్ లో బలంగా ఉన్నది. తెలంగాణ ప్రజలకు హైద్రాబాద్ లో ఉన్న ఆస్తులు నామమాత్రం. ఆస్తులు, అభివృద్ధి మొత్తం సీమాంధ్రులది.
3.రాష్ట్ర ప్రజలు అంతా ఒకే భాష మాట్లాడుతున్నారని, చారిత్రకంగా చూసిన ఒక బ్రిటిష్ వారి కాలంలొ 150 లేదా 200 ఏండ్లు తప్ప ఎప్పుడు కలిసే ఉన్నామని అంటున్నారు.
చరిత్ర నడుస్తూ వుంటుంది. ఇప్పుడున్న భౌగోలిక ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ఎప్పుడు లేదు. మేజారిటి తెలుగు ప్రజలతో, ఇతర భాషల ప్రజలతో కలిసి అప్పుడప్పుడు సర్వ స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. కాని, ఇప్పుడున్న తెలుగు ప్రజల రాజ్యం స్వతంత్ర రాజ్యం కాదు. భారత దేశానికి, దాని రాజ్యాంగానికి లోబడి ఉన్న ఒక సామాంత రాజ్యాం మాత్రమే. అంటె ఫెడరల్ స్వభావమున్న దేశంలో అంతర్భాగం. కాబట్టి, తెలంగాణ ఏర్పాటుకు చారిత్రిక కారణాలు అడ్డు చూపడం అసంబద్ధం. తెలంగాణ ఏర్పాటు అనేది చరిత్ర గమనంలో కొంత కాలపరిమితిగల ఇప్పటి తరాల ఏర్పాటుగానె చూడాలి. రాబోయే తరాలు కలిసి ఉండాలి అనుకుంటె మల్లీ సమైక్యాంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసుకోవచ్చు.
4.రాష్ట్రం లో మెజారిటి ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నారని చెప్పుతున్నారు.
దాదాపు 40% జనాభాతో తెలంగాణవారు ఆంధ్రప్రదేశ్ అనబడె ఒక అసంబద్ధ రాష్ట్రం లో అన్యాయమైన ఒడబండికతో ఒక మైనారిటి హోదాను పొందినారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలంగాణ ప్రజల నుండి తెలుసుకోవాలి. సీమాంధ్రుల ఆకాంక్షలతో సంబంధం లేదు.
5.తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష లేదనటానికి ఒక పార్టి ఎన్నిక్లలో ఓడిపోవడాన్ని చూపెడుతున్నారు.
ఓట్లకు, సీట్లకు ప్రజల ఆకాంక్షలకు సంబంధం లేదు. ఎందుకొంటె తెలంగాణా ఆకాంక్షకు అన్ని పార్టీలు వ్యతిరేకం కాదని ప్రచారం చేసుకున్నాయి. ఇప్పుడు ఏ పార్టి అయిన సమైక్యాంధ్ర నినాధంతో పోటి చేసి తెలంగాణాలో గెలవమని చెప్పమనండి.
6.ఏదైన వెనకబాటు తెలంగాణలొ ఉంటె దానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు భాద్యులంటున్నారు. అంటె వారిని ఎన్నుకున్న ప్రజలే కారణమని చెప్పక చెప్పుతున్నారు.
ఇది వారి ధాష్ఠికానికి పరాకాష్ట. వారు మేజారిటి. వారు తెలంగాణ కంటె ఒక తరం ముందున్నారు. తెలంగాణ రాజకీయ వైపల్యం వలననె తెలంగాణ వివక్షకు గురైనది. తెలంగాణ నాయకులు, సీమాంధ్ర నాయకుల ఆధిపత్యాన్ని అడ్డుకోలేరు. నాయకులను పక్కకు పెట్టి ఇప్పుడు ప్రజలు ముందుకు వచ్చినారు.
ఇలా చెప్పుకుంటూ పోతే సీమంద్రులకు చాలాఅసంబద్ధ అనుకూలతలు ఉన్నాయి.
తెలంగాణ ప్రజలకున్న పరిమితులు:
1 తెలంగాణ ప్రాంతంలో సామాజిక, ఆర్ధిక కారణాలవల్ల నక్షలైట్ ఉద్యమం గత 7,8 ఏండ్ల క్రితం వరకు బలంగా ఉన్నది. చంద్రబాబు, రాజశెఖర రెడ్డిల హయాం లొ ఉక్కు పాదం తొ ఉద్యమాన్ని అణచినారు. దీనిని ఆ ప్రభుత్వాలు గర్వంగా ప్రకటించుకున్నాయి. నిజం కూడా. కాని ఇప్పుడు ఈ తెలంగాణ ఆకాంక్ష వెనక నక్షలైట్స్ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు తమ ఆకాంక్షను తెలిపే క్రమం లో, ప్రభుత్వానికి నిరసనను తెలిపే సమయం లోఉనికిలో లేని నక్సలైట్ల ముద్ర పడకుండా ఉండటానికి చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఉద్యమాలలో జరిగే సాధారణమైన నామమాత్ర హింస, విధ్వంసం కూడా జరగకుండా చూసుకొనవలిసి వస్తుంది. ప్రభుత్వం, సీమాంధ్రులు దీనిని ఉద్యమం బలహీంగా ఉందని చూపెట్టె ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు. హింసకు దిగితే నక్షలైట్ల ముద్రవేసి ఉక్కు పాదం తో అణిచే ప్రయత్నం జరుగుతుంది.
2.పైన చెప్పిన ప్రతిబంధకం కారణంగా, ప్రజాస్వామికంగా ప్రజలను సమీకరించటానికి ప్రయత్నిస్తె, అసాంఘిక శక్తులు విధ్వంసానికి పాల్పడుతాయని సీమాంధ్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తున్నది. దీనిని ప్రతిఘతించి కూడా శాంతియుతంగా చేసే నిరసనలను కూడా ప్రభుత్వం బలాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారు. దీనికి ఉదాహరణ 20.02.2010 నాటి విద్యార్ధుల అసెంబ్లి ముట్టడిని అడ్డుకున్న పద్ధతి. అసాధారణ రీతిలో ఇరువై వేల మంది పోలిసులను ఉపయోగించి విద్యార్ధులను అడ్డుకున్నరు. ఇరువై వేల మంది పోలీసులు కాక జిల్లాలలో పోలిసులు జిల్లా స్థాయిలలోనె విద్యార్దులను అడ్డుకున్నారు. రైల్వే ట్రాకుల పై బాంబుల బూచి చూపెట్టి విద్యార్ధులు రాకుండ రైళ్లను ఆపినారు. ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి కానరాకుండా ఇంత దుర్నీతితొ, పాశవికంగా అడ్డుకోవడం కనీవిని ఎరుగనిది.
3.తెలంగాణ రాజకీయ నాయకత్వం మొత్తం సీమాంధ్ర నాయకత్వం చెప్పినట్లు బూటక ఉద్యమాలు చేసి, ప్రజలను గంధరగోళ పరచడం.
ఇంతటి ప్రతికూల పరిస్థితులలో, తమ ఆకాంక్షను వెలిబుచ్చటానికి మిగిలిన ఏకైక అవాంచనీయ మార్గం ఆత్మ బలిదానాలు.
అత్మబలిదానాలు పర్యవసానంగా హింస ప్రజ్వరిళ్లుతె, పరిస్థితి విషమిస్తే సీమాంధ్ర పెట్టుబడుదారులను, నాయకులను అడ్డుకోలేని సీమాంధ్ర సామాన్య ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉన్నది.
కాబట్టి, సీమాంధ్ర ప్రజాసంఘాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి సీమాంధ్ర పెట్టుబడుదారులను, నాయకులను ఎదిరించాలి.

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చాల బాగా చెప్పారు. ఇక మీపై వెంగ్య వాఖ్యలు చేయడానికి తిన్నదరగక కంప్యూటర్లమీద పడిపోయే సమైఖ్యాంధ్రులు పోలోమని వచ్చేస్తారు... ఓ మూడు ఈసడింపులు ఓ ఆరు కుల్లు ప్రశ్నలు సంధిస్తారు...

అజ్ఞాత చెప్పారు...

Dear brother,
we will definately achieve telangana.
One of the best posts i have read so far.

Jai telangana,Jai Jai telangana.

Aravind.

సమతలం చెప్పారు...

ధన్యవాదాలు. మొదటి సారి సమర్ధించె, సమర్ధించె మొదటి రెండు వ్యాఖ్యలు. మనం భరించె వారి వ్యంగ వ్యాఖ్యలు, మన ప్రజలు భరించె బాధలలో భాగమె. అవి వారి ఆధిపత్యానికి, అహంభావానికి నిదర్శనమే.

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

వచనంలోఅద్భుతంగా తెలిపావు మన వాదనని..అందుకు ..అందుకో..తెలంగాణ తమ్ముడా! నీకు నా సలాం!!
తెలంగాణ ఉద్యమ పోరాట గీతాలు పాటలు గేయాలకై,,దయచేసి ఈ బ్లొగ్ చూడండి..ప్రచారం చేయండి..తెలంగాణ రాష్ట్రసాధన లో పాలుపంచుకొండి..దురదృష్టకరమైన సంగతేంటంటే మన తెలంగాణా వాదులకి కంప్యూటర్..నెట్..బ్రౌసింగ్..అతి తక్కువమందికి తెలుసు..మిగిలిన ఆంధ్ర /సమైక్యాంధ్ర వాదులకంటే...ఉన్న అందరికందరైనా..ఈ పాటలని పాడుకొని..పాడుకోవడానికి వాడుకొని..ఉత్తేజన్ని కలిగించి ఉద్యమ స్పూర్తిని నిలుపుతారని ఆశ..!
http://telangaanaastate.blogspot.com

అజ్ఞాత చెప్పారు...

చాల అద్భుతం గా వుంది, మీ శైలి, వివరణ. మీకు నా అభినందనలు, ధన్య వాదాలు.