యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

16, ఫిబ్రవరి 2010, మంగళవారం

సమైక్యాంధ్రుల అపోహలు - ఎన్.టి.ఆర్. - అంధ్రుల ఆత్మాభిమానం - సమైక్యత

విభజన అంటె విలవిలలాడె సీమాంధ్రులు ఎన్.టి.ఆర్. తెలుగు ప్రజల ఆత్మగౌరవం ప్రస్థావన తీసుక వస్తున్నారు. ఎన్.టి.ఆర్. చేసిన ఘనకార్యం(సంస్కరణలు) ఏమిటి?
ఆంధ్ర ప్రదేశ్ లో 1959 లో 330 సమితీల(బ్లాక్స్))ను ఏర్పాటు చేసినారు. వాటిని ముక్కలు చేసి 1091 మండలాలను 15,జనవరి,1987 నాడు ఏర్పాటు చేసినారు. దీనిని వికేంద్రీకరణ, ప్రజల వద్దకు పాలన అని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.
ఇది విభజన కాదా? ఇది వేర్పాటు కాదా? ఇది ప్రజల మద్య చిచ్చు పెట్టడం కాదా? ఇది సమైక్యతా వాదమా?
ఇది ఎంత అసంబద్ధ, దుర్మార్గమైన , స్వార్ధపూరిత చర్య అంటె, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసి, దానిని అసౌష్టవంగా తయారు చేసినది. వికేంద్రీకరణ పేరుతో భయంకరమైన కేంద్రీకరణ జరిగినది. ఎమ్మెల్యేలను ఆధునిక జమిందార్లను చేసినది. వారినిరాజకీయంగా నియంత్రించే స్థానిక ప్రతినిధి లేకుండా చేసినది. ప్రతి దానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడేవిధంగా కేంద్రీకృత వ్యవస్థ తయారైనది. స్థానిక ప్రతినిధులను ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు చేతిక్రింది కార్యకర్తలుగా తయారు చేసినది.

అసలైన వికేంద్రీకరణ అంటె మనగలిగె చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, బలమైన పెద్ద స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడం. అంటె ఆంధ్ర ప్రదేశ్ ను 2 లేదా 3 రాష్ట్రాలుగా విడగొట్టాలి. మండలాలను రద్దు చేసి, సమితిలను ఏర్పాటు చేసి శాసన సభ్యులకు, మంత్రులకు సమవుజ్జిలైన స్థానిక ప్రజా ప్రతినిధులను తయారు చేయడం. ఆరొగ్యకరమైన,సౌష్టవమైన అధికార కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

4 కామెంట్‌లు:

అమర్ (Amar) చెప్పారు...

dude...get a life.

అజ్ఞాత చెప్పారు...

మీరు చెప్పిన దాన్ని బట్టి దేశాన్ని కూడా ముక్కలు చేద్దామా? అయినా తెలంగాణ కు మనగలిగే సత్తా ఉందని నేను అనుకోవడం లేదు...

Unknown చెప్పారు...

భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి కూడా బ్రిటీష్‌ వాళ్ళు వీళ్ళు మనలేరనే సాకును చెప్పారట. అమెరికా, ప్రపంచ బ్యాంకులు కూడా మొత్తం ప్రపంచమంతా వొకే వ్యవస్థగా ఉంటే బాగుండని తలపోస్తున్నాయి. వెళ్ళి వాళ్ళకు దాసోహమందామా?

తెలంగాణాకు మనగలిగే సత్తా ఉంది.

సమతలం చెప్పారు...

ప్రపంచంలో ఒక ప్రాంత లేదా జాతి ప్రజలు ఇంత బలంగా ఆత్మ గౌరవ, స్వపరిపాలన ఆకాంక్షను వ్యక్తపరిచిన సంధర్భం ఇంతవరకు లేకపోవచ్చు మరియు ఒక ఆకాంక్షకు కొన్ని రోజుల వ్యవధిలోనె ఒక మాదిరి వ్యతిరేక అకాంక్షను లేవనెత్తటం కూడా జరిగుండక పోవచ్చు.
తెలంగాణ ప్రజలది న్యాయమైన ఆకాంక్ష అని చెప్పడానికి ఎలాంటి కమిటీలు, కమీషన్లు అవసరం లేదు. కాని ఒకే జాతి, ఒకే భాష అంటు దోపిడి నుండి, దురాక్రమణ స్థాయికి ఎదిగిన సీమాంధ్ర పెట్టుబడుదార్లు సామాన్య సీమాంధ్రులను, దేశాన్ని, ప్రపంచాన్ని మభ్యపెట్టడం కౄరమైన, ఆశ్చర్యకరమైన, ప్రమాదకరమైన విషయం. కాలయాపన జరిగితె తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల రూపం మారితె అమాయక సీమాంధ్రులు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందేమో!