కొంతమంది 20- 30 ఏండ్ల యువకులకు కనీసం గత 53 ఏండ్లలో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘన, ముల్కి నిబంధనల ఉల్లంఘన, 6 సూత్రాల ఉల్లంఘన, జి.ఒ.610 అమలు పరచక పొవడం గురించి తెలుసుకొనే, అలోచించే ఓపిక లేదు. ఈ యువకులంత గ్లొబలైజేషన్ యుగంలో ఈ వేర్పాటులేంటి అంటున్నారు. కొంతమంది తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు చూసిన పెద్దలు, బుద్ధిజీవులు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కొంతవరకు అంగీకరిస్తున్నారు. వీరుకూడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పూర్తిగా సమర్దించలేకపోతున్నారు.
వీరు లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు:
ప్ర:తెలంగాణ ప్రజలలో తెలంగాణ వాదం ఉంటె టీఆరెస్ పార్టి ఎన్నికలలో ఎందుకు ఓడి పోయింది?
జ:టీఆరెస్ అధినేత కెసీఆర్ యొక్క వ్యక్తిగత బలహీనతలు అతని వాదానికి గుదిబండలుగా మారినాయి. అదే సమయంలో కొందరు సీమాంధ్రులు ఉద్యోగాలు, భూములు, అన్ని రకాల ప్రకృతి వనరులు దోచుకున్నట్లే ఈ తెలంగాణావాదాన్ని కూడా వారివారి పార్టీల ద్వారా కబ్జా చేయించినారు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ తెలంగాణాకు అనుకూలమని టీఆరెస్ తో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. 2009 సంవత్సరంలో టిడిపి పార్టి తెలంగాణాకు అనుకూలమని టీఆరెస్ తో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కూడా తెలంగాణాకు అనుకూలమంటూనే రోశయ్య కమిటి అంటూ ఏదో ఒకటి వేసి తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. పీఆరిపి కూడా చేతనైన వరకు తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకున్నది. ఈ రెండు ఎన్నికలో "సమైక్యాంధ్ర" వాదన ఉనిక్కే లేదు. ఇంతకు ముందు కూడా లేదు.
తెలంగాణా వాదాన్ని కూడా సీమాంధ్రా నాయకులు కబ్జా చేసి, మోసపూరితంగా టీఆరెస్ ను ఓడించి దానినె ఎప్పుడు ఉనికిలో లేని "సమైకాంధ్రావాదం" గెలుపు అంటున్నారు.
ఇప్పుడు ఈ సీమాంద్రా నాయకులు వారి తొత్తులైన తెలంగాణా కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామా చేయించి మళ్లి పోటిచేసి గెలవమని చెప్పండి.
2004 సంవత్సరంలో గాని, 2009 సంవత్సరంలో గాని కాంగ్రెస్, టిడిపి పార్టీలు తెలంగాణాకు అనుకూలమన్న సీమాంధ్రాలో వారికి వ్యతిరేకత రాలేదు. దీనిని బట్టి సీమాంధ్ర సామన్య ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని తెలుస్తుంది. ఈ ఓట్లే ఈ విషయం చెప్పడం లేదు. ఈ పార్టీలు సీమాంధ్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమై వుంటె ఎన్నికలముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ముందుకు వచ్చేవాళ్లా?
సీమాంధ్ర రాజకీయనాయకులు, బడాపారిశ్రామికవెత్తలు మాత్రమే తెలంగాణాకు వ్యతిరేకమని ఇప్పుడైన అర్ధం కావడం లేదా?
ప్ర:హైద్రాబద్ లో తెలంగాణావాదం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హైద్రాబాదుకు సంబంధం ఏమిటి?
జ:తెలంగాణా వాదం బలంగా వున్నదని, తెలంగాణాకు అన్యాయం జరిగిందని అంగీకరించె కొంతమంది, హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో టీఆరెస్ ఓడిపోతామని బయపడి పోటిచేయలేదని, హైద్రాబద్ లో తెలంగాణావాదం లేదని, కాబట్టి హైద్రాబాదును తెలంగాణానుంచి వేరు చేయాలని అంటున్నారు.
టీఆరెస్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో పోటి చేయకపోవడానికి ఇంతకుముందు చెప్పిన సమాధానమె చెప్పాలి.
సరె హైద్రాబాదులో పూర్తిగా సమైక్యాంధ్రావాదులే అధికంగా ఉన్నారనుకుంటె, ఈ అధికం అనేదానికి కారణమేంటి? మా ఉద్యోగాల కబ్జా, మా భూముల కబ్జా, మా వనరుల దురాక్రమణ పలితమే కాదా హైద్రాబాదు లో ప్రక్కనే ఉన్న మా వారికంటె సీమాంధ్రులు ఎక్కువగా స్థిరపడటానికి.
స్థిరబడటాన్ని మేము అంగీకరిస్తున్నాం. కాని హైద్రాబాద్ తెలంగాణాలో భాగం కాదనకూడదు. ఉద్యోగాలను,భూములను, అన్ని వనరులను దురాక్రమణ చేసి స్థిరపడిన సీమాంధ్రులు హైద్రాబాద్ లో భాగం కాదు. హైద్రాబాద్ నుంచి వారిని వేరు చేయాలి.
ప్ర: గ్లొబలైజెషన్ యుగం లో ఈ వేర్పాటు వాదమేమిటి?
జ: అసలు ఇది కనీస అవగాహన ఉన్నవారు కూడ అడగరు. కాని దురదృష్టం. కొంతమని సీమాంధ్ర యువకులకు అవగాహన లేదనుకుంట. లేకపోతె కొంతమంది సీమాంధ్ర పెద్దలకున్న ఆదిపత్య ధోరణైన అయిండవచ్చు. "స్థానికత" కు ప్రపంచం అంతట ఉనికి ఉన్నది. ఈ రోజు ఆస్ట్రేలియాలో ఏమి జరుగుతుంది? ఇంత అభివృద్ధి చెందినా చాలా యూరోపియన్ దేశాలలో విదేశి ఉద్యోగులకు భత్రత ఉన్నదా? ఆర్ధిక మాంధ్యం సందర్భం లో అమెరికాలో కూడ విదేశియలకు ఉద్యోగాలు తగ్గలేదా? అమెరికా ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ లో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా ఆలోచించలేదా?
1 కామెంట్:
good post ... we appreciate your efforts on posting these thoughts..
కామెంట్‌ను పోస్ట్ చేయండి