యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

20, డిసెంబర్ 2009, ఆదివారం

సమైక్య తెలంగాణ - సమైక్య ఆంధ్ర

సమైక్య తెలంగాణ - సమైక్య ఆంధ్ర
ఆచరణ సాధ్యమా? నాకు అంతగా అవగాహన లేదు.
క్రింది రెండు ప్రతిపాదనలు పరిశీలించాలి.
1.తెలంగాణ 10 జిల్లాలను, ఉత్తరాంధ్ర 3 జిల్లాలలను కలిపి కళింగ తెలంగాణ ఏర్పాటు.(ఈ రెండు ప్రాంతాలకు ఉమ్మడి సరిహద్దు లేదు. కాని తూర్పు గోదావరిలోని ఒకటి, లేదా రెండు వెనకబడిన నియోజకవర్గాలను కలిపుకుంటె ఉమ్మడి సరిహద్దు ఏర్పడుతుంది.)
లేదా
2.తెలంగాణ 10 జిల్లాలను, రాయలసీమ 4 జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు
ఈ రెండు ప్రతిపాదనలలో కలిసివచ్చె అంశాలు
1.వెనకబడిన ప్రాంతాలు కలవడం
2.ప్రస్తుత శాసనసభలో తీర్మానానికి మెజారిటి పొందటం.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కోస్తావారిని వదిలించుకున్నట్లే ఆ తరువాత రాయలసీమవారినీ నెమ్మదిగా వదిలించుకోవడం.... అంతేనా ? పధ్నాలుగు జిల్లాలతో కలిసి బతకగల్గినవాళ్ళు ఇంకో తొమ్మిది జిల్లాలతో కలిసి ఎందుకు బతకలేరు ? బలవంతుడు విస్తరణ కోరుకుంటాడు. బలహీనుడు కుచించుకుపోవడాన్ని ఇష్టపడతాడు. కోస్తావారేమీ దెయ్యాలూ, భూతాలూ కారే ! రాక్షసులు అంతకంటే కారే ? ఎందుకంత ద్వేషిస్తున్నారు వారిని ? వారేం అపకారం చేశారు తెలంగాణకి ? తెలంగాణ ఆర్థికవ్యవస్థకి వారు చేసిన చేసిన కాంట్రిబ్యూషన్ ఏ ప్రభుత్వమూ చెయ్యజాలదని గుర్తెరగండి. చాలామంది తెలంగాణవారికి వారి సంస్థల్లోనే ఉద్యోగాలు దొఱికాయి. దొఱుకుతున్నాయి.

అజ్ఞాత చెప్పారు...

మీ సమైక్యాంధ్రవాదులు సినిమాళ్ళో విలన్లకి తెలంగాణా పేర్లు పెడుతుండ్రు. నరసింగ్ యాదవ్, శ్రీశైలం యాదవ్, యాదగిరి, మల్లేష్ యాదవ్ గీ పేర్లు గాకుండా వేరే పేర్లు దొరకలేదా మీ సమైక్యాంధ్ర సినిమా ప్రొడ్యూసర్లకి?

అజ్ఞాత చెప్పారు...

సమైక్యాంధ్రవాదులూ, కోస్తా-సీమ జనం ఇద్దఱూ ఒకటి కాదు. తెలంగాణవారంతా వేర్పాటువాదులూ కారు. తెలంగాణలో కూడా సమైక్యవాదులు భారీగానే ఉన్నారు. ఎవఱో దర్శకులూ, నిర్మాతలూ చేసేదానికి ఆ ఏరియాల వాళ్ళందఱినీ కలిపి తిట్టడం సమంజసం కాదు. వాస్తవానికి కోస్తా-సీమల్లో 95 శాతం మందికి తెలంగాణ మనుషులు ఎలా ఉంటారో, వాళ్ళ మాండలికం ఎలా ఉంటుందో, వాళ్ళ పేర్లు ఏ స్టైల్ లో ఉంటాయో కూడా అస్సలు తెలిదు. హైదరాబాదులో స్థిరపడ్డ కొద్దిమంది నిర్మాతల పని అి.

Nrahamthulla చెప్పారు...

రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

అజ్ఞాత చెప్పారు...

మీ ఈ ప్రతిపాదన దేనికోసం ? దీనికి ఎవరొప్పుకుంటారు ? కోస్తాంధ్ర లేని తెలంగాణతో కలవడానికి రాయలసీమోళ్ళు గానీ ఉత్తరాంధ్రోళ్ళు గానీ ముందుకు రారు. కోస్తాంధ్రులు వాళ్ళందరికీ నాయకులు, పెద్దన్నలు. వాళ్ళని కాదని వాళ్ళు ముందుకు రావడం జరగదు.