యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

13, డిసెంబర్ 2009, ఆదివారం

తెలంగాణోద్యమం - సమైక్యాంధ్రోద్యమం - ఇప్పటి రాజకీయ కారణాలు

తెలంగాణ ఉద్యమానికి 50 ఏండ్ల చరిత్ర ఉన్నది. అంటె సమైక్యాంధ్ర అప్పడి నుండీ దానికి గుదిబండగానె ఉన్నది.
ప్రస్తుత పరిస్థితులకు కారణాలేంది?
----ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ప్రజలలో ఉంటె టీఆరెస్ ఎందుకు ఓడి పోయింది ?
1)కేసీఅర్ మీద నమ్మకం లేక
2)కాంగ్రెస్, టిడిపి, పీఅర్పి పార్టీలు తెలంగాణకు అనుకూలం అన్నాయి. జనాలను గందరగోళ పరిచినారు. తెలంగాణ వాదనను వెనకకు నెట్టినారు.
3) ఒక విధంగా ఒట్లకు, ఇలాంటి సమస్యలకు సంబంధం లేదు. ఓట్లను అనేకం ప్రభావితం చేస్తాయి.
------కాంగ్రెస్, టిడిపి, పీఅర్పి పార్టీలు తెలంగాణకు ఎందుకు అనుకూలం అన్నాయి?
అందరికి కాంగ్రెస్ అధిష్టానం మీద నమ్మకం. ఆ నమ్మకం ఏంది - ఎట్టి పరిస్థితులలో సోనియా తెలంగాణ ఇవ్వదు. ఈ "నమ్మకం" పచ్చి నిజం. ఎంత అంటె కాంగ్రెస్ వాళ్లు చెప్పితె టిడిపి వాళ్లు నమ్మారు, టిడిపి వాళ్లు చెప్పితె కాంగ్రెస్ వాళ్లు నమ్మారు.
----మరి ఇప్పుడు కాంగ్రెస్ అంటె సోనియా తెలంగాణ ఎందుకు ఇస్తానన్నది?
పూర్తిగా రాజకీయ కారణం. వైఎస్సార్ పోయిండు. ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడపగలిగే వేరే నాయకుడు ఇప్పుడు లేడు. బాబును ఎదుర్కొనె నాయకుడు లేడు. కనుచూపు మేర కనిపించడం లేదు.( అంటె తొందర పడ్డ జగన్ ఉన్నాడు. కాని విధేయత నిరూపించుకోవాలి. ఆయన పరిమితి ఆయనకు తెలయదని అధిష్టానం అనుకున్నది. చేతిలో ఉండే నాయకుడు కావాలి. ఇంకా కారణాలు చాలా ఉన్నాయి.) కాబట్టి బాబు సైజు తగ్గించాలి.
-----బాబు గురించి రాష్ట్రాని సోనియా ముక్కలు చెస్తదా?
చేస్తుంది. ఆయన కేంద్రం లొ చక్రం తిప్పుతుండు. ఆ మాటకు వస్తె చిన్న రాష్ట్రాలు చేస్తె ఈ బాబు, ములాయం, లాలూ లాంటి వాళ్ల తలనొప్పి పోతుంది. పెద్ద బలమైన ప్రాంతీయ పార్టీలు రాకుండా చూడాలి. అంటె చిన్న రాష్ట్రాలే మార్గం. బలమైన జాతీయ పార్టి కొరకు అవకాశం వస్తె ఇంకొన్ని చిన్న రాష్ట్రాలు ఇస్తారు.
----మరి సమైక్యాంధ్ర అంటు అన్ని పార్టీలు ఎందుకు గొడవ చేస్తున్నాయి?
అందరు పొరబడ్డరు. ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు. దీనికి అందరు కారణమే. ప్రజల ముందు ఎవరు కారకులుగా (దోషులుగా) నిలబడాలి.
అందుకే ఒకరిని మించి ఒకరు గొడవ చేస్తున్నారు. ఇక మీరే కారణమంటె మీరే కారణమనే రోజు వస్తుంది.
------ సోనియా ఆంధ్రా ప్రజల మనోభావాలను ఎందుకు పక్కకు పెట్టింది? వారి మద్దతు ఆమెకు అవసరం లేదా?
ప్రత్యేక తెలంగాణ వల్ల ఆంధ్రా సామాన్య ప్రజానీకానికి పెద్దగా నష్టం లేదు. లెక్కలతొ సహ నిరూపనలు ఉన్నాయి. కాంగ్రెస్, టిడిపి రాజకీయ నాయకులకు, వారి అనుబంధ వ్యాపారరులకే కొంత నష్టం. కాని ఈ పరిస్థితి రావడానికి వీరే కారణం.
హైకమాండ్ ను నిందించలేరు. దీనికి మీరంటె మీరని నిందించుకొంటరు. ఇద్దరికి నష్టం. లాభం ఎవరికి లేదు. అంటె యధాతధ స్థితి.
------ ఇంతకు ఎవరి ఉద్యమం పలితాన్ని ఇస్తుంది?
తెలంగాణ చాల బలమైన ఉద్యమం. ఆంధ్ర ప్రభుత్వ పెత్తందార్ల, అధికార్లను ఎదిరించి ఎగుస్తున్న ఉద్యమం. అన్ని వర్గాలు కలిసి నడిపిస్తున్న ఉద్యమం. స్వచ్చంధం. త్యాగాలమయం.
ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం దానిని అనుకరిస్తుంది. కాని దానికి ఎన్నటికి సరిరాదు.

ఒక్క సంగతి
చిదంబరం, పిళ్లై, ఎంకె.నారాయణన్ అనే తమిలులు కుట్ర పన్నినారని, చెన్నైకి నీళ్లు బంద్ చేసినారు. అదే విధంగా తెలంగాణ వాళ్లు ఆంధ్రా రాయలసీమ వాళ్లను హైద్రాబాద్ రాకుండా అన్ని హైవేలను, రైలు మార్గాలను పూర్తిగా మూసివేస్తె వాళ్లు ఎన్ని రోజులు మనగలరు.
సమైక్యాంధ్రాకు జాతీయ స్థాయిలో వారికి మద్ధతు సున్న.

కారణాలేమైన తెలంగాణాకు విముక్తి కలుగుతుంది.
జై తెలంగాణ, జై జై తెలంగాణ

7 కామెంట్‌లు:

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

సమైక్యవాదులు ఎవరికీ తెలంగాణా మీద ప్రేమ లేదు. తెలంగాణావాళ్ళు హైదరాబాద్ ని లాక్కుపోతున్నారు అని శ్రీకాకుళంలో కాంగ్రెస్, తెలుగు దేశం వాళ్ళు ప్రచారం చేశారు. నిజానికి హైదరాబాద్ రాజధాని కాకపోతే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే హైదరాబాద్ మాకు 800 కిలో మీటర్లు దూరం.

అజ్ఞాత చెప్పారు...

నువ్వు పక్కన ఉన్నావని వాళ్లకు తెలీదు ప్రవీణు

అజ్ఞాత చెప్పారు...

>>>"నిజానికి హైదరాబాద్ రాజధాని కాకపోతే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే హైదరాబాద్ మాకు 800 కిలో మీటర్లు దూరం."

పైన రాసినది ఎలా ఉన్నా ఈ కామెడి బాగుంది. రాజధాని దూరంగా ఉంటే నీకొచ్చే లాభం ఏమీ లేదా? నువ్వు జన జీవన స్రవంతిలో ఎప్పుడు కలుస్తావు?

Unknown చెప్పారు...

బాగ చెప్పిన వన్న! ఈ సమైక్య వాదులకు హైదరా బాదు కాదు, తెలంగాణా నీళ్ళు కావాలి (ఇక్కడ చూడండి)

నిజం చెప్పారు...

హో బగవంతుడా...ఈ ఆంధ్ర వాళ్ళు దోచుకోవడానికి హైదరాబాద్ ని మించిన ప్లేస్ ని చూపించు ......అప్పుడు కానీ వీరు వెళ్లారు .......వారికీ దోచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి హైదరాబాద్ లాంటిది.....అలాంటిది మరొకటి దొరకగానే జై ఆంధ్ర అని తెలంగాణా నుండి విడిపోతారు...అప్పుడు కానీ తెలంగాణా బాగు పడుతుంది

అజ్ఞాత చెప్పారు...

విశ్లేషణ బాగుంది. కానీ చివర్లోని యెధవ కామెంట్లు చేశావ్. ఎందుకిచ్చింది సోనియా.. నీ రాతల్లోనే ఉంది. 50 ఏళ్ల బలమైన ఉద్యమాన్ని చూసి కాదని. మళ్లీ చివర్లో బలమైన ఉద్యమం అంటూ చంకలు గుద్దుకంటావేంటి. నీ ఉద్యమాన్ని చూసి ఇచ్చేయటానికి.. లేకుంటే కీసీయార్ లాంటి తాగు బోతు గాడికి రాష్ట్రం అప్పగించటానికి.. ఉస్మానియా యూనివర్సీటీలో తినే తన్నులే తన్నులని .. వేరే దగ్గర తింటే అవి తన్నులు కాదని భ్రమపడటానికి సోనియా ఏమైనా భారతీయురాలా... నీకు తెలుసు కదా ఎందుకిచ్చిందో.. మళ్లీ చివర్లో బలమైన ఉద్యమం అంటూ పిచ్చిప్రేలాపనలేంటి నువ్వే అసలు కారణాలన్ని చెబుతూ ఉద్యమం అంటావేంటి బదరూ. ఎక్కడితో అపాలి అక్కడితో ఆపు. నిష్పాక్షపాతం రాసినంతవరకు నీ విశ్లేషణ బాగుంది. కానీ నువ్వు అంటే పక్ష పాతం ఎంటరైంది. బొక్క బోర్లా పడ్దావ్.

సమతలం చెప్పారు...

ఓ అజ్ఞాత ,
నీకు తెలంగాణ వాళ్లకున్న సంస్కారం లేదు. వెధవ అనే మాట మాట్లాడటంలో మీ అసహనం, అసూయ కనిపిస్తుంది. మేము నీకంటె ఎక్కువ అనగలం. కాని మేము ఆ పద్ధతిలో మాట్లాడదలుసుకోలేదు.
సోనియా తెలంగాణ మీద ప్రేమకంటె, రాజకీయ కారణాలవల్లె తెలంగాణ ప్రకటించిందని చెప్పడమే ఈ టపా ఉద్ధెశ్యం.
సమైక్యాంధ్ర గురించి నీవు సమర్ధించుకో, "వెధవ" అనే వెధవ మాటలు మాట్లాడకుంటె మంచిది.
అసలు "అజ్ఞాత" తో కామెంట్ చేయడమే వెధవ పననుకుంట.