యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

23, ఫిబ్రవరి 2009, సోమవారం

తెలంగాణా - ఆంధ్రా నిజాములు

మద్యన ఒక సారి ఒక బాలివుడ్ నటి మన తెలుగు నటుడు నాగార్జునను నిజామంత ఐశ్వర్యవంతుడు అంటు ఇంకా చాల చాలా తెగ పొగిడింది.

మద్యన నాగార్జున కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొరకు యాడ్ లొ నటిస్తె, ఏ లాభం కొరకో ( భూమికి సంబంధించినదని అనుమానం) ఇలా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నాడని విమర్శ వచ్చింది.దీనికి ఒకరు నాగార్జునకుడబ్బు అవసరం లేదు. డబ్బు కొరకు చేసెవాడు కాదని, నిజామంత ధనవంతుడనే విధంగా సమర్ధించినారు.

కావచ్చు.


నాగార్జున ఒక్కడె కాదు, వందలమంది నిజాం నవాబులంతటివాళ్లు హైద్రాబాదులొ ఉన్నరు.


వీరంతా తెలంగాణా రాకుండా వీలైన అన్ని విధాల ఆంధ్ర నాయకత్వానికి సహాయం చేస్తారు.ఉదాహరణకు తెలంగాణా పై ఏకాభిప్రాయం లేదనటానికి ఒక ఇరువై, ముప్పై మంది ఇతర రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులను కొని తెలంగాణాకి మేము వ్యతిరేకం అనిపించగలరు.


మన తెలంగాణా దౌర్బాగ్యం ఏందంటె,

మనవాళ్లు ఆనాడు 1947-49 లో నిజాం కి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించి అతడిని వదిలించుకున్నాము. జమిందారులను, భూస్వాములను పట్టణాలకు పారదోలినరు. కులాల అంతరాలు తగ్గినయి, దొరల పెత్తనం పొయింది.దాదాపుగా ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ రూపుదిద్దుకుంటున్న తరుణం.


అప్పుడు 1956 లో మనకు ఆంధ్ర పెత్తందారులను (ఆంధ్ర ప్రజలు కాదు)తీసుకవచ్చి నిజాములను చేసి పైన కూర్చొపెట్టిండ్రు. ఒక్కడు పొయి వందల కొద్ది నిజాములు హైద్రాబాదుకొచ్చిండ్రు ఆంధ్రానించి. మన పాత పెత్తందారులు (రాజకీయ నాయకులుగా, పారిశ్రామిక వేత్తలుగా రూపాంతరం చెందినాజమిందారులు,భూస్వాములు )తిరిగి పాత పాత్రనె పోషిస్తున్నారు అంధ్రా నిజాముల కింద వుండి .కోస్తానించి కులగజ్జి, రాయలసీమనించి ఫ్యాక్షన్ (ముఠా రాజకీయాలు)బుధ్దులు అంటుకుంటున్నాయి. మన వాళ్ల పోరాటాలు, ప్రాణత్యాగాలు వృధా అయినాయి. మన బతుకులు మారలేదు.
ఇప్పుడు వందల మంది నిజాములను ఎదుర్కొనాలి.

3 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

"తెలంగాణా శ్మశానంగా మారినా కోయీ ఫర్వా నహీ. హైదరాబాద్ లో ఉన్న మన ఆస్తుల విలువ పడిపోకుండా ఉంటే చాలు". ఇది కోస్తా ఆంధ్ర పరాన్నభోగుల అభిప్రాయం.

Unknown చెప్పారు...

బండెనక బండి కట్టీ పదహారు బండ్లు గట్టీ......

Praveen Mandangi చెప్పారు...

నలమోతు చక్రవర్తి అనే మేతావి ఒకడు ఉన్నాడు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్‌కి ఇంపార్టెన్స్ తగ్గిపోతే గ్లోబలైజేషన్ పేరుతో హైదరాబాద్‌ని నమ్ముకున్నవాళ్ళకి నష్టం అని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడుపుతున్నాడు. అతను నల్లగొండ జిల్లాకి చెందినవాడు. నల్లగొండ జిల్లాకి చెందిన తన బంధువుల చేతే విశాలాంధ్ర మహాసభ అనే బ్లాగ్ పెట్టించాడు. తాను నిజాం రాష్ట్రంలో పుట్టానని గర్వంగా చెప్పుకుంటాదు, అంత నిజాం భక్తుడు అతను. సికందరాబాద్-వాడి పాసింజర్ ట్రైన్‌లో నిజాం రజాకార్లు హిందూ స్త్రీలని ఎలా రేప్ చేశారో ఆ నిజాం భక్తునికి తెలిసినట్టు లేదు. తెలిసినా శీలం మిథ్యా, ధనం సత్యం అనుకుని నిజాంని ఆరాధించగలడు.