యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

10, జనవరి 2009, శనివారం

విద్యాయజ్ఞం - ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూద్దాం

పాఠశాలలు లెవు.
తరగతి గదులు లేవు.
ఉపాధ్యాయులు లేరు.
5 తరగతులు ఒక ఉపాధ్యాయుడు.
4గురు విద్యార్ధులు-ఇద్దరు ఉపాధ్యాయులు.
ప్రభుత్వం విద్యకు సరిపోను నిధులు కేటాయించడం లేదు.
ఇవి మనం తరచూ వింటుంటాము.
మన రాష్ట్రంలో ఒక్క సారిప్రభుత్వపాఠశాలల, ఉపాధ్యాయుల, పిల్లల సంఖ్యలు చూద్దాం 2007-08 లో
పాఠశాలల సంఖ్య = 79860
ఉపాధ్యాయుల సంఖ్య=2.75 లక్షలు
విద్యార్ధుల సంఖ్య = 89 లక్షలు

పాఠశాలల, విద్యార్ధుల నిష్పత్తి = 1:111.44
ఉపాధ్యాయుల,విద్యార్ధులు నిష్పత్తి =1:32.36
DSC ద్వారా 50,000 ఉపాధ్యాయులను తీసుకొంటేఉపాధ్యాయుల సంఖ్య 3.25 లక్షలు .
అప్పుడు ఉపాధ్యాయుల, విద్యార్ధుల నిష్పత్తి =1:27.38
ప్రైవేట్ పాఠశాలల, ఉపాధ్యాయుల, పిల్లల సంఖ్య:
పాఠశాలల సంఖ్య = 17560
ఉపాధ్యాయుల సంఖ్య=1.65లక్షలు
విద్యార్ధుల సంఖ్య = 48లక్షలు
పాఠశాలల, విద్యార్ధుల నిష్పత్తి = 1:273.34
ఉపాధ్యాయుల, విద్యార్ధుల నిష్పత్తి =1:29.
దాదాపు ప్రభుత్వ, ప్రైవెట్ పాఠశాలలలొ ఒక ఉపాధ్యాయునికి 30 మంది విద్యార్ధులు ఉన్నరు. తేడా ఎక్కడంటె ప్రభుత్వం సరాసరిన 100 మంది విద్యార్ధులకు ఒక పాఠశాలను ఏర్పాటుచేస్తె, ప్రైవెట్ పాఠశాలలు 270 మంది విద్యార్ధులకు ఒకటి చొప్పున ఏర్పాటైనవి.
10 ఏండ్ల నుండి పాఠశాలలలో సౌకర్యాలు కల్పించటంలో పరోక్ష పాత్ర వహించుతున్నాను. కావున వాటి స్థితిగతులు చూస్తున్నాను.సర్వశిక్షాభియాన్ కట్టిస్తున్న స్కూళ్ళను చూస్తున్నాను. రెసిడెన్సియల్ స్కూళ్ళు చూస్తున్నాను. ఆ ఆ గ్రామాలలో వస్తున్నమార్పులను చూస్తున్నాను. ఉపాధ్యాయులను, పిల్లలను పరిశీలిస్తున్నాను.
పాఠశాలలలో జీవం లేదు. సరియైన, తగినన్ని తరగతి గదులు మరియు ఇతర మంచినీటి, మూత్రశాలల సౌకర్యాలు లేవు. ఉన్నా వాటి నిర్వహణ చాలా అధ్వాన్నం. ఉండవలసింతమంది ఉపాధ్యాయులు లేరు. ఉన్నవారిలో చిత్తశిద్ది లేదు. పిల్లలంతా నిరుపేదలే. దాదాపు అనాధలు అనవచ్చు.
ప్రభుత్వం తరగతి గదుల కొరకు ఇతర సౌకర్యాల కొరకు నిధులు కేటాయించడం లేదు అనడం లేదు.చదువు చెప్పనందుకు ఉపాధ్యాయులను తప్పు పట్టడం లేదు.పిల్లలు పేదవారు ఐనందుకు ఎవరిని కారకులు అనటం లేదు.
కాలం చెల్లిన విధానాలే ఈ పరిస్థితికి కారణం
30, 40 ఏండ్ల కు ముందు సరియైన రోడ్డు సౌకర్యాలు లేక అన్ని ఆవాసాలలో స్కూళ్ళు ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకోనినారు. ఎందుకంటే చాలామంది పిల్లలను పట్టణాలకు పంపించడం కంటే కొంతమంది ఉపాధ్యాయులను గ్రామాలకు పంపించడం సులభం. ఉపాధ్యాయులు తప్పని పరిస్థితులలో గ్రామాలలో ఉండవలసి వచ్చేది. అట్టి పరిస్థితులలో కూడా పిల్లలు హైస్కూలు చదువు కొరకు రోజు 7,8 కి. మీ. వెళ్లి చదివేవారు. ఈ 7,8 కి.మి.దూరం తగ్గించడానికి దాదాపు కొద్దిగా పెద్దగా వున్న గ్రామాల అన్నింటిలో హైస్కూళ్ళు ఏర్పాటు చేస్తూవస్తున్నారు.
ఇది వికేంద్రీకరణ. పలితాలు కొంత కాలం మంచిగానే ఉన్నవి. ఈ వికేంద్రీకరణ ఎక్కువైనది పలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. సంఖ్యలో పిల్లలకనుగుణంగా స్కూళ్ళు పెరిగినాయి. ఉపాధాయులు పెరిగినారు. కాని సంఖ్యలలో సమన్వయము లేదు. పర్యవేక్షణ సంఖ్యల సరిచూసుకొనుటకే సరిపోతున్నది.
ఇది అప్పటి అవసరం.
ఇప్పుడు రోడ్డు సౌకర్యాలు, వాహనాల లభ్యం పెరగడం వల్ల ఉపాధ్యాయులను గ్రామాలలో ఉంచలేని పరిస్థితి. కావున వారు పట్టణాలలో స్థిరపడి రోజు పాఠశాలలకు 70, 80 కి. మీ. దూరం పోయు వస్తున్నారు.ఇది భోధన మీద తప్పక చెడు ప్రభావం చూపెడుతుంది.దీనికి ఎవరిని నిందించడం లేదు. పట్టణీకరణ పెరుగుతున్నది. ఇది కొన్ని మార్పులకు అనుగుణంగా సహజంగా జరిగే మార్పు. ఈ మార్పుకు తగిన మార్పులను ఆశ్రయించాలి.
కాబట్టి ఇప్పుడు కేంద్రీకరణ చేయాలి.అంటే పాఠశాలల సంఖ్యను తగ్గించాలి.ఉపాధ్యయుని వద్దకు పిల్లలు వెల్లక తప్పదు. ఇతర వివరాల కొరకు తరువత posting చూద్దాం.

5 కామెంట్‌లు:

Bhãskar Rãmarãju చెప్పారు...

>>కాలం చెల్లిన విధానాలే ఈ పరిస్థితికి కారణం
విద్యావిధానానికి కాలం చెల్లిందా లేక జనాలకి ఎచ్చులు పెరిగిందా? దీనికి కారణాలు
#౧ కేవలం "ఆంగ్ల మీడియం" అంటే మోజు
#౨ కొంటే కానీ ఆనకపోవటం
#౩ కులగజ్జి
#౪ అవగాహన లేకపోవటం
#౫ ఒకళ్లని చూసి ఇంకొకళ్లు వాత పెట్టుకోవటం.
ఇది చెప్పండి ముందు, మన విద్యావిధానానికి కాలం చెల్లింది అని ఎలా చెప్పగలరు? ప్రైవేటు విద్యా సంస్థలకి ఏ విధానం ఉంది? ఎవరు శాసిస్తున్నారు వాటిని ఇదిగో ఈ పద్ధతి పాఠించండి అని?

సమతలం చెప్పారు...

తెలుగు మీడియమా? ఇంగ్లిష్ మీడియమా? అని కాదు.
కామన్ స్కూల్ విధానం మాత్రమె పరిష్కారం.
దాని గురించి తరువాత టపాలో చర్చించుదాం.
నేను చెప్పదలుచుకున్నది ప్రభుత్వ అనాలొచిత విధానం వల్ల పాఠశాల విద్య ఎలా బలహీనపడినది , ప్రైవెట్ విద్య ఎలా బలపడ్డదని. జనాలను తప్పు పట్టడం కాదు , వారిపై జాలిపడాలి. I am against of privatisation of school education

Bhãskar Rãmarãju చెప్పారు...

బ్రదర్!! ప్రభుత్వ అనాలోచిత, ఏంటి ఆ అనాలోచనలు? మీదృష్టికి వచ్చినవి కొన్ని రాయండి. మీకు వీలుంటె, నేనో చర్చా వేదిక పెట్టా, పాల్గొనండి, ఇక్కడ : http://teluguvala.ning.com/group/educationalneeds
వీలైతే వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి.

సమతలం చెప్పారు...

నేను గ్రామీణ ప్రాంతపు స్కూళ్ల గురించి మాట్లాడుతున్నాను.అమాయక చదువు రాని గ్రామీణుల దృష్తిలో పెట్టుకొని మాత్లాడుతున్నాను.

కమ్యూనికేషన్స్ సౌకర్యాలు (సరియైన రోడ్లు, బస్సులు, టెలిఫొను మొ..)లేనప్పుదు ప్రతి హాబిటేషన్ (ఆవాసం)లో స్కూల్ ఏర్పాటు చేస్తూవచ్చారు.ఎలా అంటె ఊరు ప్రజలు అదగకుండనే ఒక క్లాస్ రూం బిల్డింగ్ కట్టించారు. టీచరును సమకూర్చుగలమా? పిల్లలు వస్తారా? అనే అలోచన లేకుండ. ఇప్పుడు పిల్లలు రాక, టీచర్స్ లెక అలాంటి స్కూల్ బిల్డింగులు వృధాగా పడిఉన్నయి.
స్కూల్ అంటె బిల్డింగ్ అనేవిధంగా చేసారు. చదువు గురించి మరిచారు. విద్యా శాఖకు ఈ బిల్డింగుల, పిల్లల, టీచర్ల సంఖ్యను పర్యవేక్షణకే సమయం సరిపోతుంది.
ఈ విచక్షణ లేని వికేద్రీకరణ ఆపాలి.

ఒక మనగలిగే విధంగా పెద్ద స్కూళ్లను అన్ని సౌకర్యాలతొ ఏర్పాటు చేయాలి. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చే అవకాశం లేదు.

కామన్ స్కూల్ విధానంకు దగ్గరగా వెల్లే విధంగా మార్పులు చేయాలి. కాని ప్రభుత్వ విధానం ప్రైవెటీకరణను ప్రొత్సహించేవిధంగా ఉన్నది. ప్రైవెటీకరణ స్కూల్ ఎడ్యుకేషనులొ ఉంటె ఇంకా సమాజిక, ఆర్ధిక అసమాంతలు పెరుగుతాయి. సంక్షోభానికి దారితీస్తాయి.

అజ్ఞాత చెప్పారు...

పేదవారి పిల్లలు స్కూల్ చదువు మధ్యలోనే ఆపేసి కూలీ పనులకి పోతుంటారు. డబ్బున్న వారి పిల్లలు మంచి ఇంజినీరింగ్ చదువులు చదవగలరు. అవసరమైతే విదేశాలలో చదువుకోవడానికి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా రెడీగా ఉంటాయి. పేదవారి పిల్లలు స్కూల్ చదువులు మధ్యలో ఆపకుండా నిరోధించడానికి ఎవరూ ఏ చర్యలు చేపట్టరు. ఇప్పుడు పాలకులు ఇంజినీరింగ్ కాలేజిలకి ఇబ్బడి ముబ్బడిగా లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. ఈ సో కాల్డ్ అభివృద్ధి చెందుతున్న దేశంలో తమ పిల్లలకి ఇంజినీరింగ్ చదివించే స్థోమత ఎక్కువ మంది ప్రజలకి లేదు. అందుకే ఇంజినీరింగ్ కాలేజిలలో సీట్లు ఖాలీగా మిగిలిపోతున్నాయి. ఆకలితో కేకలు వేసే వారికి అన్నం పెట్టరు కానీ బిర్యాణీలు తినే వాళ్ళకి పిజ్జాలు అందిస్తారు.