మార్పు
మార్పు అంటె ఏమిటి?
మార్పు ఎలా వస్తుంది?
మార్పు అంటె ముందుకు వెళ్ళడం.మార్పు అనేది సహజంగా వస్తుంది.
మనిషి ప్రమేయం మార్పులో ఎంత వుంటింది?
మనిషి మార్పుకు దిశా నిర్దేశం చేయగలడు.
చిరంజీవి చెప్పే మార్పు ఏమిటి?
సమసమాజం, సామజిక న్యాయం, అవినీతి నిర్మూలన, గ్రామస్వరాజ్యం.
పైన చెప్పినవి వేరువేరు సమస్యలా?
ఏవిధంగా ఈ మార్పు తెస్తాడు?అతను చేయవలసినది ఏమిటి?
దిశా నిర్దేశం
సమసమాజం
అంటె ఏమిటి?
సాధ్యమా?
సమసమాజం అంటె ఆర్దిక, సామజిక సమానత్వం. ఇవి పూర్తిగా సాధ్యం కావు. సాధిస్తే పురోగతి ఆగుతుంది. అసమానతలే పురోగతికి ఆలంబన. అదేవిధంగా తీవ్రమైన అసమానతలు అశాంతికి దారి తీస్తాయి. ఏమి చేయాలి? అసమానతలు తగ్గించాలి. దానికి సమాన అవకాశాలూ కల్పించాలి. సమాన అవకాశాలూ అంటె ఏమిటి? సామజిక, ఆర్ధిక స్థాయిల ప్రమేయం లేకుండా అందరికి ఒకే విధమైన విద్యావకాశాలు కల్పించాలి.
సామాజిక న్యాయం
అంటే ఏమిటి? సాధ్యమా?అన్ని సామజిక వర్గాలకు (కులాలకు)పరిపాలనలో భాగం ఇవ్వాలి. అంటె పంచుకోవటం. అంటె అరాచకం. కుల వృత్తులు నశించినప్పటికి ఈ గ్రామీణ వ్యవస్థ వున్నప్పుడు సామజిక వర్గాలు ఉంటాయి. మరి ఏమి చేయాలి? వర్గాలు (కులాలు)అంతరించాలి. అంటె గ్రామీణ వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలి. అంటె పట్టణీకరణ. నగరీకరణ కాదు. నగరీకరణ అంటె అవినీతికి ఆలంబన. గ్రామాలను యధావిధిగా వుంచడం అంటె కులాల ఉనికిని కాపాడటం. పట్టణ స్థాయిలో కుల వివక్ష తగ్గుతుంది. వర్గాల ఉనికి నశిస్తుంది.రెడ్ల రాజ్యం పోవాలి. కమ్మల రాజ్యం పోవాలి. మనుషుల రాజ్యం రావాలి.
అవినీతినిర్మూలన
అవినీతి అంటే ఏమిటి?అవినీతికి సరియైన నిర్వచనం చెప్పటం కష్టమైన పని . విధి నిర్వహణ చేయటానికి డబ్బు తీసుకుంటేనే అవినీతి అనేది ప్రచారంలోఉన్నది. చాలా ప్రభుత్వ విధానాలే అవినీతికరమైనవిగా వున్నాయి, అవినీతికి అవకాశమిచ్చే విధంగా వున్నవి. ప్రాధాన్యత లేని వాటికీ డబ్బు ఖర్చు పెట్టడం కూడా అవినీతి అనవచ్చు. కానీ వీటికి ప్రమాణాలు ఎవరు నిర్దేశించాలి? ప్రభుత్వ డబ్బు దోచుకునే వ్యక్తికి గౌరవంగా బ్రతికే అవకాశం వున్నది. ప్రభుత్వ డబ్బు ఎవరికీ చెందనిడిగా జనం అనుకుంటున్నారు. కారణం ప్రభుత్వం చాలా పెద్ద వ్యవస్థగా వుండటం. పెద్ద నగరాలు ఏర్పడటం. ప్రభుత్వ డబ్బును దోచుకుంటే ఎవరికీ వ్యక్తిగతంగా నష్టం అనే భావన లేకుంట పరిస్థితి ఏర్పడింది. అవినీతి పెరగటానికి ఇంకొక ముఖ్య కారణం నగరాలలో భూమి విలువ పెరగటం. అవినీతికి సూచిక భూమి ధరలు.ఏమి చేయాలి ?చిన్న వ్యవస్థలు ఏర్పాటు కావాలి. స్థానిక సంస్థలను మనగలిగే స్థాయిలో ఏర్పాటు చేయాలి.ఆర్ధిక వ్యవహారాలు వారికే అప్పగించాలి. అంటే బడ్జెట్ రూపకల్పన వారికే అప్పగించాలి.ప్రజలు వారి ప్రాధాన్యతలు వారె గుర్తించి వారె ఖర్చు చేసుకోవాలి. ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు అనే స్పృహ కలిగేవిధంగా పరిస్థితి రావాలి.
గ్రామస్వరాజ్యం
గ్రామస్వరాజ్యం అంటే ఏమిటి? గ్రామం తన అవసరాలు తనే తీర్చుకొనే విధంగా వుండాలి. ఇది సాధ్యమా?దేశ స్వరాజ్యమే సాధ్యం కాదు అనే పరిస్థితిలో గ్రామస్వరాజ్యం గురించి ఏమి చెప్పాలి? సాంకేతిక అభివృద్ది అనేది ఆ పరిస్థితి తేచ్చినది అనిపిస్తుంది. సాంకేతిక అభివృద్ది అనేది పెద్ద వ్యవస్థల ఏర్పాటుకు కారణమైనది. అంటే అర్బనైజషన్. దానినే ఇప్పుడు గ్లోబలైజేషన్ అనవచ్చు.ఇప్పుడున్న గ్రామాలూ ఏవిధంగా మనలేవు. పట్టణాలు కొంతవరకు మనగలవు. వాటి అస్తిత్వం గుర్తించవలసిన స్థాయిలో వుంటుంది. ఇతరులతో ఇచ్చుపుచ్చుకొనే విషయంలో స్పష్టత వుంటుంది. మనిషికి నాగరిక అవసరాలు అనేవి పట్టణ స్థాయిలో తక్కువ వనరులతో సమకూర్చుకోవచ్చును.కావున పట్టణీకరణ కావలసిన అవసరం వున్నది.
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఏమి చేయాలి?
మార్పుకు నాంది ఎలా మొదలు పెట్టాలి?
పట్టణీకరణ జరపాలి.
అంటే మండల స్వరాజ్యాలు ఏర్పాటు చేయాలి. మనగలిగే చిన్న వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
మార్పుకు నాందిగా విద్యావ్యవస్థను మండల స్థాయిలో కేంద్రీకృతం చేయాలి. ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలి .పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యా సౌకర్యం 12 వ తరగతి వరకు కల్పించాలి. మండల స్థాయిలో 2లేదా౩ పాఠశాలలు (శిశు నుండి 12తరగతి వరకు ) హాస్టలు వసతితో 5కి. మీ. పరిధిలో మండల కేంద్రం లోనే ఏర్పాటు చేయాలి. మండల కేంద్రాన్నే పట్టణంగా అభివృద్ది చేయాలి. గ్రామాలలో అవసరమైన చోట అంగనవాడి కేంద్రాలు (శిశు నుండి ౩ వ తరగతి )ఏర్పాటు చేయాలి. గ్రామాల నుండి మండల కేంద్రానికి రోడ్డు సౌకర్యాలు అభివృద్ది చేయాలి.పాఠశాలలో ఇంటర్నెట్ లాంటి అన్ని అధునాతన సౌకర్యాలు కల్పించి పాఠశాలను మరియు హాస్టలు ను సమర్ధవంతంగా నడపించాలి.అందరికి సమాన విద్యావకాశాలు కల్పించాలి. కోటీశ్వరుడు మరియు రోజు కూలి పిల్లలు ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో ప్రక్కప్రక్కన కూర్చునే పరిస్థితి కల్పించాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి పాఠశాల తో సంబంధం ఏర్పడాలి. మనం ఒక సమాజంలో వున్నామనే భావనకు ప్రస్తుతం మనకు ఎలాంటి బంధం లేదు. ఎందుకంటే కులాలు ఒకటి కావు, మతాలు ఒకటి కావు. వ్రుతులు వేరు. ఆర్ధిక స్థితిగతులు వేరు. బాష తప్ప. (పరిస్థితి యధావిదిగా కొనసాగితే భాష గూడా వేరవ్వుతుంది)గ్రామాల నుండి మండలాలకు వలసలు ప్రోత్సహించాలి. నగరాలకు వలసలను తగ్గించాలి. ప్రతి అభివృద్ది పనికి మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలి. మండల స్థాయి పట్టణంలో ఆరోగ్యకర పట్టణ మరియు పల్లెటూరి వాతావరణ పరిస్థితులు కల్పించాలి.ఎన్ టీ ఆర్ తెచ్చిన మార్పుకు కొనసాగింపుగా మండలాలలో స్వరాజ్యాలు ఏర్పాటు చేయవచ్చు. 15 ఏండ్లలొ చాలా మార్పును తేగలం.
Above structural adjustment will create human growth engines. We do not need material growth engines.
మిగతా మార్పులు తదనుగుణంగా వస్తవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి