“తెలంగాణ సాధన సభ” - ఇదీ నాటకమే - గత చరిత్ర చూస్తే
– మచ్చుకు ఒక సంఘటన
ఇది 2004 లో అధికారం కొరకు 2000 లో తెర లేపిన మొదటి నాటకం
జయశంకర్ “వోడవని ముచ్చట”
నుండి
ఇదేం గుసగుస గాదు
ఇగ రాయడం, చేయడం, ఉపన్యాసాలివ్వడం. ఏం జరిగిందంటే... అప్పుడు 1998 వచ్చింది. 98లో ఏం
జరిగిందంటే అదిలాబాద్ లో కలరా ఇన్సిడెంట్. చాంద్రబాబునాయుడి కాలం. ట్రైబల్స్ కలరా
ట్రీట్మెంట్ లేక చనిపోవడం. మేమంతా వరంగల్ నుండి ఫ్యాక్ట్ ఫైండింగ్ గ్రూప్ బోయి
స్టడీ జేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్నీ వరల్డ్ హెల్త్
ఆర్గనైజేషన్ లో రిపోర్ట్ అయినయ్.
యుకె, యూఎస్ఎ లో అపుడు ఏం జరిగింది? నేను నా పర్సనల్ పని మీద అమెరికా పోయివుంటి. పోతే కొంత మంది స్టూడెంట్స్, ఫ్రెండ్స్ వాల్లంతా సార్ మీరు వస్తున్నరు గదా! ఏంది ఈ కలరా సంగతి ఏంది? మీరు రిపోర్ట్ రాసిండ్రు గదా? పేపర్లో వచ్చింది.
మాకు జెప్పాలె సార్ అన్నరు. నేను న్యూయార్క్ లో దిగంగనె వొక మీటింగ్ బెట్టిండ్రు.
ఆ రోజు కేవలం కలరా గురించి జెప్పిన, దాంట్లో అప్పుడేంది...
అంతకు ముందు చంద్రబాబు నాయుడు అది విజన్ 20-20 ఇదెంత పెద్ద స్వర్గతుల్యమైందో
జెపుతు ఆయన అట్ల అంటడు, ఇట్ల అంటడు మొత్తం ఆయన ఏం
జేస్తున్నడు, ఏం జరుగుతుందో జెప్పిన. తర్వాత... అయితే ఆ రోజు ప్రధానంగ జెప్పింది
నేను కలరా గురించే, గాని తెలంగాణ
ఇష్యూ వచ్చింది. అయ్యేటప్పటికి చాలా మంది ఇంత ఘోరంగ వుందా సార్, ఇట్ల కాదు మల్లోకసారి చాలమందిని పిలుస్తం అంటె,
నేను రెణ్ణెల్లు బోయింటిని.
జనవరి 1999 లో న్యూయార్క్ లో మీటింగ్ బెట్టి చుట్టుపక్కల
రాష్ట్రాల్లో వున్నటువంటి చాలా మంది తెలంగాణవాళ్లను పిలిపిచ్చి ఒక మీటింగ్
పెట్టిండ్రు. ఒక రోజంతా నాతోని మాట్లాడించిండ్రు. ఒక రోజు
మొత్తం తెలంగాణ గురించి క్వశ్చన్స్, ఆన్సర్స్. వాల్ల ఇంట్రస్ట్. మరి మేం ఏం జేయాలె సార్, ఏంది అంటె... ఏముంటది మీరు ఇంట్రస్ట్ జూయించాల అని
జెప్పిన.
అప్పుడు వాల్లు ‘తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం’
అని ఒక సంస్థను స్థాపించిండ్రు. అమెరికాలో అది బాగా స్ప్రెడ్ అయ్యింది డీటీఎఫ్.
అది ఇక్కడ బాగా ప్రచారం వొచ్చింది. ఇండియాలో కూడా బాగా ప్రచారం వొచ్చింది. అయిన
తర్వాత ఎందంటె... ఇట్లగాదు సార్! మీరు మొత్తం అమెరికాలో చాలా స్టేట్స్ లో తిరగండి
అన్నరు. 2000లో నన్ను బిలిపించుకొని పది సిటీస్ లో లెక్చర్ టూర్ మొదలు
పెట్టింఛిండ్రు నాతోటి, నాతోపాటు జనార్ధనరావు వచ్చిండు
అపుడు. తెలుసుగద జనార్ధనరావు? టెన్ సిటీస్ లో రెణ్ణెల్లు
విస్తృతమైనటువంటి ప్రచారం వచ్చింది.
అప్పుడేం జరిగింది? అదే సమయంలో ఏం జరిగిందంటె... తెలంగాణ కాంగ్రెస్
వాల్లందరు 41 మంది ఎమ్మేల్యేలు సోనియాగాంధికో
రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఆమేదో ఒక కమిటీ వేసింది. అదే ప్రణబ్ ముఖర్జీ
కమిటీ. ఎవరన్నా వచ్చి మీరు మీ వాదన వినిపించండి అని జెప్పిండ్రు. ఆ కమిటీలో
మన్మోహన్ సింగ్ గూడ వుండె అపుడు. మన్మోహన్ సింగ్ కు నాకు పాత పరిచయం ఒకటుంది. అది
వేరు విషయం. మరి ఎవరన్న వచ్చి వినిపించాలి అంటె అపుడు రాజశేఖరరెడ్డి అనుమతితోనే బోయిండ్రు
గదా వీల్లు! ఎవరు వినిపించాలె, ఎవరు వినిపించాలె అని
తర్జనభర్జన జేసుకొని, జయశంకర్ అయితే మంచిగుంటది అని
నాదగ్గరికి పొన్నాల లక్ష్మయ్యను పంపిడ్రు... ఇంటికి, వరంగల్
కు. పరిచయమే బాగా. మరి నేనేం కాంగ్రెసోన్ని గాదు,
ఎమ్మెల్యేను గాదు, నేనెట్ల జెప్పాల్నయ్యా అంటె, లేదుసార్ మీరైతె బాగా జెప్తరు అన్నడు. మంచిది తెలంగాణ గురించి నీ మాటగ నా
నోట జెప్పిస్తే తప్పకుండ వస్త అన్న.
17 అక్టోబరు 2000 రోజున డిల్లీ, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో ప్రణబ్ ముఖర్జీ
కమిటీ ముందు నేను రెండున్నర గంటల సేపు వాదించిన ఆఫీషియల్ గ,
ఇదేంటి... ఇదేం గుసగుసగాదు. తెలంగాణ నుండి రెండువందల మంది సీనియర్ లీడర్స్, ఎంపీలు, ఎమ్మేల్యేలు, కాబోయే
వాల్లు, అయిన వాల్లు, ఆల్ సీనియర్స్!
టూ అండ్ హాఫ్ అవర్స్ వాదించిన. గివె... ఇవే సమస్యలు.
అప్పుడు వాల్లు ‘తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం’
అని ఒక సంస్థను స్థాపించిండ్రు. అమెరికాలో అది బాగా స్ప్రెడ్ అయ్యింది డీటీఎఫ్.
అది ఇక్కడ బాగా ప్రచారం వొచ్చింది. ఇండియాలో కూడా బాగా ప్రచారం వొచ్చింది. అయిన
తర్వాత ఎందంటె... ఇట్లగాదు సార్! మీరు మొత్తం అమెరికాలో చాలా స్టేట్స్ లో తిరగండి
అన్నరు. 2000లో నన్ను బిలిపించుకొని పది సిటీస్ లో లెక్చర్ టూర్ మొదలు
పెట్టింఛిండ్రు నాతోటి, నాతోపాటు జనార్ధనరావు వచ్చిండు
అపుడు. తెలుసుగద జనార్ధనరావు? టెన్ సిటీస్ లో రెణ్ణెల్లు
విస్తృతమైనటువంటి ప్రచారం వచ్చింది.
17 అక్టోబరు 2000 రోజున డిల్లీ, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో ప్రణబ్ ముఖర్జీ
కమిటీ ముందు నేను రెండున్నర గంటల సేపు వాదించిన ఆఫీషియల్ గ,
ఇదేంటి... ఇదేం గుసగుసగాదు. తెలంగాణ నుండి రెండువందల మంది సీనియర్ లీడర్స్, ఎంపీలు, ఎమ్మేల్యేలు, కాబోయే
వాల్లు, అయిన వాల్లు, ఆల్ సీనియర్స్!
టూ అండ్ హాఫ్ అవర్స్ వాదించిన. గివె... ఇవే సమస్యలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి