యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు
13, ఏప్రిల్ 2009, సోమవారం
సీట్లేందుకు అమ్ముడుపోతున్నాయి? ఓట్లెందుకు అమ్ముడుపోతున్నాయి?
ఆంధ్ర జ్యోతి శ్రీనివాస్ గారు అన్నారు "కాబోయె ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్లు కొంటున్నారు, ఓట్లు కొంటున్నారు. ?" ఇంత బహిరంగంగా జరుగుతున్నది ఈ అమ్మకం వ్యవహారం, కొనటం వ్యవహారం. ఈ సీట్లు, ఓట్లు కొనుక్కున్న ఎమ్మెల్యేలపై, ఎంపీలపై ఎవరికి(సీట్లమ్ముకున్న అధినాయకులకు , ఓట్లు అమ్ముకున్న ప్రజలకు) అధికారం ఉండదు, వారు దేనికి బాధ్యులు కారు. మనకు ఇది చాలా మామూలుగా అనిపిస్తుంది మామూలుగానైతె. కాని ఒక్క సారి ఇలాంటి మామూలు స్పృహనుండి బయటబడి ఆలోచిస్తే ఇది చాలా విచిత్రమైన, ఘోరమైన విషయం అనిపిస్తుంది.
ఇలా జరగటానికి కారణాలు, ఇలా జరగకుండా ఉండాలంటె ఏమి చేయాలొ చెప్పండి ఒకటి, రెండు వాక్యాల్లొ.
23, ఫిబ్రవరి 2009, సోమవారం
తెలంగాణా - ఆంధ్రా నిజాములు
ఆ మద్యన ఒక సారి ఒక బాలివుడ్ నటి మన తెలుగు నటుడు నాగార్జునను నిజామంత ఐశ్వర్యవంతుడు అంటు ఇంకా చాల చాలా తెగ పొగిడింది.
ఈ మద్యన నాగార్జున కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొరకు యాడ్ లొ నటిస్తె, ఏ లాభం కొరకో ( భూమికి సంబంధించినదని అనుమానం) ఇలా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నాడని విమర్శ వచ్చింది.దీనికి ఒకరు నాగార్జునకుడబ్బు అవసరం లేదు. డబ్బు కొరకు చేసెవాడు కాదని, నిజామంత ధనవంతుడనే విధంగా సమర్ధించినారు.
కావచ్చు.
నాగార్జున ఒక్కడె కాదు, వందలమంది నిజాం నవాబులంతటివాళ్లు హైద్రాబాదులొ ఉన్నరు.
వీరంతా తెలంగాణా రాకుండా వీలైన అన్ని విధాల ఆంధ్ర నాయకత్వానికి సహాయం చేస్తారు.ఉదాహరణకు తెలంగాణా పై ఏకాభిప్రాయం లేదనటానికి ఒక ఇరువై, ముప్పై మంది ఇతర రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులను కొని తెలంగాణాకి మేము వ్యతిరేకం అనిపించగలరు.
మన తెలంగాణా దౌర్బాగ్యం ఏందంటె,
మనవాళ్లు ఆనాడు 1947-49 లో నిజాం కి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించి అతడిని వదిలించుకున్నాము. జమిందారులను, భూస్వాములను పట్టణాలకు పారదోలినరు. కులాల అంతరాలు తగ్గినయి, దొరల పెత్తనం పొయింది.దాదాపుగా ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ రూపుదిద్దుకుంటున్న తరుణం.
అప్పుడు 1956 లో మనకు ఆంధ్ర పెత్తందారులను (ఆంధ్ర ప్రజలు కాదు)తీసుకవచ్చి నిజాములను చేసి పైన కూర్చొపెట్టిండ్రు. ఒక్కడు పొయి వందల కొద్ది నిజాములు హైద్రాబాదుకొచ్చిండ్రు ఆంధ్రానించి. మన పాత పెత్తందారులు (రాజకీయ నాయకులుగా, పారిశ్రామిక వేత్తలుగా రూపాంతరం చెందినాజమిందారులు,భూస్వాములు )తిరిగి పాత పాత్రనె పోషిస్తున్నారు అంధ్రా నిజాముల కింద వుండి .కోస్తానించి కులగజ్జి, రాయలసీమనించి ఫ్యాక్షన్ (ముఠా రాజకీయాలు)బుధ్దులు అంటుకుంటున్నాయి. మన వాళ్ల పోరాటాలు, ప్రాణత్యాగాలు వృధా అయినాయి. మన బతుకులు మారలేదు.
ఇప్పుడు వందల మంది నిజాములను ఎదుర్కొనాలి.