యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

15, ఆగస్టు 2013, గురువారం

అసహజ కలయిక - పరిమాణాత్మక పరిణామం

             సీమాంధ్ర, తెలంగాణలను కలపడం ఒక అసహజమైన ప్రక్రియ అని నిరూపణ జరిగింది. చరిత్రపరంగా, సంస్కృతిపరంగా, ఆర్ధికపరంగా  తేడాలున్న ప్రాంతాలను కొంతమంది విజ్ఞత లేని వ్యక్తుల ప్రోత్బలంతో ఈ రొండు ప్రాంతాలను కలపడం జరిగినది. ఇది ఒక అసహజ ఐక్యత. దీని పర్యవసానాలు కూడా అసహజంగా ఉన్నాయి.

           రెండు ప్రాంతాల ప్రజల మద్య సంబంధాలు చాలా బలహీనంగా ఉన్నాయి. 56 ఏండ్ల తర్వాత కూడా ఇది తెలంగాణ కుటుంబం, ఇది ఆంధ్ర కుటుంబం అని తేట తెల్లంగా చెప్పే స్థితి ఉంది. ఇక్కడి రాజకీయ పార్టీలలో  ఏకాబిప్రాయం సాధ్యం కావడం లేదు. ప్రత్యేక తెలంగాణ కావాలని సెంప్టెంబర్, 2011 లో 10 జిల్లాల ప్రజలు సకలజనుల సమ్మె చేసిండ్రు. మిగతా 13 జిల్లాలనుంచి ఎలాంటి స్పందనలేదు. ఇప్పుడు ఆగస్ట్-2013 లో సమైఖ్యాంధ్ర అని 13జిల్లాలో సమ్మె చేస్తున్నరు. మిగతా 10 జిల్లాలో వ్యతిరేకత ఉన్నది. ఈ విధమైన తేడా నల్ల, తెల్ల జాతిల మధ్య కూడా లేదేమో అనిపిస్తది. ఇంతగా సయోధ్య సాధ్యం కాని ప్రాంతాలను కలిపిఉంచడం అశాంతికి కారణమైతది. ఇది ఒక అసహజ కలయిక.


         ఇక తెలంగాణలో ఆంధ్ర ఆదిపత్య వర్గాల దోపిడి గురించి ఎంత చెప్పిన తక్కువె. “నీళ్ళు, నిధులు, నియామకాలు” గురించి చాలా చర్చ జరిగింది. అంచనాకు అందని అన్యాయం జరిగింది. దోపిడి అనేది చాలా మోసపూరితంగా జరిగినది. ఆ మూడు కాక ఇతర వనరులు “భూములు, గనులు, అడవులు, మార్కెట్లు, ..... ఇలా చెప్పుకుంట పోతే అంతు ఉండదు. కానీ పరాకాష్ట ఎందంటే ఓట్లు దోసుకున్నరు మోసపూరితంగ. 1999 లో వైఎస్ తెలంగాణ గురించి 42 మంది ఎమ్మెల్యేలను సోనియా దగ్గరకు పంపింది కేవలం 2004లో  తెలంగాణ ఓట్ల దోపిడి కొరకే. 2008లో బాబు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేయించడం 2009లో తెలంగాణ ఓట్ల దోపిడి కొరకే. ఈ ఆంధ్ర ఆదిపత్య వర్గాల దోపిడి ఎంత పరిమాణాత్మకంగా పరిణామం చెందిందంటె అది గుణాత్మకమైన మార్పుకు దారి తీసింది. అదే తెలంగాణ ఏర్పాటుకు దారి తీసింది. దీనినే గతితార్కిక సూత్రం అంటరు.

 



 

27, జులై 2013, శనివారం

తెలంగాణ – సీమాంధ్ర – సామాజిక న్యాయం

ప్రొ.జయశంకర్ వోడవని ముచ్చట నుండి

విడిపోతే సాధ్యం అయిద్ది

     వస్తది.. ఇపుడు ఎందుకొస్తదో చెప్త, అక్కడికే వస్తున్న. సామాజిక న్యాయం.. ఇపుడు ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం ఎందుకవుతున్నాయని జెప్తున్నమంటె, 50, 60 ఏండ్ల నుంచి తెలంగాణలో వచ్చిన ఉద్యమాలు, అప్పటి సాయుధ పోరాటమే గావొచ్చు, నిజాం వ్యతిరేక పోరాటమె గావచ్చు, నక్సలైట్ ఉద్యమం గావచ్చు, కులసంఘాలు గావొచ్చు, తెలంగాణ ఉద్యమం గావొచ్చు... ఇయన్నిటితో జనచైతన్యం బెరగలేదా? వట్టిగ బోతదయ్య? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది సాధ్యం కాదు, విడిపోతె సాధ్యం అయిద్ది. ఎట్ల అన్నప్పుడు చెప్త విను. 50, 60 ఏండ్ల చరిత్ర లోపల, సరె బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం అంటె దానికి ఏంటి కొలమానం? కొలబద్ద ఏమిటి? నా దృష్టిలో అ వర్గాలనుంచి ఎదిగి వచ్చి, ముఖ్యమంత్రి గావాలె, తర్వాత ప్రధానమంత్రిగ నిలదొక్కుకోవాలె, జరిగిందా? ఒక్క సంజీవయ్య 18 మాసాలు, ఆయన గాలె, తీసుకొచ్చి కూసోబెట్టిండ్రు. ఆయన ఎక్కువ జేసేవరకు తీసేసిండ్రు. తర్వాత ఎవడన్న అయ్యిండా? కానిస్తరా? కానివ్వరు.  ఇపుడు ఏ పార్టీ అయిన దీసుకో, కాంగ్రెస్ పార్టీ అంటె మల్ల గదే రాజశేఖరరెడ్డా, విజయభాస్కరరెడ్డి కొడుకులా, లేకపోతె పురంధేశ్వరా, జైపాల్ రెడ్డా... గీల్లే గదా? టిడిపి అంటె సింగిల్, కమ్యూనిస్టులు ఏమన్న తక్కువతిన్నర? మల్ల గవే కులాలు గదా? బిజెపి గదే గదా? కనుక ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటె... ఏవైతె రెండు బలమైన వర్గాలున్నయో, రెడ్డి అండ్ కమ్మ వాల్ల చేతుల్నుంచి బయటికి రాదు.

          తెలంగాణ, రాయలసీమ రెడ్లు గలిస్తే పెద్ద ఫర్మిడబుల్ ఫోర్స్ అది. కమ్మాస్ ఎమర్జ్ అయిపోయిండ్రు. విడిపోతే  ఏమైద్ది అంటె, ముందు కమ్మ ఫ్యాక్టర్ పోతది. తెలంగాణలో కమ్మ ఫ్యాక్టర్ వుండదు. అంటె బలమైన ఫ్యాక్టర్ గాదది. తెలంగాణ, రాయలసీమ రెడ్లు కలవకపోతె  తెలంగాణ రెడ్లు వీక్. వాల్ల ధనబలంతోని వీల్లు, రాజశేఖరరెడ్లు, విజయభాస్కరరెడ్లు జేయబట్టి వీల్లు.. పోతె... రాయలసీమ రెడ్లకన్న తెలంగాణ రెడ్లల్లో కొంత అవగాహన వచ్చింది. మనంతట మనం! రెండవది... ఇప్పటికి గూడ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం లోపల పదిరికుప్పంలు, వేంపెంటలు, కారంచేడులు జరుగుతున్నయ్. తెలంగాణలో గావు, అవకాశం లేదు. ఎందుకు జెప్తున్న అంటె ఇక్కడ బలహీన వర్గాలలో చైతన్యస్థాయి పెరిగింది. పెరగడం ఒక్కరోజులో గాదు, ఈ 50, 60 ఏండ్ల ఉద్యమాలు. రేపు రాష్ట్రం వచ్చినంక కూడా రాష్ట్రాన్ని కాపాడేది ఆ చైతన్యమె, వ్యక్తులు గాదు.


          సామాజిక న్యాయం అన్నప్పుడు... నేను అంతా న్యారో గా జూడను. బడుగు, బలహీనవర్గాలు, ఇపుడు తెలంగాణలో ఎందుకు సాధ్యమైతది అంటె, ఈ నేపధ్యం జరిగినపుడె, స్టేట్ యొక్క ధ్యేయమది అయినప్పుడె ఇవన్ని అయితయ్. ఆ ఎకనామిక్ డెవలప్మెంట్ పాలసీస్ ఎట్ల వస్తయయ్య? జనానికి ఇపుడు జయశంకర్ జెప్తెనో, నువ్వు జెప్తెనో రాదు గద. జనంలో చైతన్యం రావలె గద. ఆ చైతన్యం వచ్చింది.

23, జులై 2013, మంగళవారం

తెలంగాణ రాజకీయ పార్టి పై విమర్శలు - వివరణ

ప్రొ.జయశంకర్" వొడవనిముచ్చట" నుండి

ఇట్స్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్


          ఒకటేంటంటే ఏ ఉద్యమంలో గూడా ఏ నాయకుడు వచ్చినా, రాజకీయ వుద్దేశాలు లేకుండా వస్తరనుకోడం భ్రమ. ఏ పార్టీ అయిన గని, రాజకీయనాయకునికి రాజకీయ ఉద్దేశం లేకుండా ఉద్యమంలో ప్రవేశించే అవకాశమే వుండదు. ఇట్స్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్. ప్రజల ఆకాంక్షలతో అవి కొఇన్సైడ్ అయినపుడు క్లిక్ అయితయ్. ప్రజల ఆకాంక్షలతో రాజకీయ నాయకుడు లేకుంటె క్లిక్ కావు. ఎందుకు కాదంటె మలాంటివాల్లము పోలిటికల్ గ జేయలేయకపోయినం. జీవితమంత గడిపినం గద, గుమ్మందాక బోయినం, గుమ్మం దాటలె. ఎందుకంటే దాటలేం మేం. మేం అంటే మనం దాటలేం.

        ప్రజల చైతన్యాన్ని పెంపొందింపజేస్తం, ఇడిజేస్తాం. ఇష్యూ హైలెట్ జేస్తాం. ఇష్యూ సజీవంగ ఉంచుతం గని పొలిటికల్ యాక్టివిటీ లేకుండనె రాష్ట్రం వస్తుందంటె అది వేరు విషయం గని, పొలిటికల్ యాక్టివిటీ లేంది రాదు అనేది ఒక వాస్తవం. పొలిటికల్ యాక్టివిటీకి పొలిటికల్ నాయకులే రావలె, ఆకాశం మీంచి ఎవరు రారు. జయశంకర్లు, కోదండరామ్ లు సరిపోరు. ఎంత మంచి వాల్లయిన సారిపోరు. మలాంటి వాళ్లం ఎన్నికల్లో పోటీజేస్తే గెలుస్తం గావచ్చు. రెండవ సారి గెలవం మల్ల. ఈ సంస్కృతి లో ఇమడం మేం.  గనుకనే దూరం వున్నం, కనుకనే ఈ మాత్రం గుర్తింపు వుంది అనుకుంటున్నం. లేకపోతే చెన్నారెడ్డి రావడానికి కారణం ఏమిటి? చెన్నారెడ్డి ప్రజాసమితి పెట్టలేదు!

      చారిత్రక వాస్తవం ఏందంటె చెన్నారెడ్డి రాకముందె ప్రజాసమితి వచ్చింది. ఆయన రాకముందె ఉద్యమం వచ్చింది. కని దారి దొరుకుతలేకుండె. ఈ వయొలెన్స్, కాల్పులు, చావడమె గాని దారి దొరుకుతలేకుండె. చాలా మందికి చెన్నారెడ్డి మీద అనుమానం, మాకు గూడ వుండె. కని చెన్నారెడ్డి రావడంతోని ఒక్కసారి ఊపందుకున్నది. చెన్నారెడ్డి రావడం వల్ల జరిగిన లాభం ఏమిటి? నష్టం ఏమిటి? అంటే చెన్నారెడ్డి రావడం వల్ల తెలంగాణ ఉద్యమానికి ఒక పునాది ఏర్పడ్డది. ఆ స్థాయికి పోకపోతే.. ఈ రోజు ఎంత చెడ్డా 1968-69 ప్రాతిపదిక కాదని ఎవడు అనలేడు. చెన్నారెడ్డి స్వార్ధం కొరకే జేసిండా ఆంటె, అనుకొందాం. కని మొదలు పెట్టింది చెన్నారెడ్డి గాదు. ఆ ఊపు వచ్చేది గాదు. రెండవది అది విఫలం గావడానికి కేవలం చెన్నారెడ్డిని మాత్రమే బ్లేమ్ జేయను నేను. చెన్నారెడ్డి గూడ ఒక కారణం. చెన్నారెడ్డి ఎలోన్ వాస్ నాట్ రెస్పాన్సిబుల్. ఆ రోజు తెలంగాణ ప్రజాసమితి పేరుతో ఎన్నికైన మొత్తం ఎంపీలు రెస్పాన్సిబుల్. ఇంక ఇద్దరు బతికే వున్నరు. వెంకటస్వామి, ఎం.సత్యనారాయణరావు. ఈల్లు మూకుమ్మడిగ సరెండర్ అయిపోయిండ్రు... చెప్పక, జేయక. మేం ప్రత్యక్షంగా విట్నెస్ గద! రెండవది ఆరోజు ఇందిరాగాంధి ప్రభావం మొత్తం దేశం మీద ఎట్ల వుండెనంటె... ఆ ఎలక్షన్ లో, మొత్తం దేశంలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలోనే(తప్ప), మొత్తం దేశంలో!  ఈ కాంగ్రెస్ వాల్లకి ఏమిటి, అమ్మో! అమ్మగారి పెత్తనం ఎట్ల అని ఓ.. మూకుమ్మడిగా! చెన్నారెడ్డిగ్గూడ తెల్వదు. ఆ రోజుల్లో చాల క్లోజ్ గ పనిజేసినం ఆయనతోని. చంద్రశేఖరరావుతో ఎట్ల జేస్తున్ననో, అప్పుడు నేను, తోట ఆనందరావు కలిసి అట్లనె జేసీనం.

    అయితె నన్ను, ఆనందరావుని కాంటెస్ట్ జేయమని అడిగిండు చెన్నారెడ్డి. మేం కాదని జెప్పినం. చెన్నారెడ్డి ఐసోలెట్ అయ్యిండు. చెన్నారెడ్డికి ఏముండె అంటె చెన్నారెడ్డిని ఐసోలెట్ జేయాలని వాల్ల ప్లాన్. చెన్నారెడ్డిని ఐసోలెట్ జెయ్యాలని వాల్లేగాదు, యిక్కడ వున్న పి.వి.నరసింహారావు, చొక్కరావు వాల్ల ప్లాన్ గూడ అది. వాల్ల ప్రాముఖ్యత పోతదని. ఐసోలెట్ గావడమా, పవర్ లో ఉన్న పార్టీ ఒడిలో వుండడమా...? ప్రాక్టికల్ పొలిటీషియన్. వాల్లు సరెండర్ గావడమెందుకు, నేనే దీసుకపోయి కలుపుతా అనేటువంటి ప్లానుతోటి పోయిండు ఆయన. కనుక తప్పే. చెన్నారెడ్డి జేసింది రైట్ అనడం లేదు నేను. చెన్నారెడ్డికి విధిలేకుండ అయిపోయింది. చెన్నారెడ్డి స్వార్ధపరుడె, అన్నీ.... ఒప్పుకుంటం. కానీ ఆ రోజున్న సిచుయేషన్ లోపల చెన్నారెడ్డి ఆలోన్ వాస్ నాట్ రెస్పాన్సిబుల్. చెన్నారెడ్డి వాస్ కంపెల్డ్ టు డు దట్ అండ్ హి హ్యాపీలీ డిడిట్.

          ఎవడన్న ఆడిగిండా? ఎవడడగలే. మాలాంటి వాల్లు చూస్తు చూస్తు పక్షుల తీరుగా అయినం. ఏం జేస్తం. ఎందుకంటె రాజకీయంగ మనం ఏం చేయలేం గనుక. వాల్లందరి గెలుపు కొరకు మేం మా ఉద్యోగాలు పోతయని తెలిసినా లెక్కజేయకుండ తిరిగినం. ఎలక్షన్ అయ్యే వరకు, అదీ చెన్నారెడ్డి విషయంలో.  ఇంద్రారెడ్డి వచ్చే వరకు ఏందంటె... ఇంద్రారెడ్డి రాకముందు చాల సెన్సిటైజేషన్ నడిచింది. చాల అంటె చాల నడిచింది. ఇంద్రారెడ్డి నాకు స్టూడెంట్... స్వయాన సిటీ కాలేజీల. నాకు రోజు ఫోను. అప్పటికె ఈ డిబేట్ మొదలయ్యింది. 1994 నుంచి చర్చ మొదలైంది తెలంగాణ మీద. తెలంగాణ ఏదైతె ఐక్య వేదిక పేరుతో కేశవరావ్ జాదవ్, నేను, మాధవరెడ్డి, భూపతి కృష్ణమూర్తి... చర్చ మొదలైంది. పోతె మొదట్నించి మేం పాతకాలపోల్లం. నేను, కాళోజీ, జస్టిస్ మాధవరెడ్డి కలిసి పనిచేసేవాల్లం. ఎక్కడ పోయిన ఇంపార్టెంట్ మీటింగ్స్ కి మేం అడ్డ్రస్ జేసేవాల్లం. మా ముగ్గిరిది ఒక కాంబినేషన్ వుండె ఆ రోజుల్లో, ఐతె ఓ రోజు ఇంద్రారెడ్డి  జస్టిస్ మాధవరెడ్డి, నన్ను, కాళోజిని కలిసి రావాలని కాళోజి దగ్గరకి పోతె... తెలంగాణ గురించి ఎవడు జేసిన వద్దంటామయ్య, ఎవరైన జెయాలి, మంచిగ జెయాలె అంటె, నా దగ్గరకొచ్చిండ్రు. సంతోషమేనయ్య జేస్తే మంచిదేనయ్య. నీ లాంటి యువ కులొస్తే మంచిదె, నిలబడాలయ్య అంటె,  ఆ తప్పక నిలబడత, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదని లాంచ్ జేసిండు. లాంచ్ జేసిండంటె ఒక పార్టీ బెట్టి, ఆ పార్టీకి అండ్ల నాకేదో పొజిషన్, మాధవరెడ్డికి.. ఆయనే ఎనౌన్స్ జేసేసిండు. నేనప్పుడు విశాఖపట్నంలో ఏదో పర్యటనలో  వుండె. పేపర్లో చూసిన, పరేషాన్! ఈ పార్టీ యెక్కడిది? యీ పొజిషన్ యేంది? అని జస్టిస్ మాధవరెడ్డికి ఫోన్ జేసిన. ఈ పోరడు తొందరపడ్డడయ్య అంటె ఐ డిజోన్ ఇట్. నేను డిజోన్ జేయాల్సి వస్తది, డిజోన్ జేస్తే ఆ పోరనికి ఎమౌతుంది? మల్ల అతనితో వాల్ల బ్లెస్సింగ్స్ తోని నేను పార్టీ పెడుతున్న అని. పెట్టిన తర్వాత పార్టీ ఎక్కడ ఏ మీటింగ్ బెట్టిన పికప్పయ్యే దాక. ముగ్గురం నేను, కాళోజి, మాధవరెడ్డి పోయేది, పికప్పయింది.

          ఇంద్రారెడ్డి దొరికిండు మాకొక ఇన్స్ట్రుమెంట్. కని చూస్తే ఏంటి పాతకాలం ముగ్గరం నా కంటె పెద్దోల్లు. కాళోజికున్న ఇమేజ్... జస్టిస్ మాధవరెడ్డికి గూడ. తెలంగాణ విషయంలో చాల పెద్ద ఇమేజే. వ్యక్తిగతంగ వేరే వుండొచ్చు, కని తెలంగాణ విషయంలో చాల కమిట్ మెంట్ తో పనిజేసినం. మేం ముగ్గరం బోతె అది ఫర్మిడబుల్ కాంబినేషన్ అయ్యేది ఆ రోజుల్లో. ఆ పిల్లగానికి ఏందంటె... వాపును జూసీ బలుపు అనుకున్నడు. పాపులారిటీ.. దారి తప్పిండు, ఇగ ఫాస్ట్ గ పోవడం మొదలు బెట్టిండు. అదే రోజుల్లో ఏమైందంటె వార్తా పత్రికలో రామచంద్రమూర్తిగారు ఎడిటర్ వుండె. మేం రాసినయన్ని పబ్లిష్ జేసిండు అప్పుడు వరుసగ..  ఆర్టికల్స్ నావి వరుసగ వచ్చేది. చాలా రోజుల వరకు సీరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చేది. దాంతో చాలా మంది అన్నరు గద ఒక యంగ్ బాయ్ వచ్చిండు, నేను చెప్పడం నా స్టూడెంట్ అని చెప్పుకొనేది, సార్ స్టూడెంట్ గద. పోతె ఈ బ్యాక్ గ్రౌండ్.. లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ తోని వచ్చిండు గద పిల్లవాడు అని అనుకొన్నం. అయ్యే వరకు ఏమైంది.

          అతనేమనుకొన్నడంటె ఇగ తనంతట తను ఎదిగిపోయిండు అనుకొని, ఇండిపెండెంట్ గ యాక్టివిటీస్ జేయడం మొదలుబెట్టి కొలాప్స్ అయ్యిండు. అయి చివరకు కాంగ్రెస్ లో జేరిండు... జూస్తివి గద. కనుక ఇంద్రారెడ్డిది ఏమైందంటె, చెన్నారెడ్డి ఆల్రెడి ఎస్టాబ్లిషిడ్ లీడర్, ఓ సెట్ బ్యాక్ లో వుండె. బాగ రైపెన్ ఆట్మాస్ఫియర్ దొరికింది. ఈ ఇంద్రారెడ్డికి అంత రైపెన్ ఆట్మా స్ఫియర్ దొరకలె. రైపెన్ ముగ్గురు పెద్దమనుషులు దొరికిండ్రు గని రైపెన్ ఆట్మాస్ఫియర్ రాలె. వచ్చేవరకు, కొంత పికప్ అయ్యే వరకు, వార్తా పత్రికలో మొట్టమొదటిసారి వచ్చేవరకు కాస్త ఆయన అతిగా అంచనా వేసుకున్నడు, తగ్గిపోయిండు. ఇగ దాని తర్వాత ఒక దశలో జానారెడ్డి గూడ వుండె. తక్కువ పిరియడె. కనుక రాజకీయ నాయకుడు చెన్నారెడ్డిగాని, ఇంద్రారెడ్డిగాని, జానారెడ్డిగాని తర్వాత చంద్రశేఖర్ రావు గాని ఇండివిడ్యువల్ పొలిటికల్ ఎజెండా లేకుండా వస్తారనుకోవడం భ్రమ. వాల్ల ఎజెండా ఇష్యూతో కోఇన్సైడ్ గావలె.
         
     మాలాంటి వాల్లకు తోచింది ఏందంటె, ఈ ఎజెండా తో కొఇన్ సైడ్   అయి ఒక నాయకుడు వస్తున్నడు. ఇంత మందితో చూసిన మహానుభావులు, నాలాంటి లేక నాతరం వాల్లు, నాతీరుగ ఏందంటె... చెన్నారెడ్డికి, ఇంద్రారెడ్డికి... ఇంద్రారెడ్డితో కంపేర్ జేయలేం. చెన్నారెడ్డి మీద చంద్రశేఖరరావును పోల్చినప్పుడు... జానారెడ్డి, ఇంద్రారెడ్డి ఇట్ల వచ్చి ఇట్ల పోయిండ్రు గాని, ఐడెంటిఫై అయింది మాత్రం వాల్లే. ఇంద్రారెడ్డి పేరు చాలమందికి తెలవను గూడ దెలవదు. మనకు దెలుసు గాని చాలా మందికి దెలవదు.  
   


16, జులై 2013, మంగళవారం

ఏకైక నాయకుడు ఈనాటికీ

ప్రొ.జయశంకర్ వోడవని ముచ్చట నుండి

ఏకైక నాయకుడు ఈనాటికీ


        చెన్నారెడ్డికి, చంద్రశేఖరరావుకు ముఖ్యంగా(తేడా) ఎందంటే, ఇష్యూను సమగ్రంగ అర్ధం జేసుకోటంలో చెన్నారెడ్డి అంత శ్రద్ధ జూయించే వాడుగాదు. మాతో యెవ్వరు బెట్టుకుంటరయ్యా... ఇవన్ని. లొల్లి బెట్టాలి గని ఈ లెక్కలు ఎవడికి గవాలె...  అట్ల పెద్దగ వినేటోడు గాదు. అయిన గాని నేను జెప్పేది జెప్పేది. వుండె, అట్ల వుండె.. ఆయనకా స్టేచర్ వుండె. ఈయన అట్ల గాదు, విషయ పరిజ్ఞానం లేంది మాట్లాడొద్దు. క్రిటికల్ గ ఆలోచించాలె. నాతోని యాడాది గూసున్నడాయననేర్చుకోడానికి. టిడిపి లో వున్నపుడు యాడాది గూసున్నడు. ఎందుకు గూసోవాలే నా యెంబడి? గిట్ల... ఇట్నే గూసునేది. ప్రతిదానికి క్వశ్చన్, క్రాస్ క్వశ్చన్ జెస్తుండె.


రెండవది సమస్యను అర్ధం జేసుకొని ప్రజల నుడికారంతో, ప్రజల భాషతో, ప్రజల్లోకి ముందుకు దీసుకపోయినటువంటి... నా దృష్టిలో ఏకైక నాయకుడు ఈనాటికీ. నాన్ పొలిటికల్ దాంట్లో ఆ స్కిల్, ఏది?  ప్రజల భాషలో పోయి మాట్లాడె స్కిల్ నాకు ఒక్క కోదండరాంలో కనపడతది. నాలో లేదు ఆ స్కిల్. నేను ప్రజల భాషలో మాట్లాడలేను, మాట్లాడుత గాని ఆ నుడికారం రాదు. ఇపుడు నేర్చుకుంటె ఆర్టిఫిషియల్ అయితది. నా పద్ధతిలో నేను జెపుత. అంతేగాని నిజంగా ప్రజల నుడికారంలో పొగలిగిన రాజకీయ నాయకుల్లో ఏకైక నాయకుడు ఈనాటికీ చంద్రశేఖరరావు వొక్కడె. నాన్ పోలిటికల్ గ వచ్చేదాంట్లో కోదండరామే. ఆ విట్.. ఏందంటె ఆ యాక్సెంటె.. బాగున్నారే అన్న! అంటరు, బాగున్నవ సార్! అని నేనంట. తేడా కనబడుతది కదా. నేను కొత్తగ అది అంటె ఆర్టిఫిషియల్ అయితది.

14, జులై 2013, ఆదివారం

"నాదీ తెలంగాణే" కిరణ్ పెద్ద వంచన

"నాదీ తెలంగాణే" "తెలంగాణా ప్రజల మనోభావాలు తెలుసు " 



"ఆంధ్ర మంట" పత్రికలో వచ్చిన వార్తలో ఎంత అసంగతమైన విషయాలు ఉన్నాయి.



 అసలు "నాదీ తెలంగాణే" అనే మాట కిరణ్ కుమార్ రెడ్డి అని వుంటే అంతకంటె మోసం, వంచన ఉండదు.



          "మేడమ్... 2009లో కెసిఆర్ ఎందుకు నిరాహారదీక్ష చేసారు? హైదరాబాదులొ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన 14ఎఫ్ తొలిగించాలనె  డిమాండుతో నిరశన దీక్షకు దిగారు. కానీ... డిల్లీలో బయపడిపోయి ఏకంగా తెలంగాణా ఇస్తామంటూ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయగలిగింది అందువల్లే కదా!" అని కిరణ్ ప్రశ్నించాడట. 

         మరి ఆంధ్ర నాయకుల(రోశయ్య,బాబు,చిరంజీవి) నాయకత్వంలోని పార్టీలు 7డిశంబరు ,2009న  అఖిల పక్షం సమావేశంలో  తెలంగాణా బిల్లు పెట్టమని ఎందుకు తీర్మానించినట్లు? కిరణ్ అప్పుడు ఏమి చేసినట్లు? తెలివిలేదనుకుందామా? ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం మోసం కాదా? కెసిఅర్ దీక్ష తర్వాత తెలంగాణ లో తెలంగాణ ఆకాంక్ష బయటికి వచ్చింది నిజం కాదా? ఇప్పుడు సమైక్య నినాదం తో తెలంగాణాలో ఒక్క పార్లమెంట్ సీటుపోటీచేసి   చూడమను "తెలంగాణా ప్రజల మనోభావాలు" తెలుస్తాయి. 

        "వైఎస్ మరణం తర్వాత తలెత్తిన పరిస్తితులవల్లె ఈ పరిణామాలన్నీ జరిగాయి. లేని పక్షంలో టీఅర్ఎస్ ఉనికే ప్రశ్నార్ధకంగా మారెది.ఇప్పుదు కూడా కేవలం నాలుగు జిల్లాల్లోనే టీఆర్ఎస్ ఉనికి బలంగా ఉంది."


          వైఎస్ మరణం తర్వాత చాల పరిణామాలు జరిగినాయి. మంచి పరిణామాలు జరిగినాయి. అవి ఆయన అవినీతి బయటికి వచ్చింది. కొడుకు జైలుకు పొయిండు . మంచి పరిణామమా?కాదా? అదేవిదంగా తెలంగాణా ఆకాంక్ష బయటకు వచ్చింది. బలపడింది. ఇది కూడా మంచి పరిణామమా? కాదా?  వైఎస్ బ్రతికున్నప్పుడు తెలంగాణ ఆకాంక్షను మోసంతో, బెదిరించి, అవినీతి డబ్బు ఆశ చూపి అనగదొక్కినది నిజంకాదా?


     "నదిపరివాహక ప్రాంతాలు, తెలంగాణాలో ఎత్తిపోతల ప్రాజెక్టులు, వాటికి అవసరమయ్యే విద్యుత్తు, నీటిసమస్యలు, సంఘర్షణలు తలెత్తే అవకాశాలు, కృష్ణా డెల్టాలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మొదలైన అనేక విషయాల గురించి ఆయన(కిరణ్)గణాంకాలు, మ్యాప్లతో వివరించారు. ........."  విడిపోతే వచ్చే సమస్యలు ఏకరువు పెట్టాడట. 

        ఇవి ఇప్పుడున్న సమస్యలె తెలంగాణకు. వీటి పరిష్కారం కొరకె విడిపోవడం.  దీనిని అటుదిటు తిప్పి చెప్పడం మోసం కాదా? తెలంగాణ  నీళ్ళు దొసుకెల్లుతున్నరు,తెలంగాణ ఎత్తిపోతల ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నరు.  ఎత్తిపోతల ప్రాజెక్టులకుఅవసరమయ్యే విద్యుత్తు గురించి ఆలోచన లేదు. సమస్యలు తెలంగాణకు మిగిల్చి, అన్ని ఆంధ్రకుదోసిపెట్టడానికే  విడిపోవద్దు అంటున్నరు.    



8, జులై 2013, సోమవారం

తెలంగాణ పార్టీ పై వచ్చే విమర్శలు – ఒక వివరణ



        ప్రొ.జయశంకర్ గారి “వొడవని ముచ్చట” నుండి  

కాంటెంపరరీ పాలిటిక్స్ లో అట్ల లేకుంట బతకలేడు

             ఇపుడు మీరన్నరు అందరు..... తాగుతడు అని. అందరికి అలవాట్లు ఉంటయ్. ఈయన మీదనె ఎందుకు వచ్చింది? అలవాట్లు అందరికి వుంటయ్ గద! అది చెప్తి గద. పోలిటికల్ గ క్రిటిసైజ్ జేయడానికి ఏదోక ఆయుధం గావలె. ఈయన ఓపెన్ గ తాగుతడు గనక ఆయుధం అయ్యింది. మిగతా వాళ్లందరు తక్కువ తాగుతారయ్య! నేను జూసిన చాలా మంది తాగి తందానలాడి స్పృహతప్పి పడిపోయినవాల్లు. నైట్ల ఇంట్ల వుంటరు. బయటకిరారు. అలాంటి వాల్లుంటరు. ఈయన అట్ల గాదు డ్రాయింగ్ రూంల కూర్చొని…. అడిగిన నేను, సార్! ఇండ్ల రహస్యం యేమున్నది, గుస గుస ఏముంది. తప్పైతె తప్పే, ఒప్పైతె ఒప్పే. వొకడు గెస్ట్ వచ్చిండు ఆఫర్ జేస్తం. వాళ్ళు ఇగ ఎట్ల వుంటదంటె, ఈ వచ్చే మనుషులకు, సరకు జెప్తున్న నేను!  కొంతమందికి, కేసీఆర్ దగ్గర కూర్చొని తాగిన అని చెప్పుకోవాలె బయట! అయితే ఏం జేస్తరు? ఆ గ్లాస్ పట్టుకొని బయటికి బోయి మల్లోస్తరు, చెప్తున్న. ఇవి అబ్జర్వ్ జేసి చెప్తున్న. వీడు తాగేతోడు బయటికి ఎందుకు బోవాల్నయ్య? లోపలికి రమ్మంటి, వస్తివి, గ్లాసిచ్చే, అది బట్టుకొని బయటికి బోయి... బయట వున్నోల్లందరికి దెలవాలె, కేసీఆర్ తో కూచోని తాగుతున్నా అని. జెప్తున్న... రాంగ్ సిగ్నల్స్ అట్ల బోతయ్. కొన్ని సంఘటనల తర్వాత బంద్ జేసిండు. అది వేరు విషయం.
         క్యారెక్టర్స్, ఇపుడు ఒకటేందంటె దీన్ని కేవలం పొలిటికల్ యాక్టివిటీగ జూసే వాల్లకు ఇంపార్టెంట్ గాదు. అది పొలిటికల్ యాక్టివిటీ అయితది. అన్ని పర్వర్షన్స్ వస్తయ్. ఉద్యమం మాత్రమె అనుకొనేవాల్లతోని నిలిచింది ఇది. ఉద్యమం మాత్రమే అనుకొనే వాల్లు చాల మంది వున్నరు. కొందరి పేర్లు బయటికి రావొచ్చు, రాకపోవచ్చు. ఎంత మంది విద్యావంతులు, ఎంతమంది స్కాలర్స్ ఎంతమంది పనిజేయలేదు! సైలెంటుగ జేసిండ్రు. నాకు ప్రాచుర్యం వచ్చింది అది వేరు విషయం. పనిజేసిన వాల్లున్నరు. పొలిటికల్ గ వచ్చేవానికి వాని పొలిటికల్ ఎజెండానె వుంటది. వాని ఉద్యమాన్నె వాని పొలిటికల్ ఎజెండాగా వాడుకోవాలి.
          ఒకటేందంటె స్టడీ, బేసిక్ స్టడీ. రెండవది తత్వం! ఆయనది అగ్రెసివ్ నేచర్. తత్వం అగ్రెసివ్. ఇపుడు ఆయన మాలాంటి వాల్లతో ఎంత నమ్రతతో మాట్లాడుతాడో, పొలిటికల్ గ అంత అగ్రెసివ్ గ వుంటడాయన. అది విశేషం. ఒక మనిషిలో రెండు యాస్పెక్ట్స్ జూసీన్నేను. మేం కూర్చొని మాట్లాడితె చాలా నమ్రతతో అట్లగాదు సార్, ఇట్ల గాదు దీన్ని విభేదిస్తే ఎట్ల? ఇట్ల ఎందుకు గాదు సార్? అంటడు. వేరే వాళ్ళు విభేదిస్తే యాయ్ నీకేం తెలుసు ఊకో అంటడు, చెప్తున్న, రెండూ జూస్త నేను. ఎదుటి వాన్ని బట్టి వుంటది ఆయన ప్రవర్తన. అది మంచా, చెడా అనే తత్వం ఆయనది. పొలిటికల్ గ వెరీ అగ్రెసివ్ మ్యాన్. అట్ల లేకుంటె బతకలేడు. నోటిగదర్తొ బతికిండు గదయ్య. మంచిదా, చెడ్డదా అది వేరు విషయం. బతికిండు గద. మరి మేం ఆ పని జేయ లేదు. అందుకనే పొలిటికల్ గ పనికిరాం మేం!
          వేరేవాల్లని యెదగనీయడు అంటె, అది మరి ఈ ప్రశ్న వాల్లనే అడగాలి. నేను అదే అడిగిన. ఐతె మీరు జేయండి, లేకపోతె కలవండి, లేకుంటె ఊరుకోండి. ఈ దాగుడు మూతలు ఎందుకు? ఎందుకు అంటె నిజంగ ఈ ఎత్తున వాల్లకు జేయ శాతకాదు, రెండోడు, ఇంకోడు జేసి వాడు పైకి బోవద్దు. వాల్ల పేరు జెప్పి మేం పైకి రావాలె. వాళ్ళిచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొ మేం పైకి రావాలె! లోపం అక్కడున్నది. మీటింగ్ పెడితె మందిని పంపాలె, పైసలియ్యాలె, జన సమీకరణ జెయ్యాలె, తిట్లు దినాలే వీళ్ళతోని. ఐతె కలసి జేయండి, లేకపోతె దూరం వుండండి. మిమ్మల్ని జెయ్యంగ ఆపుతారయ్య ఎవరన్న? వద్దంటరా?
           ఉద్యమంలోకి వస్తున్న వాన్ని ఎట్లాపుతామయ్య?ఎట్ల క్వశ్చన్ జేస్తవ్? ఎవడెంది ఎట్ల దెలుస్తది! ఈయన బాగనే జేసిండు, ఈయనగూడ మంచిగనే జేసిండు. అయ్యేవరకు యాంబిషన్ బెరిగింది. యాంబిషన్ పెరిగేసరికి ఇవన్ని సమస్యలు... మామూలు విషయమానయ్య?
          ఒకటేందంటె యాంబిషన్, అనుకున్న దాని కంటె ఎక్కువ పైకి పోవాలె, ఆయన కొడుకు మినిస్టర్ అయ్యిండు, నేను ఎందుకు గావొద్దు, అల్లుడు మినిస్టర్ అయ్యిండు, నేనెందుకు గావోద్దు, చెప్తున. పర్సనల్ కోరికలు, పొలిటికల్ ఎజెండా. మరి ఎల్లిపోయి చేయగలిగింది ఏమన్న ఉందా అంటె, ఏమి లేదు. ఊరికే తిట్టడం, విమర్శించడం నడుస్తనె వుంటది అది.
        ఒకటేమైందంటె ఇనీషియల్ గ, తెలంగాణకు తెలంగాణ భూస్వామ్య వర్గాలు అడ్డం వచ్చినయ్. ఫస్ట్ స్టేజిలో చెన్నారెడ్డి పిరియడ్ అప్పుడు. వాల్లకె ఇష్టం లేకుండె. టోటల్ గ భూస్వామ్య వర్గాలె. అపుడేమయిందంటె పవర్ ఫుల్ కాంబినేషన్. తెలంగాణ, రాయలసీమ భూస్వామ్య వర్గాలేవైతె వున్నయో, ఆ కులం అయితె చాల పవర్ఫుల్ కాంబినేషన్ అయింది. సంజీవరెడ్డి తెలంగాణ వాల్లని బుట్టలో ఏసుకున్నడు. వీల్లకి ఏమైందంటె వీల్ల ఇంట్రస్ట్ లు కాపాడుకోవాలె. పి.వి.నరసింహారావు పెట్టినటువంటి భూసంస్కరణల చక్కర్లకెల్లి బయటపడాల్నంటె, వాల్ల సపోర్ట్ అవసరం. కనుక ఇక్కడ భూస్వామ్య వర్గాలన్నింటికి ఆ రాయలసీమ పాట్రన్ దొరికింది. అదొకటి. నా అంచనాలో భూస్వామ్య వర్గాలె పెద్ద ప్రతిబంధకం అపుడు వుండె. తర్వాత ఏం జరిగింది ముఖ్యంగ ఎన్.టి.ఆర్. వచ్చిన తర్వాత ఈ కమ్మ బిజినెస్ ఇంట్రెస్ట్ ఇక్కడ పెరిగినపుడు, తెలంగాణ సెకండ్ రేట్ లీడర్స్ అందరినీ వాల్ల బుట్టలో ఏసుకున్నడు. ఈ రియల్ ఎస్టేట్ పేరుతో, ఫిలిం ఇండస్త్రి పేరుతో, వ్యాపారాల పేరుతో తెలంగాణలొ వున్నటువంటి ఆ రెడ్డి వర్గాన్ని గాదని ఈ ఎస్.సి., బి.సి.లను కొంత మందిని బెట్టుకొని సెకండ్ రేట్ వాల్లను బుట్టలో ఏసుకొనే వరకు, ఆ బిజినెస్ ఇంట్రస్ట్ బెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదారాబాద్ లొ ఈ మంత్రులందరు అదే గద. అదే ప్రతిబంధకం.
          మూడవ దశ వచ్చే వరకు ఏందంటె ఈ కులాల ప్రస్తావన చాల వచ్చింది. అగ్రవర్ణాలతో ఒకసారి, బలహీన వర్గాలతో మరొకసారి ఒక్కొక్క దశలో ఒక్కొక్క ప్రతిబంధకమైంది. కని ఈ రోజు ఏమైంది అంటె సమగ్రత వచ్చింది. భూస్వామ్య వర్గాలలో కూడా తెలంగాణ గావలంటున్నరు, బిజినెస్ వర్గాల వారు గావలంటున్నరు. సామాజికంగా ఎన్ని చీలికలు వున్నా గావలంటున్నరు. పెద్ద ప్రాసెస్ ఇది. ఈ రోజు సమగ్రత వచ్చింది. కనుకనే ప్రజల్లోకి బోయింది. దీనికి పెద్ద కొలమానం మొన్న బై ఎలక్షన్స్. తెరాస కొరకు ఏసినారయ్య ఓట్లు? మన తెలంగాణ కొరకేసిండ్రు వాల్లు.    

30, జూన్ 2013, ఆదివారం

“తెలంగాణ సాధన సభ” - ఇదీ నాటకమే - గత చరిత్ర చూస్తే – మచ్చుకు ఒక సంఘటన

“తెలంగాణ సాధన సభ” - ఇదీ నాటకమే -  గత చరిత్ర చూస్తే

 – మచ్చుకు ఒక సంఘటన

ఇది   2004 లో అధికారం కొరకు 2000 లో తెర లేపిన మొదటి నాటకం
జయశంకర్ “వోడవని ముచ్చట” నుండి 

ఇదేం గుసగుస గాదు

         ఇగ రాయడం, చేయడం, ఉపన్యాసాలివ్వడం. ఏం జరిగిందంటే... అప్పుడు 1998 వచ్చింది. 98లో ఏం జరిగిందంటే అదిలాబాద్ లో కలరా ఇన్సిడెంట్. చాంద్రబాబునాయుడి కాలం. ట్రైబల్స్ కలరా ట్రీట్మెంట్ లేక చనిపోవడం. మేమంతా వరంగల్ నుండి ఫ్యాక్ట్ ఫైండింగ్ గ్రూప్ బోయి స్టడీ జేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్నీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో రిపోర్ట్ అయినయ్.

          యుకె, యూఎస్ఎ లో అపుడు ఏం జరిగింది? నేను నా పర్సనల్ పని మీద అమెరికా పోయివుంటి. పోతే కొంత మంది స్టూడెంట్స్, ఫ్రెండ్స్ వాల్లంతా సార్ మీరు వస్తున్నరు గదా! ఏంది ఈ కలరా సంగతి ఏంది? మీరు రిపోర్ట్ రాసిండ్రు గదా? పేపర్లో వచ్చింది. మాకు జెప్పాలె సార్ అన్నరు. నేను న్యూయార్క్ లో దిగంగనె వొక మీటింగ్ బెట్టిండ్రు. ఆ రోజు కేవలం కలరా గురించి జెప్పిన, దాంట్లో అప్పుడేంది... అంతకు ముందు చంద్రబాబు నాయుడు అది విజన్ 20-20 ఇదెంత పెద్ద స్వర్గతుల్యమైందో జెపుతు ఆయన అట్ల అంటడు, ఇట్ల అంటడు మొత్తం ఆయన ఏం జేస్తున్నడు, ఏం జరుగుతుందో జెప్పిన. తర్వాత... అయితే ఆ రోజు ప్రధానంగ జెప్పింది నేను కలరా గురించే, గాని తెలంగాణ ఇష్యూ వచ్చింది. అయ్యేటప్పటికి చాలా మంది ఇంత ఘోరంగ వుందా సార్, ఇట్ల కాదు మల్లోకసారి చాలమందిని పిలుస్తం అంటె, నేను రెణ్ణెల్లు బోయింటిని.

            జనవరి 1999 లో న్యూయార్క్ లో మీటింగ్ బెట్టి చుట్టుపక్కల రాష్ట్రాల్లో వున్నటువంటి చాలా మంది తెలంగాణవాళ్లను పిలిపిచ్చి ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఒక రోజంతా నాతోని మాట్లాడించిండ్రు. ఒక రోజు మొత్తం తెలంగాణ గురించి క్వశ్చన్స్, ఆన్సర్స్. వాల్ల ఇంట్రస్ట్. మరి మేం ఏం జేయాలె సార్,  ఏంది  అంటె... ఏముంటది మీరు ఇంట్రస్ట్ జూయించాల అని జెప్పిన.

              అప్పుడు వాల్లు తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం అని ఒక సంస్థను స్థాపించిండ్రు. అమెరికాలో అది బాగా స్ప్రెడ్ అయ్యింది డీటీఎఫ్. అది ఇక్కడ బాగా ప్రచారం వొచ్చింది. ఇండియాలో కూడా బాగా ప్రచారం వొచ్చింది. అయిన తర్వాత ఎందంటె... ఇట్లగాదు సార్! మీరు మొత్తం అమెరికాలో చాలా స్టేట్స్ లో తిరగండి అన్నరు. 2000లో నన్ను బిలిపించుకొని పది సిటీస్ లో లెక్చర్ టూర్ మొదలు పెట్టింఛిండ్రు నాతోటి, నాతోపాటు జనార్ధనరావు వచ్చిండు అపుడు. తెలుసుగద జనార్ధనరావు? టెన్ సిటీస్ లో రెణ్ణెల్లు విస్తృతమైనటువంటి ప్రచారం వచ్చింది.

              అప్పుడేం జరిగింది? అదే సమయంలో ఏం జరిగిందంటె... తెలంగాణ కాంగ్రెస్ వాల్లందరు 41 మంది ఎమ్మేల్యేలు సోనియాగాంధికో  రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఆమేదో ఒక కమిటీ వేసింది. అదే ప్రణబ్ ముఖర్జీ కమిటీ. ఎవరన్నా వచ్చి మీరు మీ వాదన వినిపించండి అని జెప్పిండ్రు. ఆ కమిటీలో మన్మోహన్ సింగ్ గూడ వుండె అపుడు. మన్మోహన్ సింగ్ కు నాకు పాత పరిచయం ఒకటుంది. అది వేరు విషయం. మరి ఎవరన్న వచ్చి వినిపించాలి అంటె అపుడు రాజశేఖరరెడ్డి అనుమతితోనే బోయిండ్రు గదా వీల్లు! ఎవరు వినిపించాలె, ఎవరు వినిపించాలె అని తర్జనభర్జన జేసుకొని, జయశంకర్ అయితే మంచిగుంటది అని నాదగ్గరికి పొన్నాల లక్ష్మయ్యను పంపిడ్రు... ఇంటికి, వరంగల్ కు. పరిచయమే బాగా. మరి నేనేం కాంగ్రెసోన్ని గాదు, ఎమ్మెల్యేను గాదు, నేనెట్ల జెప్పాల్నయ్యా అంటె, లేదుసార్ మీరైతె బాగా జెప్తరు అన్నడు. మంచిది తెలంగాణ గురించి నీ మాటగ నా నోట జెప్పిస్తే తప్పకుండ వస్త అన్న.

              17 అక్టోబరు 2000 రోజున డిల్లీ, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందు నేను రెండున్నర గంటల సేపు వాదించిన ఆఫీషియల్ గ, ఇదేంటి... ఇదేం గుసగుసగాదు. తెలంగాణ నుండి రెండువందల మంది సీనియర్ లీడర్స్, ఎంపీలు, ఎమ్మేల్యేలు, కాబోయే వాల్లు, అయిన వాల్లు, ఆల్ సీనియర్స్! టూ అండ్ హాఫ్ అవర్స్ వాదించిన. గివె... ఇవే సమస్యలు.