తెలంగాణ ఆత్మగౌరవం పై దాడిని త్రిప్పి కొడదాం - అందరం ఒక్కటైదం 1
తెలంగాణ ఆత్మగౌరవం పై దాడి తారా స్థాయిలో ఉంది. దానిలో ప్రధాన పాత్ర ఆంధ్ర ప్రింట్ మీడియా, ఎలెక్ట్రానిక్ మీడియా
తెలంగాణ మనిషి నాయకత్వంలో ఉన్న ఒక రాజకీయ పార్టీని ముట్టడించిండ్రు.తగలపెట్టడానికి
తెగబడ్డారు. “వసూళ్ల పార్టీ” అని తెలంగాణని మోసం చేస్తున్నారు.
మోసం వాళ్ళది. ఆర్ధిక ఉన్మాధులు వారు. మానవ విలవలు లేని సంస్కృతికి
ప్రతినిధులు వారు. వసూళ్లు దాటి దోపిడీకి తెగపడ్డది వాళ్ళు. సూట్-కేస్ల సంస్కృతి వారిది.
అన్ని పార్టీలు నడిచినట్లే తెలంగాణా పార్టి నడుస్తున్నది .తెలంగాణా పార్టీని “వసూళ్ల పార్టీ”అంటే తెలంగాన సమాజాన్నిఅవమానించినట్టే. ఆ మాట
అన్న సీమాంధ్ర పీడకుల వెంట ఉన్నవాళ్ళు ముమ్మాటికి తెలంగాణ ద్రోహులే.
సీమాంధ్ర ఆదిపత్య వర్గాల వాలకం ఆంధ్రోడు చేస్తే గొప్ప , తెలంగాణోడు చేస్తే తప్పు అన్నట్లు ఉన్నది. చక్రవర్తి చేస్తే శృంగారం, సామాన్యుడు చేస్తే వ్యభిచారం అన్నట్లు అహంకారతో , మోసపూరితంగా కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నరు.
సీమాంధ్ర ఆదిపత్య వర్గాల వాలకం ఆంధ్రోడు చేస్తే గొప్ప , తెలంగాణోడు చేస్తే తప్పు అన్నట్లు ఉన్నది. చక్రవర్తి చేస్తే శృంగారం, సామాన్యుడు చేస్తే వ్యభిచారం అన్నట్లు అహంకారతో , మోసపూరితంగా కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నరు.
తెలంగాణ నాయకత్వం పై జరుగుతున్నవిషప్రచారాన్ని తిప్పికొదడం.
విశాల దృక్పతంతో ముందుకు పోదాం.తెలంగాణ మొత్తం ఒక్కటైదం.
ప్రొ.కె.జయశంకర్గారి మాటలు “వోడవని ముచ్చట్లు” నుండి
స్వభావరీత్యా చాలా లిబరల్ మనిషి
ఉదారంగ
హెల్ప్ జేస్తడు, హెల్పింగ్ నేచర్. ఇపుడు
పోలిటికల్ పార్టీకి ఫండ్ రెయిజింగ్, అందులో
వింతేముంది? ఎవడైన జేయాల్సి వస్తది.
కని ఖర్చు బెడతడు. పోలిటికల్గ రెయిజ్ జేసి పొలిటికల్గనే ఖర్చుబెడతడు ఆయన. ఫండ్ కలెక్షన్
లేకుండ ఇపుడు ఎట్ల నడుస్తదయ్యా పార్టీ? పార్టీలో
మల్ల గదే సరుకు గదనయ్యా. కింది నుంచి పైకి పోయి వచ్చేవరకు మధ్యలో పోతనే వుంటది. టిఆర్ఎస్
ది పోలిటికల్ సంస్కృతి, అది
ఏం జేయలేం. డోనర్ దగ్గర నుంచి నాకొచ్చే
వరకు మధ్యలో కొంత పోతది, నాదగ్గరి
నుంచి కిందికి బోయే వరకు మల్ల మధ్యలో పోతది, దాన్ని
ఏం జేయలేం అంటడు ఆయన. సిస్టమ్
అది.
స్వభావరీత్యా చాలా లిబరల్ మనిషి. చాలా లిబరల్ మనిషి ఆయన! ఆ విషయమనే
గాదు, మందికి హెల్ప్ జేస్తుంటడు గదా ఆశ్చర్యమేస్తది.
ఒకసారి ఒక పిల్లవానికి ఏదో మెడికల్ కేస్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమరో ఏదో. పన్నెండు
లక్షల ఖర్చు. ఆరోగ్యశ్రీ కింద లక్షే ఇస్తరు.వాల్లు ఏడ్చుకుంట వచ్చిండ్రు. ఐదు నిమిషాలు
ఆగిండు. నేను ఏర్పాటు జేస్త అన్నడు. ఆయనకు తెలిసిన పది మందికి ఫోన్లు జేసిండు, పన్నెండు లక్షలు వచ్చినయ్! చెప్తున్న, నేను విట్నెస్. చివరకు పిల్లవాడు బతకలేదు, అది వేరు విషయం. ఒక్కరోజులో పన్నెండు లక్షలు
కలెక్ట్ జేసి ఇచ్చిండు అంటే బీద పిల్లవానికి. స్వభావం. వ్యక్తిగతంగ సంపన్నుడు, ఆయనకి పెద్ద అవసరం లేనివి. కని పోలిటికల్గ అది
సహజం. ఇపుడు ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపించడం అంటే ఎన్ని సోర్సెస్ నుంచి రావల్నయ్యా
డబ్బు? ఎక్కడెక్కడి నుంచి రావాలె?
వాడు అయ్యను అడ్డం పెట్టుకొని బాగ సంపాదించే, ఇప్పుడున్నోడు కూడా వసూళ్లు చెస్తున్నాడు. డిల్లి కి పంపుతున్నాడు. మనం వెనకబడుతున్నాం. అయినప్పటికి ముందుకు పోవాలి, తెలంగాణాను ఆపాలి
ముందుంది మంచి కాలం.నావెంటఉంటె సూట్-కేస్ల కొదవలేదు. డిల్లీకి పంపిస్తున్న. తెలంగాణాదొంగలకు ఇస్తున్న. గగన్ బాబుకు ఇస్తున్న. మీకిస్త. సుందిరమ్మ రాజ్యం అయిన మనదే. గజన్న రాజ్యం అయిన మనదే. తెలంగాణాను తొక్కుడే నాధ్యేయం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి