యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

15, ఆగస్టు 2013, గురువారం

అసహజ కలయిక - పరిమాణాత్మక పరిణామం

             సీమాంధ్ర, తెలంగాణలను కలపడం ఒక అసహజమైన ప్రక్రియ అని నిరూపణ జరిగింది. చరిత్రపరంగా, సంస్కృతిపరంగా, ఆర్ధికపరంగా  తేడాలున్న ప్రాంతాలను కొంతమంది విజ్ఞత లేని వ్యక్తుల ప్రోత్బలంతో ఈ రొండు ప్రాంతాలను కలపడం జరిగినది. ఇది ఒక అసహజ ఐక్యత. దీని పర్యవసానాలు కూడా అసహజంగా ఉన్నాయి.

           రెండు ప్రాంతాల ప్రజల మద్య సంబంధాలు చాలా బలహీనంగా ఉన్నాయి. 56 ఏండ్ల తర్వాత కూడా ఇది తెలంగాణ కుటుంబం, ఇది ఆంధ్ర కుటుంబం అని తేట తెల్లంగా చెప్పే స్థితి ఉంది. ఇక్కడి రాజకీయ పార్టీలలో  ఏకాబిప్రాయం సాధ్యం కావడం లేదు. ప్రత్యేక తెలంగాణ కావాలని సెంప్టెంబర్, 2011 లో 10 జిల్లాల ప్రజలు సకలజనుల సమ్మె చేసిండ్రు. మిగతా 13 జిల్లాలనుంచి ఎలాంటి స్పందనలేదు. ఇప్పుడు ఆగస్ట్-2013 లో సమైఖ్యాంధ్ర అని 13జిల్లాలో సమ్మె చేస్తున్నరు. మిగతా 10 జిల్లాలో వ్యతిరేకత ఉన్నది. ఈ విధమైన తేడా నల్ల, తెల్ల జాతిల మధ్య కూడా లేదేమో అనిపిస్తది. ఇంతగా సయోధ్య సాధ్యం కాని ప్రాంతాలను కలిపిఉంచడం అశాంతికి కారణమైతది. ఇది ఒక అసహజ కలయిక.


         ఇక తెలంగాణలో ఆంధ్ర ఆదిపత్య వర్గాల దోపిడి గురించి ఎంత చెప్పిన తక్కువె. “నీళ్ళు, నిధులు, నియామకాలు” గురించి చాలా చర్చ జరిగింది. అంచనాకు అందని అన్యాయం జరిగింది. దోపిడి అనేది చాలా మోసపూరితంగా జరిగినది. ఆ మూడు కాక ఇతర వనరులు “భూములు, గనులు, అడవులు, మార్కెట్లు, ..... ఇలా చెప్పుకుంట పోతే అంతు ఉండదు. కానీ పరాకాష్ట ఎందంటే ఓట్లు దోసుకున్నరు మోసపూరితంగ. 1999 లో వైఎస్ తెలంగాణ గురించి 42 మంది ఎమ్మెల్యేలను సోనియా దగ్గరకు పంపింది కేవలం 2004లో  తెలంగాణ ఓట్ల దోపిడి కొరకే. 2008లో బాబు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేయించడం 2009లో తెలంగాణ ఓట్ల దోపిడి కొరకే. ఈ ఆంధ్ర ఆదిపత్య వర్గాల దోపిడి ఎంత పరిమాణాత్మకంగా పరిణామం చెందిందంటె అది గుణాత్మకమైన మార్పుకు దారి తీసింది. అదే తెలంగాణ ఏర్పాటుకు దారి తీసింది. దీనినే గతితార్కిక సూత్రం అంటరు.

  

26 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

thisis typical telaban attitude. pakka vaadi meeda padi edavadam. entha sepu abhaddaalu, vishaparacharam, vidweshapooritham. pakka vaadi meeda padi edvadam. evadu kashtapadi develop yithe daanni dochukovadm anadam. gudumba,gochi, dappu gaalla attitutde.

sreerama

voleti చెప్పారు...

బోడి గుండు కి మోకాలికి ముడిపెట్టినట్టు ఇప్పటి హైదరాబాద్ కి అప్పటి మద్రాసు కి ఎలా ముడిపెడుతున్నారో అర్ధం కావట్లేదు... ఇన్నాళ్ళు అందరి కష్టంతో రాజధాని అభివృధ్ధి చేసి, ఇప్పుడు పొమ్మంటే ఎలా.. నీళ్ళు, వుద్యోగాలు, పేదరికం సమస్యలు అన్ని ప్రాంతాల్లోనూ వున్నాయి.. తెలంగాణా సొమ్ము తినేసి హాయిగా ఆంధ్రా వాళ్ళు కూర్చోట్లేదు.. అందరీ డబ్బు దొబ్బేసి ఇప్పుడు తెలంగాణా "నాయకులు" కులుకుదామని చూస్తున్నారు అందుకే ఇన్ని ప్రాణత్యాగాలు, ఆగ్రహ జ్వాలలు.. అయినా నిజాం కాలం నుండి అన్ని ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ లో వున్నప్పుడు హైదరాబాద్ ఒక్క తెలంగాణా వాళ్ళదే ఎలా అవుతుంది..

అజ్ఞాత చెప్పారు...

Andhrulu Hyd develop Cheshaaraa??????? meeru raakamundu Hyd India lone No.1 - meeru adugupettaaka down position. Inka meeru vadilipettagaane Down lo unna Madaraasu Top lo poyindi. adi Andhra valla LEG MAHIMA. madars ki hyd ki link lekapovatamemi? akkada aadina dramane ikkada repeat chestunnaru kadaa? ikkada unnavaadidi meedi kaadu anatledu - ikkada unna andaride - ikkada unna andaroo telangana valla kinde lekka. alaa kaaka ikkada undi memu seemandrulamu annavaarike ikkada chotu vundadu - telanganalo unnapudu nuvu telangana vadivi ayipoyavu ani vappuko - apude neeku hyd meeda hakku labhinchedi.

hariSbabu చెప్పారు...

మీ తెలంగాణలొ ఓట్లు దోసుకునేటందుకు యెన్నికల్ల నిలబడింది అంద్రోళ్ళు గాదు గద భాయ్.యేమి సోంచాయించకుండనే బొమ్మలు బాగున్నయ్యని ముద్దర్ల లెక్కన గుద్దేసిన నువ్వు అంద్రోళ్ళ మీద బడి యేడుస్తవేమి? మొగుణ్ణి గొట్టి మొగసాల కెక్కిన మగనాలి మాదిరి ఉంటివే మల్ల!

hariSbabu చెప్పారు...

తెలంగాణల అధిపత్య వర్గాలు యాద కెల్లి వొచ్చినయ్యి. మీ బూమ్మీద పుట్టినోళ్ళే గాద ఆళ్ళు గూద? అయ్యారే గది గూడ గతితార్కిక సూత్రమే గదన్న!

voleti చెప్పారు...


Mr. ajnata ..
you go to America and announce that "I am an American and not an Indian.." Then see what will happen.. Mr.Obama kicked you out.

hariSbabu చెప్పారు...

రేపు రాష్త్ర మేర్పడినంక అమ్రిక వోడు వొస్తే వాని తో గూద గిట్లనే యాస తో మట్టాడ్తవా? నే గిట్లనే మట్తడ్త, నా బాస మాట్టాదకుంతె గుమ్మం లోకి రానియ్యంటవా? లేదే, వాని తోని బుడ్లు యెత్తుడు ఇంగ్లీషులనైన మట్టాడుడు సమ్మగుంటది.సాటి తెలుగోనితో వానికి సంజయ్యె తీర్న వాగనీకి నాలిక మడత బడ్తది. సాటి తెలుగోన్ని బూతులు దిడతవ్, మీ అమ్మమ్మల్ని, నానమ్మల్ని మూకుమ్మడిగ చెరిపించిన నిజాముని మంచోడని పొగుడుతవ్ - గిదేనా తెలంగాణ తెలివి?

సమతలం చెప్పారు...

hariSbabu
vishayam matladu. samaikhyavadulam antu paichachikanga matladuannaru. vekiliga matladam manchidi kadu. mee andhravalla meeda mamooluga matladukone neechamaina matalu maku telusu. kani neelaga nenu matladanu.

hariSbabu చెప్పారు...

మీ దగ్గరి నుంచి ఓట్లు దోసుకున్నదెవరు?యెన్నికలు తేంగానాలో ప్రత్యేకంగా యేమీ జరిగీనయ్యా?మీ ప్రాంతం లోని వారే అబ్యర్ధులుగా నిలబడితే మీరు ఓట్లు వేస్తేనే గద వాళ్ళుగెలిచేది. అవునా కాదా?

hariSbabu చెప్పారు...

మీ ప్రాంతం లో వ్యాపారాలు చేసినా ఉద్యొగాలు చేసినా ఆంధ్రోళ్ళు రాజ్యాంగ పరిధి లోనే చేశారా, లేక పోలీసు బలగాల్ని మొహరించి మీ మెడ మీద కత్తి పట్టి చేశారా?

hariSbabu చెప్పారు...

విషయం మాట్లాడు అన్న పెద్దమనిషి పై రెండు ప్రశ్నలకీ జవాబు చెప్పాలి.

hariSbabu చెప్పారు...

విషయం మాట్లాడు అన్న పెద్దమనిషి పై రెండు ప్రశ్నలకీ జవాబు చెప్పాలి.

hariSbabu చెప్పారు...

ఒక రకమైన వ్యూహంతో కొంచెం మిమ్మల్ని వెక్కిరించగానే ఆవేశపడి పోయి వెంటనే జవాబిచ్చిన మనిషి విషయానికే వొచ్చి అడుగుతున్న ఈ రెండు చిన్న ప్రశ్నలకి జవాబివ్వడానికి ఇంత సమయం యెందుకు తీసుకుంటున్నారో?పులుముడు సిద్ధాంతాల కోసం రీసెర్చ్ చేస్తున్నారా?నాలాగా మాట్లాడనక్కర లేదు, మీ లాగే మాట్లాడండి కాని సూటిగా చెప్పు సుత్తి లేకుండా అన్నట్టు మాట్టాడితే బాగుంటుంది కదా!

యన్.సీతారాంరెడ్డి చెప్పారు...

రాజ్యాంగ పరిధిలోనే ఉద్యోగాల్లో అసమానతలు ఉన్నాయనే ఆరు సూత్రాల రాష్ట్రపతి ఉత్తర్వులు పెట్టారు. పెద్ద మనుషుల ఒప్పందం పెట్టారు. ఇవ్వన్నీ ఉన్నా తెలంగాణాకు న్యాయం జరగడం లేదనే లెక్కలు కూడా ఉన్నాయిగా బ్రదర్.

యన్.సీతారాంరెడ్డి చెప్పారు...

బ్రిటీషువాడు కూడా ఒక రాజ్యాంగాన్ని రాసుకొని దాని ప్రకారమే పాలించాడు. రూల్స్ అనేవి గణిత శాస్త్రం లాగా స్పష్టంగా నిర్దిష్టంగా ఉండవు. అన్వయించుకొని వాడుకొని దూరిపోయే వాడికి సరిపోను రంధ్రాలు కూడా ఉన్నాయి. దానిలో ఒకటి నాలుగేళ్ళ చదువుతో స్థానికులై పోవడం.

hariSbabu చెప్పారు...

మీ దగ్గరి నుంచి ఓట్లు దోసుకున్నదెవరు?యెన్నికలు తేంగానాలో ప్రత్యేకంగా యేమీ జరిగీనయ్యా?మీ ప్రాంతం లోని వారే అబ్యర్ధులుగా నిలబడితే మీరు ఓట్లు వేస్తేనే గద వాళ్ళుగెలిచేది. అవునా కాదా?
----
మరి దీని సంగతేమిటి?అప్పుడు మీ ప్రాంతం నించి మీరు యెన్నుకుని అసెంబ్లీ కీ లోక్ సభ కీ పంపించిన వాళ్ళు యేమి చేశారు?

hariSbabu చెప్పారు...

నాలుగేళ్ళ చదువుతో స్థానికులై పోవడం?
------
మనదంతా ఒకే దేశం అనుకుంటే యెక్కడి కక్కడ స్థానికులే ఊండాలనుకోవటమే అసహజం.నిన్నటి కన్నా ఇవ్వాళ ఇవ్వాల్టి కన్నా రేపు సుఖంగా బతకాలనుకున్న వాడెవడయినా యెక్కడ తన కనుకూలమైన చోటు దొరికితే అక్కడ బతకాలనుకుంటాడు.పుట్టిన వూళ్ళోనే చచ్చేదాకా ఉండాలనుకోవటం అనాగరికం. మార్కెట్ ఎకానమీ మొత్తం ప్రపంచాన్నే కలిపేసే ఈ రొజుల్లో ఇంకా స్థానికుడు స్థానికేతరుడూ అంటారేమిటి?

hariSbabu చెప్పారు...

బ్రిటీషువాడు కూడా ఒక రాజ్యాంగాన్ని రాసుకొని దాని ప్రకారమే పాలించాడు
--------
బాగా అలోచించే అన్నారా ఈ మాట? వాడు రాసుకున్నది మనని దోచుకోవడానికి. మన రాజ్యాంగం అలా కాదే, అంబెద్కర్ లాంతి మేధావి అన్ని దేసాలూ తిరిగి అన్నింటి నుంచీ మన దేశానికి సరిపోయే విధంగా సంకలించినది.

దాన్నీ దీన్నీ యెలా పోలుస్తారు?

Matam Mallikharjuna Swamy చెప్పారు...

hariSbabu గారు మీరడిగిన ప్రశ్నలు:
మీ దగ్గరి నుంచి ఓట్లు దోసుకున్నదెవరు?యెన్నికలు తెలంగానాలో ప్రత్యేకంగా యేమీ జరిగీనయ్యా?మీ ప్రాంతం లోని వారే అబ్యర్ధులుగా నిలబడితే మీరు ఓట్లు వేస్తేనే గద వాళ్ళుగెలిచేది. అవునా కాదా?

ఈ ప్రశ్నలకు టీవీ చూసే ఏ చిన్నపిల్లడినడిగినా చెబుతాడు.

తెలంగాణా వాడే గెలిచినా ఇక్కడి వాడు తెలంగాణా అబివృద్ది కై అసెంబ్లీ లో వాదించినా - అధికారం, తగిన సంఖ్యా బలం లేక అరణ్య రోదనే నాటి నుంచి నేటికి.

తెలంగాణా కు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని అసెంబ్లీ లో మాట్లాడే సీమంధ్ర ముఖ్యమంత్రులున్న ఈ ఆంధ్ర దేశంలో ఇక్కడ ఎవరు గెలిచినా జరిగేదేమీ ఉండదు. ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే మోసాల పుట్టల గుట్టలు లేక్కనేనన్ని. మచ్చుకి:

బొగ్గు గనులు తెలంగాణా లో పెట్టుకుని ఆంధ్రా లో ఫ్యాక్టరీలు పెట్టుకున్న సీమంధ్ర పెట్టుబడుదారులున్నంత కాలం తెలంగాణా పరిస్థితి ఇంతే.

ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందని ఊహించే ఆనాడు ఆంధ్రాలో విలీణం చేయొద్దని యావత్ తెలంగాణా ఘోషించింది - అందుకే ఫజల్ అలీ తెలంగాణా సపరేట్ రాష్ట్రంగా చేయమన్నది.

అందుకే గదా నెహ్రూ ఆంధ్రా- తెలంగాణా కలపనని మొండికేసి 4 ఏళ్ళు నిలిపి ఉంచింది.

అందుకే స్వయంపాలనతోనే అభివృద్దిని కోరుకుంటుంది తెలంగాణా.

మీ ప్రశ్నలకి సమాధానం దొరికినదనుకుంటాను.

సమతలం చెప్పారు...

HariSbabu
నీకు కనీస అవగాహన లేదని అర్ధమఔతుంది. నేను రాసింది నీకు ఇసుమంత అర్ధమైన ఇన్ని మాటలు మాట్లాడవు.
అర్ధబలం, అంగబలంతో సీమాంధ్ర ఆధిపత్య వర్గాలు సీట్ల రూపకం లో ఓట్లు దోచుకున్నరు అన్నది నీ బుర్రకు అర్ధం కాకపోతే నేనేమీ చేస్తాను. మళ్ళీ మాట్లాడకు.

hariSbabu చెప్పారు...

సోదరులకి నమస్కారం,
ఫజలాలి కమిషన్ ముందు జయసంకర్ గారు ఇచ్చిన రెపోర్టు - మొత్తం చదవలేదు గానీ తెలంగాణా ఉద్యమ చరిత్ర గురించి వొచ్చిన ఒక బ్లాగులో సారం చదివాను.మీ కోరిక లో న్యాయముందని తెలిసి మీరు ఈసారైనా సఫలీక్ర్తులయితే బాగుండునని ఆసించిన ఆంద్రా వాళ్ళలో నేను కూదా ఒకడిని,తేదీ సరిగా గుర్తు లేదు కనీ గుందెఘోష బ్లాగులో నేనొక పోస్టు వేసాను.దాని లోని విషయమేమిటంటే 2014 లోపు మీరు సాధించగలిగిసాధించుకోవాలనె సూచన ఇవ్వడం.
నాకు బుర్ర లేక పోవడం కాదు, మీరు తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి, అవి మీకు చెప్పాలని ఇలా కెలుకుడు మదలెట్టాను.మీరు పైన మీకు జరిగినయ్యని అంటున్న, నిజంగానే జరిగిన ఘోరాలన్నీ చెసింది కాంగ్రెసు పార్టీ. మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అన్నది కూడా కాంగ్రెసు పార్టీ వాడే.
మీరు ఆంద్రొళ్ళు దోపిడిదారులు అని యే తప్పుల్నయితే యెత్తి చూపించారో ఆ తప్పులన్నె కేవలం కాంగ్రెసు వాళ్ళకే చెందుతాయి.అలాంటి కాంగ్రెసు సాయం తో రాష్ట్రాన్ని సాధించుకుంటూ ఆ పార్టీని తిట్టలేని మొహమాటం తో "కాంగ్రెసోళ్ళు" అని అనాల్సిన దాన్ని అలా "ఆంధ్రోళ్ళు" అని మార్చాల్సి వొచ్చిందని నేననుకుంటున్నాను.
తిట్టిపొయయాల్సిన శత్రువు చేతినుంచి అందుకుంటూ, ఇప్పుడు గీసిన గీతకి ఇవతలున్న నాలాంటి మిత్రుల్నె ఆ తప్పులతో యే సంబంధమూ లేని అమాయకుల్ని తిట్టి తెచ్చుకున్నారు.గెలుపు మెరుపుని చూసి హుషారుగా ఉండవద్దనను. మిమ్మల్ని వెక్కిరించటానికని వెటకారంగా ఈ మాట చెప్పటం లేదు.నాకు ఆ భావం యెప్పుడూ లేదు. సమతలం గారూ, నేను మదట్లో కొంచెం తేడాగా మాట్లాడడం వల్లనె కదా నాకు బుర్ర లేదనడం వరకూ మీరొచ్చారు.మరి తప్పు చెయ్యని వళ్ళను తిడితే వాళ్ళకి కష్టం కలగదా?మా లాంటి వాళ్ళకి!
గెలుపు మెరుపుని అనుభవించండి, దానితో పాటు ఈ మరకని కూడా వొదిలించుకోండి.మీ పరిస్థితి నాకు తెలుసు, ఇలా కాకుండా అసెంబ్లీ లో బిల్లు పెట్టటం ద్వారా ఐతే ఈ సారి కూడా అదీయాసే ఐపొయేది.కాంగ్ర్సు వాళ్ళే క్రాసు వోటింగులతో చెదగొట్టేసే వాళ్ళు.
కాంగ్రెసు పట్ల తస్మాత్ జాగ్రత్త! మరో సారి ఆల్ ద బెస్ట్!!

సమతలం చెప్పారు...

ఆంధ్ర ఆదిపత్యంలో వున్న కాంగ్రెస్, టిడిపి, వైసీపీ అన్నీ ఒక్కటే. ఆంధ్రోల్లు అంటే మేము అనేది ఆంధ్ర ఆదిపత్యవర్గాలు అని. ఆంధ్రోల్లు అందరూ అని కాదు.

garam chai చెప్పారు...

hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

GKR CHANNEL చెప్పారు...

good morning
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/

Picture Box చెప్పారు...

good blog
https://goo.gl/Ag4XhH
plz watch our channel

Picture Box చెప్పారు...

nice article
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel